రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) పార్టీ నాయకుడు ఓ మహిళా డ్యాన్సర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆర్‌జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు.