రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది.
బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.
కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment