నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది.
నార్కట్‌పల్లి(నల్గొండ జిల్లా): నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్, క్లీనర్‌లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కొన్ని బీరు సీసాలు మాత్రం పగిలిపోయాయి.
ఇదే అదునుగా కొందరు బీరుబాబులు తమ చేతికి పనిచెప్పారు. దొరికిన బీరుసీసాలను వెంట తీసుకెళ్లారు.