beer bottles
-
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్‌లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్‌లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
కోళ్ల దాణా.. బీర్ల తయారీ!
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.దళారులు పుట్టుకొస్తున్నారు..చోటామోటా బియ్యం డాన్లతో పాటు భారీ డాన్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం. అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు -
బీర్ల లోడు నేలపాలు.. సీసాల కోసం జనం పాట్లు
అనకాపల్లి: జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకవైపు బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. బీర్లు సీసాల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలను పట్టుకెళితే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్‌తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్‌లాండ్‌లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్‌హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్, ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలోని విమానాల రన్‌వేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ తెలిపారు. -
హోలీ వేడుకల్లో బీర్ బాటిళ్లతో హల్చల్.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, మహబూబాబాద్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో హోలీ సంబరాలు ఫుల్ జోష్ మధ్య జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా, రంగు రంగుల కలర్స్, డాజే పాటలతో హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఆంక్షలు లేకపోవడం తో యువత పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మందు బాటిళ్లతో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో భాగంగా బీర్ల వర్షం కురిపించారు. మందు బాటిల్‌తో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తలకు స్వయంగా మందు బాటిల్ నోట్లో పెట్టి ఎమ్మెల్యే మందు పోసి హంగామా సృష్టించారు. కార్యకర్తలు కూడా మద్యం కొట్టి ఎమ్మెల్యేతో సందడిగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలతో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్చల్ చేయడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. చదవండి: హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ డీజే స్టెప్పులు -
ఎవరూ చూడట్లేదనుకుని బీర్ కేసులను..
లూసియానా: దొంగలు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఓ జంట ఏకంగా బీర్ కేసులనే దొంగిలించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ దంపతులను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని లూసియానాలో మాత్యూ ఫోర్బ్స్, అష్లే ఫోర్బ్స్ దంపతులు మద్యానికి బానిసయ్యారు. ఈ క్రమంలో షాపుల్లో చొరబడి మద్యాన్ని ఎత్తుకెళ్లేవారు. వీరి నిర్వాకం గురించి తెలిసిన కొన్ని సంస్థలు తమ దుకాణాల్లో వారి ప్రవేశాన్ని నిషేధించాయి. అయినప్పటికీ వారు తీరు మార్చుకోలేదు. ఎంతో చాకచక్యంగా షాపుల్లో దూరి కావాల్సిన బీర్ క్యాన్లను ఎంపిక చేసుకుంటారు. అనంతరం ఎవరూ వాళ్లను గమనించట్లేదని నిర్ధారించుకోగానే వాటిని తస్కరిస్తారు. ఎలాంటి బిల్లు కట్టకుండా వాటితో పరారయ్యేవారు. తాజాగా మాత్యూ ఫోర్బ్స్ ఇదే సూత్రాన్ని ఫాలో అయి బీర్ బాటిళ్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేయగా అది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరో షాపులో వస్తువులతో సహా ఉడాయించేందుకు సమాయత్తమవుతున్న అతని భార్య అష్లేను సైతం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇరువురిని జైలుకు తరలించి విచారణ చేపట్టారు. కాగా ఇప్పటివరకు ఈ జంట వెయ్యి డాలర్లకు పైగా (సుమారు రూ.73 వేల) విలువైన మద్యాన్ని చోరీ చేయడం గమనార్హం. అష్లేపై గతంలో మాదక ద్రవ్యాల కేసు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బీరు తాగడంలేదనే కోపంతో స్నేహితుడిపై దాడి
బంజారాహిల్స్: తనతో పాటు బీరు తాగడం లేదన్న కోపంతో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం బంటుమిల్లు గ్రామానికి చెందిన ఎం. దినేష్ ఇంటర్ చదువుకుంటున్నాడు. ఓ కేసులో బెయిల్ రాగా ప్రతి సోమవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 8.30 గంటలకు రైలు దిగి తన స్నేహితుడు గణేష్‌తో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హాజరు సంతకం చేశాడు. బయటకు వచ్చాక మరో స్నేహితుడు నవీన్ బాగా గుర్తు చేస్తున్నాడని ఒకసారి కలుద్దాం అంటూ గణేష్ చెప్పడంతో ఇద్దరూ కలిసి నవీన్ నివసించే ఎస్పీఆర్హిల్స్ శ్రీరాంనగర్ సమీపంలోని సంజయ్‌నగర్ మార్కెట్ పక్కన హనుమాన్ టెంపుల్ గుంతలో గోరఖ్‌నాథ్ టెంపుల్‌ను ఆనుకొని దినేష్, గణేష్, నవీన్, సాయి నలుగురు స్నేహితులు కలిసి మద్యం తాగుతున్నారు. దినేష్ మద్యం తాగకుండా కూర్చోవడంతో పలుమార్లు నవీన్ బతిమిలాడాడు. అయినా సరే తనకు ఇష్టం లేదని చెప్పడంతో తాగుతున్న బీరు సీసాను పగులగొట్టిన నవీన్ కోపంతో దినేష్ తల, వీపుపై గట్టిగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం మధ్య విలవిల్లాడుతున్న దినేష్‌ను అక్కడే ఉన్న సాయి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. దినేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నవీన్ ప్లంబర్‌గా పని చేస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు
సాక్షి, సిద్దిపేట అర్బన్ : వైన్స్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి సీసీ కెమెరాలు, ఫ్రిజ్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఎన్సాన్పల్లి గ్రామంలో జరిగింది. సిద్దిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సాన్పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ నిర్వహకుడు కొండం బాలకిషన్ గౌడ్ శుక్రవారం రాత్రి షాప్‌ను బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాప్ నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు షాప్ నిర్వహకుడికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని షాప్ తెరిచి చూడగా సీసీ కెమెరాల మానిటర్, ఫ్రిజ్, అందులోని మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయని గుర్తించాడు. వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై షాప్ నిర్వహకుడు బాలకిషన్‌గౌడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కోటేశ్వర్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాలలో బీరు బాటిల్స్ లోడ్ లారీ దగ్ధం
-
బీరు బాటిల్స్ లోడ్‌తో వెళుతున్న లారీ దగ్ధం
సాక్షి, కర్నూలు : బీరు బాటిల్స్ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం.. అవి వేగంగా వ్యాపించడంతో చూస్తుండగానే లారీ మొత్తం దగ్ధమైంది. లారీ బీర్ బాటిళ్ల లోడ్ ఉండటంతో మంటలు మరింత చెలరేగాయి. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు మంటలను అదుపు చేసే క్రమంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నంద్యాలలో బీరు బాటిల్స్ లోడ్ లారీ దగ్ధం -
టెక్కలిలో బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలోని సుదర్శన్ థియేటర్ సమీపంలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. పరస్పరం బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు..మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. సుదర్శన్ థియేటర్ సమీపంలో ఉన్న రాజా వైన్స్‌లో కొందరు యువకులు గురువారం మధ్యాహ్న సమయంలో మద్యం సేవిస్తున్నారు. వారి పక్కనే స్థానికంగా నివాసముంటున్న మరికొంత మంది యువకులు మరో టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్నారు. ఒక టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్న వారు సిగరెట్ తాగటం మరో టేబుల్ వద్ద కూర్చున్న యువకులకు నచ్చలేదు. వేరే దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగండని చెప్పడంతో రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. మాటలతో ప్రారంభమైన గొడవ బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఒకవర్గం యువకులు స్ధానికంగా నివాసముంటున్న వారు కాగా మరోవర్గం యువకులు పక్కనే ఉన్న ఖైజోల గ్రామానికి చెందినవారు. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖైజోల గ్రామానికి చెందిన యువకులను ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో పాల్గొన్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన పాతకక్షలు
విశాఖపట్నం, గాజువాక: గంగవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో దగ్గరి బంధువే ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఉదంతంతో గాజువాక ప్రాంతం ఉలిక్కి పడింది. అత్యంత కిరాతకంగా చేసిన ఈ హత్యకు సంబంధించి న్యూ పోర్టు పోలీసులు, గంగవరం గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనరాజు (29), చోడిపిల్లి నరేష్ దగ్గరి బంధువులు. ఇద్దరూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న పోలారావు అనే వ్యక్తి ధనరాజుకు మేనమామ. అతడు నరేష్ సోదరికి భర్త. వేరే మహిళతో పోలారావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయంపై వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ధనరాజు కూడా తన మేనమామకు మద్దతుగా వెళ్లి నరేష్‌తో గొడవపడ్డ సందర్భాలున్నాయి. దీంతో వారి మధ్య కక్షలు చోటుచేసుకున్నాయి. మాటువేసి కిరాతకంగా హత్య పెదగంట్యాడలో బుధవారం జరిగిన ఒక పరసకు వెళ్లిన పోలారావు, ధనరాజు, నరేష్ కలిసి మద్యం సేవించారు. రాత్రి పది గంటల సమయంలో గంగవరం గ్రామానికి చేరుకున్న తరువాత పాతగొడవలు, వివాహేతర సంబంధాలపై గాంధీ జంక్షన్ వద్ద మళ్లీ గొడవ మొదలైంది. ఈ గొడవ సాగుతుండగానే పోలారావు అక్కడికి సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో నరేష్ కూడా వెళ్లిపోతున్నట్టుగా నమ్మించి... ధనరాజు ఇంటికి వెళ్లే మార్గంలోని ఒక గ్రౌండ్ వద్ద తన స్నేహితులతో కలిసి మాటు వేశాడు. కొద్ది సేపటి తరువాత తన ఇంటికి వెళ్తున్న ధనరాజుపై తన స్నేహితులతో కలిసి నరేష్ దాడికి పూనుకున్నాడు. ఈ సంఘటనలో బీరు బాటిల్‌తో ధనరాజు తలపై గట్టిగా మోదడంతోపాటు అదే బీరు బాటిల్‌తో అతడి గొంతుకోసి హత్య చేశాడు. ధనరాజు మృతి చెందాడని నిర్థారించుకున్న తరువాత అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. అర్ధరాత్రి కావస్తున్నా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో అతడి తల్లి సింహాచలం గాంధీ జంక్షన్‌కు సమీపంలో ఉంటున్న పోలారావు ఇంటికి వెళ్లింది. తాను చాలాసేపటి క్రితమే ఇంటికి వచ్చేశానని చెప్పడంతో గ్రామంలో వెతకడం ప్రారంభించారు. దీంతో గ్రౌండ్ వద్ద రక్తపు మడుగులో ధనరాజు శవమై కనిపించాడు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని 108 అంబులెన్స్‌కు, న్యూపోర్టు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ధనరాజు మృతి చెందినట్టు నిర్థారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో.. బీరుసీసాలతో దాడి!
సాక్షి, రాజన్న సిరిసిల్లా : హనుమాజీ పేట గ్రామంలోని పర్మిట్ రూమ్ వద్ద నలుగురు వ్యక్తులు నానా హంగామాచేశారు. మద్యం మత్తులో ఒకరిపైఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలతోనే ఒకరిపై ఒకరు ఈ దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేములవాడ రూరల్ పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వేములవాడ మండలం మల్లారంకు చెందిన గంగరాజు, ప్రవీణ్, జానీలతో పాటు చందుర్తి మండల మూల పల్లెకు చెందిన ప్రశాంత్‌లు పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఉండగా.. మాటలతో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో బీరుసీసాలతో కొట్టుకున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. -
బీర్ బాటిళ్ల జామ్.. అసెంబ్లీ వాయిదా!!
బీర్ బాటిళ్ల కారణంగా అసెంబ్లీ వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర విధాన్ భవన్‌లోని పవర్ హౌజ్ గదిలోకి నీళ్లు చేరటంతో సభను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటించారు. అయితే అందుకుగల కారణం తెలిశాక అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గత 57 ఏళ్లలో సమావేశాలు వాయిదా పడటం ఇది రెండోసారి. పవర్ హౌజ్‌లో నీరు చేరటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సభను వాయిదా వేశారు. అయితే భారీ వర్షం.. విధాన్ భవన్ డ్రైనేజీ బ్లాక్ కావటంతో నీరంతా టాన్స్‌ఫార్మర్ ఉన్న రూమ్‌లోకి చేరినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్రవారం స్వయంగా స్పీకర్ హరిబౌ బగాదే స్వయంగా క్లీనింగ్ చర్యలను పర్యవేక్షించారు. తీరా సిబ్బంది డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు భారీ మొత్తంలో బయటపడటంతో అంతా ఖంగుతిన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దుమారం మొదలైంది. కాంగ్రెస్‌తోపాటు, శివ సేన.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం పనితీరు ఇదేనని, నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తుండగా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. -
తెలంగాణ బీరు ఆంధ్రాలో
అనంతపురం, కళ్యాణదుర్గం: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో మద్యం దుకాణదారులు సాగిస్తున్న అక్రమ అమ్మకాలు బహిర్గతమయ్యాయి. నిబంధనలు తుంగలోకి తొక్కిన విషయాలు కూడా వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తో తయారు చేసిన కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లు లభించడం గమనార్హం. వివరాల్లోకెళితే... ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణ, ఎస్ఐ హరినాథ్ శుక్రవారం సాయంత్రం గాంధీచౌక్‌లోని మద్యం దుకాణం కళ్యాణి – 3పై దాడి చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తో ఉన్న కింగ్‌ఫిషర్ బీరుబాటిల్ కేస్ లభ్యమైంది. అంతేకాదు తక్కువ ధర మద్యంతో మొదలుకుని ఎక్కువ ధర మద్యం వరకు లూజు అమ్మకాలు కనిపించాయి. వాటిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు షాపు వద్దకు వెళ్లి హడావుడి చేశారు. కళ్యాణి మద్యం దుకాణాలు పట్టణంలో మూడు ఉన్నాయి. ఇవన్నీ యార్డు చైర్మెన్ నారాయణ, ఆయన అనుచరులు లక్కీ లాటరీలో దక్కించుకుని నడుపుతున్నారు. దీంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా సీఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె ససేమిరా అనడంతో కొద్దిసేపు వాదనకు దిగారు. ఫలితం లేదని భావించి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడు మారుతీ చౌదరిని ఎక్సైజ్ స్టేషన్‌కు రప్పించారు. సీఐతో టీడీపీ నేతల వాగ్వాదం కేసు నమోదు చేయకూడదంటూ ఎమ్మెల్యే తనయుడు మారుతీ చౌదరి, యార్డు చైర్మెన్ నారాయణ, కో ఆప్షన్‌సభ్యుడు మురళి, మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనివారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణతో వాగ్వాదానికి దిగి రుబాబు చేశారు. దీంతో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చివరికి ‘కేసులు నమోదు చేస్తే ఏమవుతాయిలే...’ అంటూ నాయకులు వెళ్లిపోయారు. అయితే కేసుల నమోదు విషయంలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. స్టేషన్లో గందరగోళ పరిస్థితిని తెలుసుకున్న పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రణవి హుటాహుటిన కళ్యాణదుర్గం ఎక్సైజ్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ అన్నపూర్ణ, స్థానిక ఎక్సైజ్ సీఐ సృజన్‌బాబులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లభ్యమైన బీరు, మద్యం బాటిళ్లను పరిశీలించారు. అయితే కేసు నమోదు విషయాన్ని తర్వాత చెబుతామంటూ అధికారులు జారుకోవడం కొసమెరుపు. -
గుడి మొత్తం బీర్ సీసాలతో...
బ్యాంకాక్: ఆలయం.. మద్యం... ఈ రెండింటికి చాలా దూరం. అలాంటిది ఏకంగా బీర్ బాటిళ్లతోనే గుడి కట్టేస్తే ఎలా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో కొందరు దీనిని ఆచరించి చూపారు. బీర్ బాటిళ్లతో బుద్ధుడి ఆలయాన్ని నిర్మించగా, బౌద్ధ సన్యాసులే స్వయంగా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవటం గమనార్హం. ఖూన్ హన్ జిల్లా సిసాకెట్ ప్రొవిన్స్‌లోని ‘వాట్ పా మహా చెది కయూ’ బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన్న కొందరు బౌద్ధ సన్యాసులు కుప్పులు కుప్పలుగా పడి ఉన్న బీర్ బాటిళ్లను గమనించారు. వెంటనే వారికి ఓ ఆలోచన తట్టింది. ఇటుకలకు బదులుగా బీర్ బాటిళ్లతో అందంగా ఆ గుడిని రూపొందించారు. సుమారు 10 లక్షలకు పైగానే ఖాళీ బీర్ సీసాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్ సీసాలతో నిర్మించినవే. అంతెందుకు బుద్ధుడి చిత్రాన్ని కూడా బీర్ బాటిళ్ల మూతలను రీ సైక్లింగ్ చేసి తయారు చేయటం విశేషం. హైనకెన్, ఛాంగ్ అనే రెండు బీర్ కంపెనీలకు చెందిన సీసాలే ఉన్నాయంట. ఈ బీర్ టెంపుల్ ద్వారా సిసాకెట్ పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతోంది. -
బీరు లారీ బోల్తా
బెంగళూరు : తుమకూరు తాలూకా, నందిహళ్లి జాతీయ రహదారిలో బీరు లారీ బోల్తాపడింది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున బీరు బాటిళ్లు పగిలి భారీగా నష్టం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా స్థానికులతో పాటు అదే రహదారిలో వెళ్లే ద్విచక్ర వాహనదారులు వాహనాలు నిలిపి బాటిళ్లను పట్టుకుపోవడం కనిపించింది. ఈ సంఘటనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
బీర్ సీసాల నుంచి బీచ్ శాండ్
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇసుకకు భలే చిక్కు వచ్చిపడిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇసుక అక్రమ రవాణా విషయంలోనే ఓ మహిళా ఎమ్మార్వో... ఎమ్మెల్యే చేతిలో అవమానాలకు గురికావాల్సి వచ్చింది. అంతకుముందు కూడా ఇసుక తిన్నెల హక్కుల కోసం గొడవలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రస్తావన అంతా ఎందుకూ అంటే... న్యూజీల్యాండ్‌లోనూ ఇసుక మాయమైపోతోందట. కాకపోతే అక్కడ సమస్య సముద్ర తీరంలోని బీచ్‌శాండ్ కోసం. ఇక్కడ మనం నదుల ఇసుకను భవన నిర్మాణానికి వాడుతూంటే.. ప్రపంచవ్యాప్తంగా బీచ్‌శాండ్‌ను ఫార్మా రంగం నుంచి సిలికా తయారీ వరకూ అనేకచోట విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ చిక్కు సమస్యకు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుక్కుంది న్యూజీలాండ్‌కు చెంది ఆల్కహాల్ కంపెనీ ‘డీబీ ఎక్స్పోర్ట్’. ఫొటోలో కనిపిస్తున్న డబ్బాను చూశారు కదా... అందులో మద్యం బాటిల్ ఆకారంలో చిన్న కంత కనపడుతోందా? ఖాళీ చేసిన బాటిళ్లను ఈ కంతలో పడేస్తే చాలు... కేవలం ఐదంటే ఐదు సెకన్లలో అది ఇసుక వంటి పదార్థంగా మారిపోయి పక్కనున్న డబ్బాలో పడిపోతుంది. డీబీ ఎక్స్పోర్ట్ ఇలా సేకరించిన ఇసుకను నిర్మాణ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఇసుకగా మార్చే ముందు... ఈ మెషీన్లో బాటిల్‌పై ఉన్న ప్లాస్టిక్, కాగితం వంటివాటిని తీసేస్తారు. అన్నట్టు ఇంకో విషయం... ఈ డీబీ ఎక్స్పోర్ట్ కంపెనీ ఇలాటి వినూత్నమైన ఆలోచన చేయడం ఇదే మొదటిసారి కాదు.. కొంత కాలం క్రితం తమ ఫ్యాక్టరీల్లో వ్యర్థంగా మిగిలిపోతున్న మొలాసిస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు సొంతంగా పరిశోధన చేపట్టి విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ మొలాసిస్‌ను ‘బ్రూట్రోలియం’ పేరుతో బయోడీజిల్‌గా మార్చి వాడుతోంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బీరుసీసాల లారీ బోల్తా
నార్కట్‌పల్లి(నల్గొండ జిల్లా): నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్, క్లీనర్లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కొన్ని బీరు సీసాలు మాత్రం పగిలిపోయాయి. ఇదే అదునుగా కొందరు బీరుబాబులు తమ చేతికి పనిచెప్పారు. దొరికిన బీరుసీసాలను వెంట తీసుకెళ్లారు. -
బీరు బాటిళ్లతో ఫైటింగ్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్: మద్యం సేవించిన యువకులు బీరు బాటిళ్లతో రోడ్డుపైనే యుద్ధాన్ని తలపించే రీతిలో ఘర్షణ పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో నివసించే బిల్డర్ బి.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు రాజసింహారెడ్డి (18) లండన్‌లో చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులకు మాదాపూర్‌లోని ఓ పబ్‌లో విందు ఇచ్చారు. విందులో దాదాపు 37 మంది మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని పెట్రోల్ పంప్ పక్కన ఉన్న బరిస్తా వద్దకు చేరుకుని బీరు బాటిళ్లతో హోరాహోరీగా తలపడ్డారు. గాలిలోకి బీరు బాటిళ్లు విసురుతూ వీధిపోరాటానికి దిగారు. బీరు బాటిళ్లు ముక్కలుముక్కలుగా రోడ్డుపై పడి కొన్ని వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి వారంతా పరారయ్యారు. ఈ దాడిలో రాజసింహారెడ్డికి తీవ్ర గాయాలు కాగా అతడిని శ్రీనగర్‌కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీధి పోరాటానికి దిగిన వారిపై ఐపీసీ సెక్షన్ 427, 324, 506ల కింద కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ఓటుకు బిర్యానీ, బీరు!
మద్యం, డబ్బు ఎర వేసి ఓటర్లను ప్రభావితం చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారి చాలా కాలమయింది. సాధారణ ఎన్నికల నుంచి స్టూడెంట్ ఎలక్షన్స్ వరకు ఇది పాకింది. పవర్ పాలిటిక్స్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను అన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గెలుపు కోసం నానాగడ్డీ కరుస్తున్నారు. విద్యార్థి ఎన్నికలకూ ఈ రోగం అంటుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(యూఓహెచ్) విద్యార్థి ఎన్నికలు నేడు(అక్టోబర్ 30) జరిగాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రాబందులు క్యాంపస్‌లో వాలిపోయాయి. బిర్యానీ, బీర్ సీసాలు ఎర వేసి విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. రాత్రి విందులు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికెట్, మటన్ బిర్యానీ ప్యాకెట్లు పోటాపోటీగా పంచాయి. అలాగే తాము మద్దతిచ్చే వారికి ఓటు వేసేందుకు స్టూడెంట్స్‌కు లెక్కకు మిక్కిలి బీరు సీసాలు ఆఫర్ చేశారు. యూఓహెచ్‌లో విద్యార్థి ఎన్నికలు కొత్తేం కాదు. తమకు ఓటు వేయమని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడం గతంలోనూ జరిగింది. అయితే ఈసారి రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడంతో ఎన్నికల ముఖ'చిత్రం' మొత్తం మారిపోయింది. ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లో పదుల సంఖ్యలో జరిగిన విందులే ఇందుకు నిదర్శనం. కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రలోభాల పర్వం కొనసాగింది. ప్రచారానికి, ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో అభ్యర్థి రూ. 50 వేలు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విద్యార్థి విభాగాలకు చెందిన వారు పోటీ చేసేందుకు రూ. 4 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. లింగ్డో కమిటీ ప్రతిపాదనల ప్రకారం విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన ప్రచారానికి రూ. 5 వేలు మించి ఖర్చు చేయరాదు. కొంత అభ్యర్థులు తమ మేనిఫెస్టోతో 20 వేల కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు విద్యార్థి ఎన్నికలను వదల్లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విద్యార్థులు విజ్ఞతతో వ్యవహరిస్తేనే ఇటువంటి రాజకీయ పార్టీలు తోక ముడిచేది.