tiles
-
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
ఆసియన్ గ్రానిటో రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 23 నుంచి
న్యూఢిల్లీ: టైల్స్ తయారీలో ఉన్న ఆసియన్ గ్రానిటో రూ.224.65 కోట్ల రైట్స్ ఇష్యూ సెపె్టంబరు 23న ప్రారంభం కానుంది. అక్టోబరు 7న ముగియనుంది. ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.100గా నిర్ణయించారు. ఇష్యూ తదనంతరం మొత్తం షేర్లు 3.42 కోట్ల నుంచి 5.67 కోట్లకు చేరతాయి. రుణాల చెల్లింపులకు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2–3 ఏళ్లలో రుణ రహిత కంపెనీగా నిలవాలన్నది ఆసియన్ గ్రానిటో లక్ష్యం. -
ఇంటిప్స్
♦ సిరామిక్ టైల్స్ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్ వేసి ఆరిన తర్వాత తుడిస్తే టైల్స్ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి. ♦ పిల్లల బట్టలపై స్టిక్కర్లు అంటుకున్నట్టయితే వాటిని వైట్ వెనిగర్‌లో నానబెట్టి రుద్దితే మరకలు మాయమవుతాయి. ♦ ఉడెన్ ఫర్నిచర్‌పై నెయిల్ పాలిష్ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. దానిపై మైనం పూస్తే చాలు, నెయిల్ పాలిష్ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్ పాలిష్ వేసినా సరిపోతుంది. ♦ ట్యూబ్స్, షవర్స్ క్లీన్ చేసుకోవడానికి ఫాస్ఫారిక్ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు. ♦ షవర్ రంధ్రాలు మూసుకుని పోతే నిమ్మకాయ రసంతో రుద్దాలి. ♦ దుస్తుల మీద పసుపు పడితే వెంటనే అంత వరకే నీళ్లలో ముంచి రుద్ది సబ్బుతో శుభ్రం చేసి ఎండలో ఆరేస్తే మరక గాఢత తగ్గి లేత గులాబీ రంగులోకి మారుతుంది. తర్వాత మామూలుగా నానబెట్టి ఉతికితే పూర్తిగా పోతుంది. -
టైల్స్ షాపులో చోరీ
చింతలపూడి: చింతలపూడి పట్టణానికి చెందిన గ్రాండ్ టైల్స్ అండ్ ఫర్నిచర్స్ షాపులో శనివారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది. షాపు వెనుక ఉన్న సిమెంట్ కిటికీ బద్దలు కొట్టి లోపలికి ప్రవేసించిన దొంగలు డ్రాయర్ సొరుగులోని 22 వేల నగదును దొంగిలించుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న షాపు యజమాని హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ సైదానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టైల్స్... స్టైల్స్..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో విలాసవంతమైన జీవనశైలి విస్తరిస్తున్న క్రమంలో... భవనాల అందాలను ఇనుమడింపజేసే ఇంటీరియర్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మోసుకొస్తోంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని లార్వెన్ టైల్స్ షోరూమ్‌లో కొత్త రకం టైల్స్ కలెక్షన్‌ను ఆదివారం నటి అక్షత ఆవిష్కరించారు. సంస్థ ఎం.డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
టైల్స్ లారీ బోల్తా: ముగ్గురు మృతి
మునగాల(నల్లగొండ): నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు టైల్స్ లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో టైల్స్‌పై కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. -
నాపరాయి కష్టాలు
♦ గ్రానైట్, టైల్స్ రావడంతో తగ్గిన వ్యాపారాలు ♦ వంద దాకా మూతపడిన పరిశ్రమలు ♦ రోడ్డున పడుతున్న కార్మికులు ♦ అయోమయంలో యజమానులు ఎర్రగుంట్ల : జిల్లాలోని పేరెన్నికగన్న నాపరాయి పరిశ్రమకు గడ్డు కాలం దాపురించింది. ఒకప్పుడు దేశవిదేశాలలో ఈ రాయికి యమ డిమాండ్ ఉండేది. వీటి యజమానులకు, ఆ పరిశ్రమపై ఆధారపడిన కూలీలకు ఉపాధి పుష్కలంగా ఉండేది. కాలక్రమేణ ఇతర ప్రాంతాల నుంచి గ్రానైట్, టైల్స్ ఆధునిక డిజైన్లతో రావడం, వాటి వినియోగం పెరగడంతో నాపరాయి పరిశ్రమలు మూత దిశగా ఉన్నాయి. