కుల గ‌ణ‌న చేప‌ట్టాలి.. ప్రధానికి బిహారీల విజ్ఞప్తి | Bihar Cm Nitish Kumar To Meet Pm Narendra Modi Over Caste Census | Sakshi
Sakshi News home page

కుల గ‌ణ‌న చేప‌ట్టాలి.. ప్రధానికి బిహారీల విజ్ఞప్తి

Published Mon, Aug 23 2021 12:45 PM | Last Updated on Fri, Aug 27 2021 12:00 PM

Bihar Cm Nitish Kumar To Meet Pm Narendra Modi Over Caste Census - Sakshi

న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్‌లు సోమవారం ప్ర‌ధాని మోదీని ఢిల్లీలో క‌లిశారు. రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని వాళ్లు డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ సౌత్ బ్లాక్‌లో మోదీతో ఆ రాష్ట్రానికి చెందిన నేత‌లు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం బీహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కులాల వారిగా జ‌నాభా లెక్క‌లు చేప‌ట్టాల‌ని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తులను ప్రధాని సావధానంగా విన్నారని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధానిని కలిసినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన..  దేశంలో పశువులు, మొక్కల లెక్కలను కూడా సేకరిస్తున్నారని,  మరి ఓబీసీ జనాభా లెక్కల సేకరణలో అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కులాల వారీ కాకుండా మతాల వారీగా ఎందుకు లెక్కకడుతున్నారన్నారు. ఈ విషయం పై మేం చెప్పిన అంశాలను ప్రధాని సావధానంగా విన్నారని, ఇక ప్రధాని నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement