
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్‌లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్‌లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు.
నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
కాగా బీహార్‌లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్‌లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్‌మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl
— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024
Comments
Please login to add a commentAdd a comment