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో కూలీలు నాపరాయి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో సుమారు ఈ పరిశ్రమలు 200 దాకా ఉండేవి. వీటిపై ఆధారపడి సుమారు 20 వేలకు పైగానే కూలీలు ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో నాపరాయి వ్యాపారం ఆరు దశాబ్దలుగా డిల్లీ నుంచి గల్లీ వరకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు కొనసాగేది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి ఉండేది. మొదట్లో రాళ్లను చేత్తో తొలచి మొలలు ద్వారా రాళ్లను చదరపు సైజలు తయారు చేసేవారు. నాపరాయి పరిశ్రమకు గనులు నుంచి ఎద్దుల బండలపై చేర్చేవారు. తరువాత కాలక్రమేణ లారీలు, ట్రాక్టర్ల రావడంతో వాటి ద్వారా తరలించేవారు. అటు తరువాత కొత మిషన్ వచ్చి గనులలో రాళ్లను సులభతరంగా రాళ్లను తీసి పరిశ్రమలకు చేర్చేవారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఇలా తీసిన రాళ్లను పరిశ్రమలకు చేర్చి వాటిని వివిధ ఆకారాలలో, సైజులలో అందంగా తయారీ చేసి వాటిని కోల్‌కతా, ముంబై, డిల్లీ, తమిళనాడు రాష్ట్రంతోపాటు న్యూజిల్యాండ్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు.గతంలో నిత్యం నాపరాయి లోడింగ్, అన్ లోడింగ్ వ్యాపారాలతో ఉండే ఈ పరిశ్రమ యజమానులు బిజీగా ఉండేవారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ఇళ్ల ముందు ముతక రాళ్లతో చప్పటి వేసేవారు. ఈ రాయిని ఎగుమతి చేసే ట్రేడర్లకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. వ్యాపారం లేక పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం వచ్చింది అంటే చాలు కూలీ ఖర్చులు కూడా రాలేదంటున్నారు ఇంటిలోని బంగారు నగలను బ్యాంకులో కుదవ పెట్టి రుణాలు, కూలీల డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వారు వాపోయారు. ప్రస్తుతం గ్రానైట్, టైల్స్ వ్యాపారం ఎక్కువ కావడంతో గడ్డు నాపరాయి పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వ్యాపారాలు సన్నగిల్లడం వల్ల పరిశ్రమ యజమానులు దిక్కుతోచని పరిస్థితి ఉన్నారు. వ్యాపారాలపై తెచ్చుకున్న రుణాలు చెల్లించలేక పరిశ్రమలు మూతలు వేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు మున్సిపాలిటీ పన్నులు అధికంగా ఉండడంతో యజమానులు అయోమయంలో పడ్డారు. నాపరాయికి గడ్డుకాలం ఇంతటి ప్రాధాన్యత గల నాపరాయి పరిశ్రమకు ప్రస్తుతం గడ్డుకాలం వచ్చింది. చాలా వరకు పరిశ్రములు మూత పడ్డాయి. దీనికి కారణం గ్రానైట్ , టైల్స్‌తో పాటు అత్యనిధుక డిజైన్లుతో టైల్స్ రావడం వల్ల పరిశ్రమ దెబ్బతింది. ఇలా వ్యాపారం డీలా పడడంతో బ్యాంకుల అప్పులు కట్టలేక వ్యయం భరించలేక మూడు సంవత్సరాలుగా సుమారు వంద పరిశ్రమలు దాకా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కడప నాపరాళ్లను వినియోగించుకుంటే పరిశ్రమ కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కెతుందని పరిశ్రమ యజమానులు అంటున్నారు. -
అద్దండి... రుద్దండి...
చక్కెరతో చెక్ కాఫీలో చక్కెర తక్కువైతే చుక్క కూడా తాగలేం. చక్కెరతో నోరు తీపి చేయనిదే ఏ శుభవార్తనీ చెప్పలేం. అయితే చక్కెర రుచినిచ్చేదీ, సంతోషాన్ని రెట్టింపు చేసేది మాత్రమే కాదు... ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా. చేతికి నూనె, గ్రీజు లాంటివి అంటుకుని జిడ్డు వదలడం లేదనుకోండి. అప్పుడు కాసింత చక్కెరను, కొన్ని చుక్కల నీటిని చేతుల్లో వేసుకుని బాగా రుద్దుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకుంటే జిడ్డు మాయమైపోతుంది; వెనిగర్‌లో పంచదార వేసి, కరిగిన తర్వాత ఆ మిశ్రమంతో తుడిస్తే, మొజైక్ నేలమీద ఉన్న మరకలు తొలగిపోతాయి; దుస్తుల మీద మొండి మరకలు ఉంటే... టొమాటో రసంలో చక్కెర కలిపి దాన్ని మరకమీద వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత బాగా రుద్దితే మరకలు వదిలిపోతాయి; రోజ్‌వాటర్‌లో చక్కెర వేసి, కరిగిన తర్వాత దానితో వెండి వస్తువులను తోమితే తళతళలాడతాయి; బేకింగ్ సోడా, చక్కెర కలిపి మెత్తని పొడిలా చేసుకుని, దాన్ని నీటిలో కలిపి చిక్కని ద్రావకంలా చేసుకోవాలి. దీనితో కనుక గిన్నెలు కడిగితే... జిడ్డు, మసి పోయి పాత్రలు మెరిసిపోతాయి; నిమ్మరసంలో చక్కెర వేసి కరగనివ్వాలి. ఓ స్పాంజిని ఈ ద్రావకంలో ముంచి తుడిస్తే వస్తువులు, గిన్నెలు, బట్టలు... దేనిమీద పడిన తుప్పు మరకలైనా వదిలిపోతాయి. అలాగే దీనితో కిచెన్‌లో బండలు తుడిస్తే మురికిపోయి బండలు శుభ్రపడతాయి. -
సృజనాత్మకతకు మారుపేరు.. టైల్ డిజైనింగ్!
గదికి అందాన్ని, చూపరులకు ఆహ్లాదాన్ని కలిగించేవి.. వర్ణరంజితమైన టైల్స్. ఇవి ఒకప్పుడు సౌకర్యం కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా మారిపోయాయి. నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, ఫుట్‌పాత్‌లు... అనే తేడా లేకుండా అన్నిచోట్లా టైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ వీటి వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో టైల్ డిజైనర్లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. సృజనాత్మకత కలిగిన డిజైనర్లకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పూర్తి భరోసా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అవకాశాలు, ఆదాయం భారత్‌లో టైల్ డిజైనింగ్ పరిశ్రమల్లో డిజైనర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలు కూడా వీరిని నియమించుకుంటున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా సృజనాత్మకత, శ్రమకు వెనుకాడని తత్వం ఉంటే టైల్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకోవచ్చు. వినియోగదారులకు సంతృప్తి కలిగించే డిజైన్లను సృష్టించగలిగే ప్రతిభ ఉంటే అవకాశాలకు లోటే ఉండదు. కావాల్సిన స్కిల్స్: టైల్ డిజైనర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకోవాలి. ఈ రంగంలో ప్రపంచస్థాయిలో వస్తున్న మార్పులను, మార్కెట్ అవసరాలను, వినియోగదారుల అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తదనుగుణంగా నూతన డిజైన్లను సృష్టించగలగాలి. ఫోటోషాప్, కోరల్డ్రా వంటి సాంకేతికాంశాలను నేర్చుకోవాలి. మార్కెట్లో నిలదొక్కుకునేందుకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అర్హతలు: మనదేశంలో ఫైన్ ఆర్ట్స్/డిజైనింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్సుల్లో భాగంగా టైల్ డిజైనింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్మీడి యెట్లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. సిరామిక్ ఇంజనీరింగ్ కోర్సు చదివినవారు కూడా టైల్ డిజైనర్‌గా స్థిరపడొచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఔత్సాహికులకు దీనిపై శిక్షణ ఇస్తున్నాయి. వేతనాలు: టైల్ డిజైనింగ్ సంస్థలో ట్రైనీకి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే రూ.40 వేలకు పైగానే పొందొచ్చు. సొంతంగా డిజైనింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకొని, కష్టపడి పనిచేస్తే ఆదాయానికి ఆకాశమే హద్దు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు కాలేజీ ఆఫ్ ఆర్ట్-ఢిల్లీ వెబ్సైట్: http://delhi.gov.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.nid.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: www.nift.ac.in/Delhi/ సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై వెబ్సైట్: www.sirjjschoolofart.in ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా వెబ్సైట్: www.msubaroda.ac.in సరికొత్తగా డిజైన్ చేయాలి! శ్రీటైల్ డిజైనింగ్ కోర్సులను ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా నేర్చుకుంటారు. సృజనాత్మకత ఉన్నవారు టైల్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధిస్తే అవకాశాలకు కొదవలేదు. వివిధ ప్యాట్రన్స్‌పై అవగాహన ఉండి, సరికొత్తగా డిజైన్ చేసే సత్తా ఉంటే కెరీర్లో సులభ ంగా రాణించొచ్చు. అనుభవం, వ్యక్తిగత నైపుణ్యాలను బట్టి వేతనాలు మారుతుంటాయి. టైల్ డిజైనింగ్‌లో నైపుణ్యం పొందిన వారు సొంతంగా కూడా నివాస గృహ నిర్మాణాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. టైల్స్ విక్రయ మార్కెట్లోకి ప్రవేశించొచ్చ్ణు - వి. హరిప్రియ, చీఫ్ ఆర్కిటెక్ట్, కర్వ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్