Tejashwi Yadav Wields The Bat In The Nets With Young Cricketers, Video Goes Viral - Sakshi
Sakshi News home page

నెట్స్‌లో బిహార్‌ డిప్యూటీ సీఎం బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ .. వీడియో వైరల్‌

Published Mon, Jan 9 2023 1:50 PM | Last Updated on Mon, Jan 9 2023 5:35 PM

Tejashwi Yadav Wields The Bat In The Nets With Young Cricketers - Sakshi

పట్నా: రాజకీయ నేతలంటే ఎంతో బిజీగా ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న నాయకుడైతే అసలు తీరికే ఉండదు. కానీ, బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. రాజకీయాలే కాదు ఇతర అంశాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఆదివారం ఉదయం యువకులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా బ్యాటింగ్‌ చేస్తున్న తేజస్వీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

తేజస్వీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ వీడియోను రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్‌జేడీ) తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. బ్యాటింగ్‌ ప్యాడ్స్‌, గ్లౌజులు, క్యాప్‌ ధరించి ప్రాక్టీస్‌ చేస్తున్నారు తేజస్వీ యాదవ్‌. ‘బిహార్‌కు చెందిన యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ చేస్తున్నా. మీ అభిరుచిని ప్రేమించండి.. మీ లక్ష్యం కోసం జీవించండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు తేజస్వీ యాదవ్‌. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికిపైగా వీక్షించారు. తేజస్వీ యాదవ్‌ని తిరిగి నెట్స్‌లో చూడటంపై సంతోషం వ్యక్తం చేశారు పలువురు అభిమానులు. ఇలాంటి వాటిల్లో తేజస్వీ కనిపించటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం పట్నాలోని తన నివాసంలో క్రికెట్‌ ఆడుతున్న వీడియోను ట్వీట్‌ చేశారు తేజస్వీ.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్‌..ఏకంగా ఓ కేసునే టేకప్‌ చేస్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement