పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అధికారిక నివాసంలో ఆర్జేడీ నేత బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ మేరకు ఆయన తాను క్రికెట్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జీవతం అయినా ఆట అయినా ఎల్లప్పుడు గెలుపు కోసం ఆడాల్సిందేనని, చాలా ఏళ్ళు తర్వాత బ్యాటు, బాల్ పట్టుకోవడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ఆ వీడియోలో తేజస్వీ డ్రైవర్, వంటవాడు, స్వీపర్, గార్డెనర్, కేర్‌టేకర్లతో క్రికెట్ ఆడుతూ సందడి చేశాడు. ఐతే జులై 12న బిహార్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ పాట్నాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తేజస్వీ యాదవ్‌తో కాసేపు ముచ్చటించిన మోదీ...మీరు కాస్త బరువు తగ్గాలంటూ సలహ ఇచ్చారు. ఆ తదనందరం ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుతూ... కనిపించారు.
బహుశా తేజస్వీ దీన్ని సీరియస్‌గా తీసుకుని కాలరీలు తగ్గడం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తేజస్వీ యాదవ్ తన జూనియర్ క్రికెట్‌ను ఢిల్లీ తరుఫున ఆడాడు. అంతేకాదు 2008-09లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు కూడా. అతను జార్ఖాండ్‌కి ప్రాతినిధ్యం వహించి అనేక మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత తన తండ్రి లాలుప్రసాద్ యాదవ్‌ని అనుసరించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ మేరకు తేజస్వీ క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
Life or game, one should always play to win. The more you plan in head, the more you perform on field.
— Tejashwi Yadav (@yadavtejashwi) July 17, 2022
Pleasure to try hands on bat & ball after ages. It becomes more satisfying when driver, cook, sweeper, gardener & care takers are your playmates and keen to hit & bowl you out. pic.twitter.com/ChvK9evzi2
(చదవండి: నామకరణం వేళ విషాదం.. తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి చంపిన కోతులు)
Comments
Please login to add a commentAdd a comment