
పట్నా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసి, ప్రధాని మోదీ మహారాజు స్థానంలో ఉండాలనుకుంటున్నారని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దర్భంగాలో శనివారం ఆయన మాట్లాడారు.
ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ పట్టించుకోరన్నది వాస్తవమన్నారు. ఎన్నికల్లో గెలవడం, అధికారం నిలుపుకోవడం మాత్రమే మోదీ లక్ష్యమని తేజస్వి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి, మహారాజుగా మారాలన్నది మోదీ కోరికని పేర్కొన్నారు. కానీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి షాక్ తప్పదని ఆయన స్పష్టం చేశారు.