బీహార్‌లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేసిన అనంతరం.. లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి నివాసంలో కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆర్జేడీ-కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్ కూటమి నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కూటమి నేతలంతా మరోసారి సీఎంగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. మహాఘట్‌బంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలు నితీశ్‌కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు.
Nitish Kumar To Take Oath As Bihar Chief Minister At 4 Pm Tomorrow, Tejashwi Yadav To Be Deputy https://t.co/dqwLAK2uRe
— joinnoukri (@joinnoukri) August 9, 2022
అనంతరం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు నితీశ్‌కుమార్ అందజేశారు. దీంతో, ఆయన బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. దీనికి గాను బుధవారం సాయంత్రం 4 గంటలకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment