Tejaswi Yadav
-
సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
నీట్ పేపర్‌లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
పాట్నా: నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌లీక్‌లో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.పేపర్‌లీక్‌లో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వియాదవ్ పీఏకు పరిచయం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ నితీష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. అసలు నీటి పేపర్ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమారే అన్నారు. బీజేపీ బిహార్‌లో పవర్లోకి వచ్చినప్పుడల్లా పేపర్‌లీక్‌లు జరుగుతున్నాయన్నారు. నీట్ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ‘ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లీక్ వెనుక అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్లే’అని తేజస్వి ఆరోపించారు. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
ఫలితాల తర్వాత నితీష్ ఏదైనా చేయొచ్చు: తేజస్వి
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు. -
జనగణన లేకుండా ఈ లెక్కలేల?
పటా్న: ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని నిలదీశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై తేజస్వీ స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లింల మధ్య మోదీ సర్కార్ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు? 2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే ప్రధాని. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని విడనాడండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని ప్రధానికి తేజస్వీ హితవు పలికారు. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఏ క్రాస్ కంట్రీ అనాలసిస్(1950–2015) పేరిట ఈఏసీ–పీఎం ఒక నివేదిను తయారుచేసింది. 1950వ సంవత్సరంను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే దేశ జనాభాలో 84.68 శాతంగా ఉన్న హిందువులు 2015 ఏడాదివచ్చేసరికి 78.06 శాతానికి తగ్గారు. అంటే దేశజనాభాలో హిందువుల వాటా 7.82 శాతం తగ్గింది. అదే సమయంలో దేశజనాభాలో ముస్లింలు 9.84 శాతంగా ఉంటే 2015 ఏడాదినాటికి దేశజనాభాలో వారు 14.09 శాతానికి పెరిగారని నివేదిక పేర్కొంది. -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్
పాట్నా: మీరు చేప, ఏనుగు లేదా గుర్రాన్ని తినండి. ఇలా చూపించడం ఎందుకు? అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల్ని జైల్లో పెట్టిస్తాంటూ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఒకరైన పాటలీపుత్ర లోక్‌సభ అభ్యర్ధి మిసా భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఈ తరుణంలో అలయన్స్‌లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం తరుపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీహార్‌లోని జమూయిలో ఎన్డీయే అభ్యర్థి, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ నేత అరుణ్ భారతికి మద్దతుగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. మాంసాహారం తింటూ వీడియోలు ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘కొంతమంది నాయకులు ఓ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నవరాత్రుల సమయంలో మాంసాహారం తింటున్న వీడియోల్ని పోస్టు చేశారని’ ఆరోపించారు. మీరు తినే తిండి మాకు చూపించడం ఎందుకు? ‘నవరాత్రులలో చేపలు తింటున్నావు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు. చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను. ఇందులో చూపించాల్సిన అవసరం ఏముంది. ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసమేనని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓటు వేస్తారని భావిస్తున్నారు అని ఆరోపించారు. మోదీని జైల్లో వేస్తారా? లాలూ ప్రసాద్ యాదవ్‌ను తన స్నేహితుడంటూ.. ఆయన కుటుంబ సభ్యులు.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోదీని జైల్లో పెడతామని చెబుతున్నారు. జైల్లో లేదా బెయిల్‌పై ఉన్నవారు మోదీని జైలుకు పంపిస్తారా? బీహార్ ప్రజలు అన్నింటినీ సహిస్తారు, కానీ ఇది కాదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మరోసారి మోదీయే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోందని, వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ఇతర దేశాలు ఆయనను ఆహ్వానించడం ప్రారంభించాయని,ఈ ఎన్నికలను లాంఛనప్రాయంగా చూస్తున్నారని తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసిస్తూ, యువ నాయకుడు ఎన్డీయే పిచ్‌పై రన్ హిట్టర్ అని, అవసరమైనన్ని పరుగులు చేస్తారని కొనియాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ కలలను ఆయన నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. -
మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్
బిహార్‌లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. నితీష్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అన్నారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే.. ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. ‘నేను సీఎం నితీష్ కుమర్‌కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్‌వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్‌కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్) కొనసాగిస్తాడు. బిహార్‌లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు. నితీష్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్‌లోని మహాఘట్బంధన్ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్. చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్‌కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్‌లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్‌కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు
పట్నా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి, ప్రధాని మోదీ మహారాజు స్థానంలో ఉండాలనుకుంటున్నారని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దర్భంగాలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ పట్టించుకోరన్నది వాస్తవమన్నారు. ఎన్నికల్లో గెలవడం, అధికారం నిలుపుకోవడం మాత్రమే మోదీ లక్ష్యమని తేజస్వి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి, మహారాజుగా మారాలన్నది మోదీ కోరికని పేర్కొన్నారు. కానీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి షాక్ తప్పదని ఆయన స్పష్టం చేశారు. -
Patna: లాఠీఛార్జిలో బీజేపీ కార్యకర్త మృతి.. తీవ్ర ఉద్రిక్తత
పాట్నా: నితీశ్ సర్కారకు వ్యతిరేకంగా.. బీజేపీ చేపట్టిన ఆందోళన బీహార్ రాజధానిలో ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. అయినా పరిస్థితి అదుపు కాకపోవడంతో.. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లకూ పని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ఆరోపణలతో పాటుగా పలు అంశాలపై నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు గురువారం గాంధీ మైదాన్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు.. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు వాటర్ కెనన్లు ఉపయోగించి వాళ్లను చెదరగొట్టారు. అయితే లాఠీఛార్జిలో గాయపడిన ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో.. పాట్నాలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో జులై 3వ తేదీన సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. అందులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సైతం చేర్చింది. దీంతో తేజస్వి రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. पटना में बीजेपी नेताओं के मार्च के दौरान हंगामा, पुलिस ने बीजेपी नेताओं पर किया लाठीचार्ज#teachersprotest #Patna pic.twitter.com/uipUuklcI1 — Shashank Shekhar (@Shashan48591134) July 13, 2023 ఇదీ చదవండి: ఆ మాజీ సీఎం ఇంట్లోనే ఇక రాహుల్ గాంధీ ఉండబోయేది! -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ భరోసా ఇచ్చారు. ఆదివారం నితీశ్ ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. నితీశ్‌తో చర్చల అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును రాజ్యసభలో తిప్పికొట్టేందుకు మద్దతివ్వాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి కోరుతానన్నారు. రెండు, మూడు రోజుల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లను కలుస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడాలంటూ నితీశ్ కుమార్‌కు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. -
సోరెన్‌తో నితీశ్ భేటీ
రాంచీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్‌తో భేటీ తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం రాంచీకి చేరుకున్న నితీశ్.. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోపాటు సోరెన్‌తో చర్చలు జరిపారు. ‘ బీజేపీని ఓడించడం, విపక్షాలను ఏకతాటి మీదకు తేవడంపైనే చర్చించాం. ఈ సంప్రదింపుల ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరిత్రను తిరగరాయాలన్న బీజేపీ సర్కార్ కుతంత్రాలను మేం తిప్పికొడతాం. హిందూ–ముస్లిం ఐక్యతను మళ్లీ పునఃప్రతిష్టిస్తాం ’ అని నితీశ్ మీడియాతో అన్నారు. ఎన్డీఏయేతర పార్టీలను ఏకంచేసే క్రమంలో విపక్ష పార్టీల అగ్రనేతలతో వరసగా భేటీలను నితీశ్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీశ్ అక్కడ బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో గంటకుపైగా మంతనాలు జరిపారు. ఇటీవల ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లనూ కలిశారు. ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనూ నితీశ్ కలిశారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతోనూ భేటీ అయ్యారు. -
‘బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’
కోల్‌కతా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘జీరో’గా మారిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కేవలం మీడియా మద్దతు, అబద్ధాలతోనే బీజేపీ ‘పెద్ద హీరో’గా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీని కనుమరుగు చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సోమవారం బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సమావేశమయ్యారు. ఈ భేటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. 2024 జరిగే లోక్‌సభలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారు చర్చించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైనా కూటమిని ఎలా నిర్మించాలన్న దానిపై వారు చర్చించుకున్నట్లు తెలిసింది. విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా.. విపక్షాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని, ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవాలని నితీశ్ కుమార్ సూచించారు. మమతా బెనర్జీతో తమ సమావేశం సానుకూలంగా జరిగిందని అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. సొంత ప్రచారం కోసమే అధికార పక్షం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉన్నాయనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పోరాటం బిహార్ నుంచే మొదలైందని, బిహార్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తే బాగుంటుందని నితీశ్‌కుమార్‌తో చెప్పానని వివరించారు. విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా చేరుతుందా? అని ప్రశ్నించగా.. అన్ని పార్టీలూ భాగస్వామిగా ఉంటాయని మమత బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం మమతా బెనర్జీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. నితీశ్ కుమార్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాçహుల్ గాంధీని కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించారు. వృథా ప్రయాస: బీజేపీ మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ భేటీతో ఒరిగేదేమీ ఉండదని, అదొక వృథా ప్రయాస అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తేల్చిచెప్పారు. 2014చ 2019లో కూడా విపక్షాల ఐక్యత పేరిట ప్రయత్నాలు జరిగాయని, చివరకు ఏం జరిగిందో మనకు తెలిసిందేనని పేర్కొన్నారు. దేశ ప్రజలు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. అస్థిరమైన, అవకాశవాద కూటమికి ప్రజలు ఓటు వేయబోరని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో మనుగడను కాపాడుకొనేందుకు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ వెల్లడించారు. బీజేపీ విమర్శలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శాంతను సేన్ తిప్పికొట్టారు. 2024లో మళ్లీ అధికారం చేపట్టాలన్న బీజేపీ కలలు నెరవేరే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాలు ఒక్కటవుతుండడంతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. అఖిలేశ్‌తో నితీశ్ భేటీ లక్నో: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ సోమవారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి కూలదోయడానికి సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారని అఖిలేశ్‌యాదవ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల అనంతరం విపక్షాల కీలక భేటీ! న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక కూటమిపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్పష్టత రానుంది. ఆ ఎన్నికల తర్వాత 19 విపక్ష పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారని, కూటమి ఏర్పాటుపై చర్చిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపాయి. కూటమి విషయంలో ఆయన ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఖర్గే అతి త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం. -
ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం: సీబీఐ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్
న్యూఢిల్లీ: బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో నేడు (శనివారం) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముందు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టులో తేజస్వీ యాదవ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఆయనను ఈ నెలలో అరెస్టు చేయబోమని సీబీఐ తెలిపింది. ఆ తర్వాత తేజస్వి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి బయలుదేరి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు తేజస్వి యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనని పోరాటం వైపు నడిపిస్తున్నాయని.. ఆ సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పోరాటంలో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాను ఎప్పుడూ సహకరిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ, తేజస్వి సోదరి మిసా భారతి కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మిసా భారతి ఈడీ ప్రశ్నించనుంది. Delhi: Bihar Deputy CM Tejashwi Yadav reaches CBI office. He will appear before CBI for questioning in connection with the land for job scam case. pic.twitter.com/RxjH09fXBx — ANI (@ANI) March 25, 2023 -
తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు
పాట్నా: బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ, లాలూ కుటుంబాన్ని వరుసగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా లాలూ తనయుడిని ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపింది. తేజస్వికి సీబీఐ సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 4న ఆయనకు తొలిసారి సమన్లు జారీ చేశారు. అంతేకాదు తేజస్వి తల్లిదండ్రులు లాలూ, రబ్రీదేవిలను ప్రశ్నించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా శుక్రవారం నాడు తేజస్వి యాదవ్ నివాసాలతో పాటు 24 చోట్ల రైడ్స్ నిర్వహించింది. మరోవైపు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందని బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తేజస్వి యాదవ్ మండిపడుతున్నారు. 2004 నుంచి 2009 మధ్యలో లాలు రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూముల్ని కారుచౌక ధరకే పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్ నెలలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. -
దూకుడు పెంచిన ఈడీ.. బిహార్ డిప్యూటి సీఎంకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కేసులు, స్కాంలో చిక్కుకున్న పలు నేతల ఇళ్లలో సోదాలు, విచారణలో చేపడుతున్న ఈడీ తాజాగా బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ నివాసంలో సోదాలు చేపట్టింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో ఈడీ తనిఖీలు జరుపుతోంది. దేశ రాజధానిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఆర్జేడీ నాయకుడి నివాసంతో పాటు ముంబై, యూపీ, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆయా కేసులకు సంబంధించి సాక్ష్యాలను సేకరణ కోసం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ రంగంలోకి దిగిందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్ నివాసానికి కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. జితేంద్ర యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రాగిణి భర్త. బీహార్‌లోని పాట్నాలో ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు అబు దోజానా ఇంట్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితమే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఆ కూటమి అపవిత్రమైంది: అమిత్ షా
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనే కోరికతోనే నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రధాని కావాలనే ఆశయాలకోసం అభివృద్ధి కారకుడి నుంచి అవకాశవాది అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ చంపారన్‌లో బీజేపీ శ్రేణులు తలపెట్టిన సభలో అమిత్ షా ప్రసంగించారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని ప్రజలు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. ప్రధాని మోదీ తాను ఇచ్చిన మాట కోసం నితీష్‌కు సీఎంను చేశారు. కానీ నితీష్ మాత్రం మూడేళ్లకోసారి ప్రధాని కావాలనే కలలు కంటున్నారు. నితీశ్ కుమార్‌కు బీజేపీలో తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. కేవలం పదవీ కాంక్ష కోసమే నితీష్.. కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారు. ఆర్జేడీ, జేడీ(యూ) కలయిక చమురు, నీరు వంటిది. ఈ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రధాని కావాలనే ఆశయం బీహార్ ను విభజించిందని ఘాటు విమర్శలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఫైరయ్యారు. బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తుంటే నితీష్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. బీహార్‌ను నితీష్, లాలూ కూటమి అభివృద్ధి చేయలేదని అన్నారు. బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కూడా జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. -
భాయ్ సాహెబ్ ప్రజల గోడు పట్టదా.. తేజస్వీపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు!
బీహార్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. భాయ్ సాహెబ్‌కు ప్రజల గోడు వినే సమయం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి నితీశ్ కుమార్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని రాఘోపూర్ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయాలని నిరసనలకు దిగారు. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కాగా, తమ గ్రామం మీదుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గోడు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ కాన్వాయ్కి లైన్ క్లియర్ చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై నిరసనలు తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో, తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ఆపిన తేజ్వసీ.. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కానీ, రోడ్డు నిర్మాణం గురించి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటూ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. గ్రామస్తుల నిరసనలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాఘోపూర్ ప్రజలు గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో పిల్లలు స్కూల్స్‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద, వరద నీరు నిండిన రోడ్డు మీదుగా బడికి వెళ్లాల్సి వస్తోందన్నారుఉ. రోడ్డు విషయంపై మేమంతా స్థానిక నేతలకు ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ, ఫలితం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. बिहार के CM के बाद अब उनके Deputy की बारी। महोदय के अपने क्षेत्र राघोपुर में पिछले 34 वर्षों से सड़क नहीं बनने से नाराज़ लोग उनके क़ाफ़िले के सामने सड़कों पर लेट गए! काम की बात तो छोड़ दीजिए, भाई साहेब ने गाड़ी से उतर कर लोगों से मिलना तक ज़रूरी नहीं समझा। pic.twitter.com/eyVmlprcHV — Prashant Kishor (@PrashantKishor) January 26, 2023 -
నెట్స్‌లో చెమటోడ్చిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
పట్నా: రాజకీయ నేతలంటే ఎంతో బిజీగా ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న నాయకుడైతే అసలు తీరికే ఉండదు. కానీ, బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రాజకీయాలే కాదు ఇతర అంశాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఆదివారం ఉదయం యువకులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లా బ్యాటింగ్ చేస్తున్న తేజస్వీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తేజస్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లౌజులు, క్యాప్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నారు తేజస్వీ యాదవ్. ‘బిహార్‌కు చెందిన యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్నా. మీ అభిరుచిని ప్రేమించండి.. మీ లక్ష్యం కోసం జీవించండి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు తేజస్వీ యాదవ్. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికిపైగా వీక్షించారు. తేజస్వీ యాదవ్‌ని తిరిగి నెట్స్‌లో చూడటంపై సంతోషం వ్యక్తం చేశారు పలువురు అభిమానులు. ఇలాంటి వాటిల్లో తేజస్వీ కనిపించటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం పట్నాలోని తన నివాసంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీట్ చేశారు తేజస్వీ. Practising with young & bright players of Bihar. #Cricket Love your passion Live your purpose pic.twitter.com/Q5S6j2YmGG — Tejashwi Yadav (@yadavtejashwi) January 8, 2023 ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది