నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మునగాల(నల్లగొండ): నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు టైల్స్ లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
దీంతో టైల్స్‌పై కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు.