
చల్లబడిన న్యూయార్క్!3 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత తగ్గుదల
వాతావరణ మార్పుల దు్రష్పభావాన్ని చవిచూసిన మహానగరం
కెనడా కార్చిచ్చే కారణం
తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూయార్క్: సూరీడుని అదృశ్య శక్తి మింగేయడం, దాంతో భూమి మీద సూర్యరశ్మి కరువై ఒక్కసారిగా వాతావరణం చల్లబడం వంటి అభూత కల్పనల్లో వింటుంటాం. అలాంటి అరుదైన, వింత ఘటనకు అగ్రరాజ్యం వేదికైంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2023 జూన్‌లో భానుడు భగభగమండుతున్నా సిటీలో మాత్రం వాతావరణం చల్లబడింది. ఆ నగరంలో భూమిపై సూర్యరశ్శి ప్రసరణ తగ్గిపోవడమే కారణం.
ఆనాడు సమీప కెనడా దేశంలోని అటవీకార్చిచ్చు కారణంగా దట్టంగా కమ్ముకున్న దుమ్ము, ధూళి మేఘాల కారణంగా న్యూయార్క్‌లో ఆకాశం మొత్తం మసకబారి సూర్య కిరణాలకు కాస్తంతయినా జాగా లేకుండా పోయిందని, అందుకే ఉష్ణోగ్రత మూడు డిగ్రీ సెల్సియస్ తగ్గిందని ఒక అధ్యయనం తాజాగా వెల్లడించింది.
సంబంధిత అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎని్వరోన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూఉపరితాన్ని సూర్యరశ్మి తాకలేకపోవడంతో కాస్తంత వెలుతురు, వేడి తగ్గడాన్ని ‘గ్లోబల్ డిమ్మింగ్’అంటారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిని మరింత గరళం చేసే వాయువులు భూ వాతావరణంలో చిక్కుబడిపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని రట్గర్స్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు.
ఏకంగా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి..
ఫిలిప్ డెమొక్రిటో, జార్జియస్ కెలీసిడీస్‌ల సారథ్యంలోని పరిశోధనా బృందం కెనడా దావానలం తాలూకు పొగ, ధూళి ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కమ్మేసిన వైనాన్ని ఈ బృందం పరిశోధించింది. ‘‘ఈ దుమ్ము, ధూళి మేఘాల్లోని గోధమ రంగ కర్భన ఆర్గానిక్ అణువుల కారణంగానే సూర్యరశ్మి భూమిని తాకలేకపోయింది. ఉష్ణోగ్రత తగ్గడానికి ఇదే కారణం. ఈ భారీ ‘దుమ్ము గొడుగు’కారణంగా స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన సహజ గాలికి సైతం ఆటంకాలు ఏర్పడ్డాయి.
గాలి అటు ఇ టూ వేగంగా వెళ్లే పరిస్థితిలేకపోవడంతో ఎక్క డి వాయు కాలుష్యం అక్కడే గాఢంగా పరుచుకుపోయింది. ఈ కాలుష్య గాలిలోని సూక్ష్మధూ ళి కణాలు అలాగే భూమి సమీప వాతావరణంలోనే తిష్టవేశాయి. ఈ సమయంలో న్యూయార్క్ నగరంలో సూక్ష్మ ధూళి కణాలు( 2.5 పీఎం) అత్యంత ఎక్కువ స్థాయిలో పోగుబడ్డాయి. పర్యావరణ పరిరక్షణా సంస్థ నిర్దేశించిన స్థాయి కంటే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ సూక్ష్మధూళి కణాలు వాతావరణంలో ఉండిపోయాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుచేసిన స్థాయి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా సూక్ష్మ ధూళి కణాలు నగర గాలిలో ఉన్నాయి’’అని పరిశోధకులు చెప్పారు.
వ్యాధి నిరోధక శక్తి సగానికి..
ఊహించనంతగా పెరిగిన వాయుకాలుష్యం కారణంగా స్థానికులను శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముట్టాయని అధ్యయనకారులు తెలిపారు. రట్గర్స్ బృందం చేసిన మరో పరిశోధన ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పెను వాతావరణ పోకడ కారణంగా నగరంలోని ప్రతి ఒక్క ఒక్కరి ఊపిరితిత్తుల్లోకి అదనంగా సగటున 9.3 మిల్లీగ్రాముల బరువైన పొగ అణువులు చొరబడ్డాయని దీంతో ఇన్ఫెక్షన్లతో పోరాడే వాళ్ల వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం ఏకంగా 50 శాతం క్షీణించిందని ఆ పరిశోధన పేర్కొంది.
కెనడాలో కార్చిచ్చు ఘటనలు కొనసాగినన్ని రోజులూ న్యూయార్క్‌లో ఆస్తమా సంబంధ కేసులు 44 శాతం నుంచి ఏకంగా 82 శాతానికి పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని పరిశోధన ఉదహరించింది. ‘‘ఈ ప్రాంతంలో ఇలాంటి దృగి్వíÙయం జరగడం ఇదే తొలిసారి. అయితే ఇదే చివరిసారి అని మాత్రం చెప్పలేం. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి మళ్లీ సంభవించే ప్రమాదం ఉంది’’అని పరిశోధకుడు ఫిలిప్ డెమొక్రిటో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా ఇకపై తరచూ, అత్యధికంగా కార్చిచ్చు ఘటనలు సంభవించి ఈశాన్య అమెరికాకు కాలుష్య కష్టాలు పెరిగే అవకాశముందని ఫిలిప్ విశ్లేషించారు. కార్చిచ్చులకు, పట్టణ ప్రాంతంలో వాతావరణంలో మార్పులకు, ప్రజారోగ్యానికి మధ్య సంబంధాలను ఈ పరిశోధన విశదీకరించింది.