
♦ సిరామిక్ టైల్స్ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్ వేసి ఆరిన తర్వాత తుడిస్తే టైల్స్ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి.
♦ పిల్లల బట్టలపై స్టిక్కర్‌లు అంటుకున్నట్టయితే వాటిని వైట్ వెనిగర్‌లో నానబెట్టి రుద్దితే మరకలు మాయమవుతాయి.
♦ ఉడెన్ ఫర్నిచర్‌పై నెయిల్ పాలిష్ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. దానిపై మైనం పూస్తే చాలు, నెయిల్ పాలిష్ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్ పాలిష్ వేసినా సరిపోతుంది.
♦ ట్యూబ్స్, షవర్స్ క్లీన్ చేసుకోవడానికి ఫాస్ఫారిక్ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు.
♦ షవర్ రంధ్రాలు మూసుకుని పోతే నిమ్మకాయ రసంతో రుద్దాలి.
♦ దుస్తుల మీద పసుపు పడితే వెంటనే అంత వరకే నీళ్లలో ముంచి రుద్ది సబ్బుతో శుభ్రం చేసి ఎండలో ఆరేస్తే మరక గాఢత తగ్గి లేత గులాబీ రంగులోకి మారుతుంది. తర్వాత మామూలుగా నానబెట్టి ఉతికితే పూర్తిగా పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment