
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. టాప్-5 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు సాధించి మరోసారి శభాష్ అనిపించారు. సివిల్స్ ఫలితాల్లో శక్తి దూబే తొలి ర్యాంకు సాధించగా, హర్షిత గోయల్ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకును సొంతం చేసుకున్నారు. అయితే టాప్ 5 ర్యాంకులు సాధించిన అభ్యర్థుల గురించి ఒకసారి పరిశీలిద్దాం
శక్తి దూబే.. అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక సివిల్స్ మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి ఆమె పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషన్ రిలేషన్స్ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కు చెందిన వారు శక్తి దూబే. 2018 నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అయిన ఆమె.. తొలి ర్యాంకును ఒడిసి పట్టి రాష్ట్రానికి వన్నె తెచ్చారు.
హర్షిత్ గోయల్.. ఎంఎస్ యూనివర్శిటీ ఆఫ్ బరోడా నుంచి బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హర్షిత సైతం పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. హర్యానాకు చెందిన హర్షిత.. గుజరాత్‌లోని వడోదరలో పెరిగారు.
హర్షిత వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్.తలసేమియా మరియు క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు మద్దతు ఇచ్చే బిలీఫ్ ఫౌండేషన్‌తో ఆమె తనవంతు సాయం చేస్తున్నారు.
అర్చిత్ పరాగ్
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను తత్వశాస్త్రాన్ని తన ఆప్షనల్ సబ్జెకుగా ఎంచుకున్నారు. గత సంవత్సరం అర్పిత్ పరాగ్.. AIR 153 సాధించడంతో యూపీఎస్సీ ప్రయాణం ఆరంభమైంది.
ప్రయాణం ప్రారంభమైంది.
మార్గీ చిరాగ్ షా
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మార్గీ చిరాగ్ షా సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని 4వ ర్యాంక్ సాధించింది. ఆమె గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లోగ్రాడ్యుయేషన్ చేశారు.
ఆకాష్ గార్గ్
ఢిల్లీకి చెందిన ఆకాష్ గార్గ్ ఐదో ర్యాంకును సాధించారు. ఆకాష్ గార్గ్.. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు. సోషియాలజీని ఆప్షనల్ సబ్జెట్‌గా ఎంచుకున్నారు.
అమ్మాయిలదే ఆధిపత్యం
యూపీఎస్సీ లో టాప్‌లో నిలిచిన జాబితాను పరిశీలిస్తే.. గత నాలుగేళ్లలో చూస్తే మూడేళ్లు అమ్మాయిలదే ఆధిపత్యం కనబడింది. 2024, 2022, 2021 సంవత్సర పలితాల్లో అమ్మాయిలు ఫస్ట్ ర్యాంకులను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుత 2024 ఫలితాల్లో శక్తి దూబే ప్రథమస్థానంలో నిలవగా, 2022లోఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచింది. ఇక 2021లో శృతి శర్మ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకుంది.