ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది మృతి | At least 85 killed in S Sudan oil tanker explosion: presidency | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది మృతి

Published Thu, Sep 17 2015 8:16 PM | Last Updated on Sun, Sep 3 2017 9:34 AM

At least 85 killed in S Sudan oil tanker explosion: presidency

జుబా:  ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది దుర్మరణం చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడినట్టు అక్కడి ప్రభుత్వం అధికారకంగా గురువారం వెల్లడించింది. దక్షణ సూడన్ రాజధాని జూబాకు 250 కిలోమీటర్ల దూరంలో మార్థి అనే చిన్న టౌన్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఇంధనాన్ని వెలికితీస్తుండగా ప్రమాదవాశాత్తూ ఆయిల్ ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి.

ఈ పేలుడు ధాటికి తీవ్ర గాయాల పాలైన బాధితులందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం మార్ధి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.  మంటల తీవ్రత కారణంగా శరీర భాగాలు కాలిపోవడంతో మంట భరించలేక క్షతగాత్రులంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రిలో ఇచ్చే మందులు కూడా బాధితులకు ఉపశమనం అందించలేకపోతున్నాయని చాంధీ సేవియర్ అనే వైద్యుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement