RJD leader
-
లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడవాళ్ల హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలంతా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకొస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు కూడా విభేదించారు. బీహార్‌లోని ముజాఫర్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇకపై లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం మొదలు పెడతారు చూడండని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మొదటి నుంచి ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తూనే ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ బిల్లుకు మద్దతిచ్చిందని బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో విభేదించిందని గుర్తుచేశారు. అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందిస్తూ.. దీనినిబట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయన్నారు. మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు వస్తున్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్టుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేయడంలో భాగస్వాములవుతారని.. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వారు కూడా ఖండించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓబీసీల తోపాటు ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు కూడా రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో అంశాన్ని ఆర్జేడీ తోపాటు మిగతా పార్టీలు కూడా విభేదించాయి. సమాజ్‌వాది పార్టీ ఎంపీలు శరద్ యాదవ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక స్వర్గీయ సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అయితే ఇదే అంశంపై మాట్లాడుతూ ఈ బిల్లు వలన సంపన్న కుటుంబాల్లోని ఆడవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప గ్రామస్థాయిలో మహిళలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని 2012 లోనే అన్నారు. ఇది కూడా చదవండి: ‘కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు’ -
నెట్స్‌లో చెమటోడ్చిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
పట్నా: రాజకీయ నేతలంటే ఎంతో బిజీగా ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న నాయకుడైతే అసలు తీరికే ఉండదు. కానీ, బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రాజకీయాలే కాదు ఇతర అంశాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఆదివారం ఉదయం యువకులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లా బ్యాటింగ్ చేస్తున్న తేజస్వీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తేజస్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లౌజులు, క్యాప్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నారు తేజస్వీ యాదవ్. ‘బిహార్‌కు చెందిన యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్నా. మీ అభిరుచిని ప్రేమించండి.. మీ లక్ష్యం కోసం జీవించండి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు తేజస్వీ యాదవ్. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికిపైగా వీక్షించారు. తేజస్వీ యాదవ్‌ని తిరిగి నెట్స్‌లో చూడటంపై సంతోషం వ్యక్తం చేశారు పలువురు అభిమానులు. ఇలాంటి వాటిల్లో తేజస్వీ కనిపించటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం పట్నాలోని తన నివాసంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీట్ చేశారు తేజస్వీ. Practising with young & bright players of Bihar. #Cricket Love your passion Live your purpose pic.twitter.com/Q5S6j2YmGG — Tejashwi Yadav (@yadavtejashwi) January 8, 2023 ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది -
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు ఇంట్లో!!
పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ(మాజీ) నేత.. జైలుకు బదులుగా ఇంటికి చేరడం, కుటుంబం.. అనుచరులతో సరదాగా గడపడం పెనుదుమారం రేపుతోంది. ఫొటోకాస్త వైరల్ కావడంతో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన ఆరుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేసిన బీహార్ పోలీస్ శాఖ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్జేడీ నేత బాహుబలి ఆనంద్ మోహన్.. తుపాకులు, కత్తులతో స్వేచ్ఛగా విహరించడంతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చే నేతగా పేరుండేది. అయితే 1994లో ముజాఫర్పూర్ శివారులో గోపాల్‌గంజ్ కలెక్టర్ కృష్ణయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. అయితే.. పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టులోనూ ఆనంద్‌కు ఊరటే లభించింది కూడా. మోహన్, ఆయన భార్య గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించారు. మోహన్ తనయుడు చేతన్ ఆనంద్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ తరుణంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బాహుబలి ఆనంద్ మోహన్‌ను పాట్నా కోర్టులో ప్రవేశపెట్టిన సిబ్బంది.. జైలుకు కాకుండా నేరుగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ భార్య లవ్లీ ఆనంద్, కొడుకు చేతన్ ఆనంద్, పార్టీ కార్యకర్తలతో గ్రూప్ ఫొటోలు దిగాడు మోహన్. సరదాగా పార్టీల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు రెండు రోజుల తర్వాత వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. రిటర్న్ ఆఫ్ జంగిల్‌రాజ్ బీజేపీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రిటర్న్ ఆఫ్ జంగిల్ రాజ్ అంటూ మోహన్ కుటుంబ ఫొటోను వైరల్ చేస్తోంది. లాలూ-రబ్రీ కాలం మళ్లీ వచ్చేసిందంటూ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక జీవిత ఖైదును ఇంటికి అనుమతించినందుకు ఆరుగురు సిబ్బందిపై వేటు వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సహస్రా ఎస్పీ లిపీ సింగ్ వెల్లడించారు. डीएम मर्डर केस में उम्रकैद की सजा काट रहे RJD नेता आनंद मोहन जेल की जगह अपने घर पहुंचे गए। ये है राजद जदयू के जंगल राज की ताकत। pic.twitter.com/1wdkxDd5Hp — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) August 15, 2022 అయితే బీజేపీ విమర్శలపై యువ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ తీవ్రంగా స్పందించాడు. కోర్టు బయట అనారోగ్యానికి గురైన తన తండ్రిని ఇంటికి తెస్తే తప్పేంటని అంటున్నాడు. అనుచరులతో తన తండ్రి సమావేశం అయిన ఫొటోను సైతం బీజేపీ వక్రీకరిస్తోందని, వాస్తవాలను వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. వాజ్‌పేయి హయాంలో విశ్వాస తీర్మానం సందర్భంగా.. తన తండ్రి, మరో పది మంది ఎంపీలను ఒప్పించి అనుకూలంగా ఓటు వేయించడని, అప్పుడు లేని ఇబ్బంది బీజేపీకి ఇప్పుడు కలుగుతుందో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే చేతన్ ఆనంద్. ఇదీ చదవండి: పింక్ వర్సెస్ ఆరెంజ్.. ఎగిరిన రాళ్లు, విరిగిన కర్రలు -
వైరల్‌గా మారిన తేజస్వి కాల్ రికార్డ్
పాట్నా: బీహార్‌లో ప్రస్తుతం ఓ ఫోన్ కాల్ రికార్డు వైరల్‌గా మారింది. ఆర్జేడీ చీఫ్, లాలుప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, పట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మధ్య జరిగిన ఆ సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతూ, తేజస్వి ఇమేజ్ను అమాంతం పెంచేసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు తేజస్వి వెళ్లారు. అయితే ధర్నా వేదిక వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. తేజస్వి కల్పించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పట్నా జిల్లా మెజిస్ట్రేట్లతో ఫోన్లో మాట్లాడి ధర్నా వేదిక వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతులు ఇప్పించారు. ఈ క్రమంలో తేజస్వీ, జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌ల మధ్య స్పీకర్ ఫోన్లో జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇందులో తేజస్వి మాట్లాడుతూ.. సింగ్ గారు, ఉపాధ్యాయులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎందుకు అనుమతి నిరారిస్తున్నారని ప్రశ్నించారు. వారు ముందస్తు అనుమతితోనే ధర్నావేదిక వద్ద నిరసన తెలిపుతున్నారన్నారు. అలాంటప్పుడు లాఠీ ఛార్జి చేయడం, ఆహార పదార్థాలను నేలపాలు చేయడం ఎంత వరకు సమంజమని నిలదీశారు. వారి అనుమతి దరఖాస్తులను వాట్సాప్ చేస్తున్నాను, దయచేసి వారు నిరసన తెలిపేందుకు అనుమతించండని విజ్ఞప్తి చేశారు. ఆపై మెజిస్ట్రేట్ బదులిస్తూ.. పరిశీలిస్తానని చెప్పడంతో, ఎంత సమయం కావాలని తేజస్వి గట్టిగా నిలదీశారు. దీంతో ఆయన గంభీర స్వరంతో.. ఎంత సమయం కావాలని నన్నే ప్రశ్నిస్తావా అంటూ అరిచాడు. దీనికి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. "డీఎం సాబ్ హమ్ తేజస్వి యాదవ్ బోల్ రహే హై" అనడంతో ఆ అధికారి కాసేపు నీళ్లు నములుతూ, స్వరం మార్చి, ఓకే సార్ ఓకే సార్ అనటంతో ధర్నా వేదిక వద్ద కరతాళ ధ్వనులు మోగాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహాయకుడు సుధీంద్ర కులకర్ణి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తేజస్వికి దేశవ్యాప్తంగా ఎందుకింత మాస్ ఫాలోయింగ్ ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్ చేశాడు. కాగా, గతేడాది జరగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోని మహాఘట్ బంధన్ స్వల్ప తేడాతో మేజిక్ ఫిగర్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. -
రాహుల్ అందుకు అర్హుడే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మంచి ప్రధాని కాగలిగే అన్ని అర్హతలున్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. రాహుల్ ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ15 ఏళ్లుగా పార్లమెంట్లో ఉన్నారనే విషయం మరువరాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఐదుగురు సీఎంలున్నారని, వారు రాహుల్ నేతృత్వంలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ దుష్ర్పచారం చేస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరమే ప్రధాని ఎవరన్నది మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. రాహుల్ నాయకత్వంపై ఎలాంటి సందేహాలూ లేవన్నారు. రాహుల్‌పై విపరీతంగా ప్రతికూల ప్రచారం సాగుతున్నా ఆయన తన విశాల హృదయం, సద్గుణాలతో ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుతో రాహుల్ నాయకత్వంపై విశ్వాసం, ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నదన్నారు. కాగా, -
నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అసలేం జరిగిందంటే... సన్నిహితుల కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన ఇందాల్‌కు స్థానిక యువకులతో మంగళవారం వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతడు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇందాల్ హత్యతో ఉలిక్కిపడ్డ అతడి సన్నిహితులు.. నిందితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు(13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గత శనివారం వైశాలీ ఏరియాలో పింటూ సింగ్ అనే బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అనంతరం కాల్చి చంపేశారు. గయలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. గంజన్ ఖేమ్కా అనే పారిశ్రామికవేత్త కూడా ఇదే పద్ధతిలో హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కక్షతోనే దుండగులు ఇందాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పడం కొసమెరుపు. #Bihar: Local RJD leader was shot dead in Deepnagar police limits, in Nalanda, yesterday. Locals attacked and set fire to the house of the accused. SDPO, Nalanda says, "He was shot dead due to personal enmity. We are investigating the matter." pic.twitter.com/1NCNNEp9UA — ANI (@ANI) January 2, 2019 -
మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తిన ఆర్జేడీ నేత
-
డ్యాన్సర్‌పై నోట్ల వర్షం కురిపించిన ఆర్జేడీ నేత
సాక్షి, పాట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ నాయకుడు ఓ మహిళా డ్యాన్సర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆర్జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు. ఈ నెల మార్చి 10 న బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుకలో రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అరుణ్ దాదుపురి ఆర్జేడీ పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా, ఫతేపూర్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ప్రవర్తన తమ పార్టీని తల దించుకునేలా చేసిందని పార్టీ నాయకులు మండిపడుతున్నారు. -
ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నా : ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. బిహార్ రాజధాని పట్నాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్ పూర్ జిల్లా నౌగచియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల యాదవ్ నౌగచియా నగర్ పంచాయతీ సభ్యుడు. నౌగచియాలోని రాసల్పూర్ ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యాదవ్‌పై, మోటర్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాథ్ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఓ తుపాకీని, నాలుగు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు నౌగచియా సూపరిడెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ) పంకజ్ సిన్హా చెప్పారు. యాదవ్ హత్య వెనుక వ్యక్తిగత శత్రుత్వమే కారణమై ఉండవచ్చని ఎస్పీ అనుమానిస్తున్నారు. యాదవ్‌కు చాలా క్రిమినల్ కేసుల్లో హస్తమున్నట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నౌగచియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. యాదవ్ మేనల్లుడు అజిత్‌కు ఈ హత్యలో భాగమున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
RJD మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు జీవితఖైదు
-
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
-
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు. -
బిహార్ ప్రజలు మొత్తం శుభ్రం చేసేశారు: లాలు
యువకులు, రైతులు, పేదలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆర్జేడీ అధినేత, మహాకూటమి కీలక నేత లాలుప్రసాద్ అన్నారు. మహాకూటమి విజయం ఖాయమైన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో ఆయన నితీష్ కుమార్‌తో కలిసి కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే ఆయన నితీష్ కుమార్‌ను గట్టిగా కౌగలించుకుని అభినందనలు తెలపడంతో పాటు విజయతిలకం కూడా దిద్దారు. ఆ సమయంలో అభిమానులు ఒకటే జయ జయ ధ్వానాలు చేస్తుండటంతో.. పెద్దమాష్టారిలా అందరినీ గట్టిగా గదమాయించి నిశ్శబ్దంగా ఉండాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా లాలు ఏమన్నారంటే.. బిహార్ ముఖ్యమంత్రి మళ్లీ నితీష్ కుమారే మహాకూటమికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అందరికీ పేరుపేరునా మా సోదరులిద్దరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం బిహార్ ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని శుభ్రం చేసేశారు నితీష్ కుమార్ పాలనలోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పారు యువకులు, రైతులు, కార్మికులు, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం ఎన్నికల సమయంలోనే మేం ఈ విషయం చెప్పాం దేశం ముక్కలు ముక్కలు కాకుండా కాపాడుతామని కూడా ముందే చెప్పాం నేను దేశవ్యాప్తంగా పర్యటన చేసి ప్రచారం చేస్తాను. మీరు సమర్థించడం వల్లే మేం ఇంత ముందుకు రాగలిగాం నితీష్ కుమార్ కు చాలా అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను ప్రజలు మాకు బాగా పెద్ద విజయాన్ని అందించారు బిహార్ ప్రజలు, యువత, పేదలు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగస్వాములే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్వయంగా అభినందనలు తెలిపారు ఇది చాలా సంతోషకరమైన విషయం -
ఆసుపత్రి నుంచి లాలూ డిశ్చార్జి
ముంబయి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను డిశ్చార్జి చేసినట్లు ఆ ఆసుపత్రి వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ రామాకాంత్ పండా శనివారం వెల్లడించారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగిన లాలూ ప్రసాద్ యాదవ్ చాలా త్వరగా కొలుకున్నారని చెప్పారు. ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టులో ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. గత నెల 27వ తేదీన ఏషియన్ ఇనిస్టిట్యూట్ వైద్యులు లాలూకు గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.