misbehaving
-
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ తమపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించాడని, అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బుధవారం ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. వింజమూరు గంగమిట్టకు చెందిన మహిళలు మంగళవారం అర్ధరాత్రి స్థానిక సబ్‌స్టేషన్‌కు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేతపై సిబ్బందిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్ కృష్ణ మహిళలనుద్దేశించి అసభ్య పదాలు ఉపయోగించాడు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుమణిగేలా చేశారు. అయితే తీవ్ర కలత చెందిన మహిళలు, వారి బంధువులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొని కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఎస్సై కోటిరెడ్డి వారికి సర్దిచెప్పి కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విజయకుమార్‌రెడ్డి, కొండారెడ్డి, కాలేషా తదితరులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యుత్ సమస్యను ఏఈ శ్రీనివాసరావు దృష్టికి సాక్షి తీసుకెళ్లగా గంగమిట్టలో లోఓల్టేజీ సమస్య ఉందని, దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరైందని, రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
వెయిట్రస్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్‌తో శివంగిలా విరుచుకుపడి..
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్‌లతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెస్టారెంట్‌లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది. ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ — CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023 -
పాఠాలు చెప్పాలి కానీ ఇవేం పనులు.. కీచక టీచర్‌కు బడితపూజ..
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు తమ స్థానం మరిచిపోయి విద్యార్థినిలను వేధింపులకు గురిచేస్తున్నారు. పాఠాలు నేర్పించే క్రమంలో కామకాంక్షను వారిపై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కటకటాల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాడ్రన్ఎయిడెడ్ పాఠశాలలో రమణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పాఠాలు చెప్పే క్రమంలో రమణ.. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, ఆవేదనకు గురైన విద్యార్థినిలు ఈ విషయాన్ని ఇంటి వెళ్లి తమ పేరెంట్స్‌కు చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రమణకు దేహశుద్ధి చేశారు. టీచర్ రమణకు విద్యార్థులు, టీచర్స్ చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థులు పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణకు పోలీసులు తీసుకువెళ్తున్న క్రమంలో కూడా రమణను విద్యార్థులు పేరెంట్స్ తీవ్రంగా కొట్టారు. అనంతరం, చిరిగిన చొక్కాతోనే రమణను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..
హయత్‌నగర్(హైదరాబాద్): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్ వార్డెన్‌ను ఆదివారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్లో నెల రోజుల క్రితం వార్డెన్‌గా చేరాడు. చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి.. విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన
-
పాతబస్తీలో హల్చల్ చేసిన మరో కార్పొరేటర్
-
విద్యార్థులపై ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, పటాన్చెరు టౌన్: విదార్థులతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ట్యూషన్ టీచర్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా..రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సాల్మన్ రాజు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజును నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని కాగా, బుధవారం రాత్రి 10:40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదేపదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. మెలకువ వచ్చి చూస్తే ఎవరో గుర్తించలేక పోయింది. భయపడిన యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అక్రమ సంబంధం బయట పడకూడదనే.. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్‌లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. -
కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి
గ్వాలియర్: పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమారుడికి మాజీ మంత్రి ఒకరు తగిన గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో గురువారం బైక్‌పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించారు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. (తండ్రి ప్రేమ.. స్క్రాప్ నుంచి బైక్ తయారీ) ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుచరుడైన మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఎందుకంటే పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన కుమారుడే. తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించి, జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుక్కి గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శుక్రవారం చెత్త ఎత్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. కొడుకు చేసిన తప్పును సరిదిద్ది హుందాగా ప్రవర్తించిన ప్రద్యుమన్ సింగ్ తోమర్‌ను అందరూ అభినందిస్తున్నారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) -
చిన్నారి పట్ల అసభ్యకరంగా...
గాజువాక: ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారితో ఓ మృగాడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి అకృత్యాన్ని సకాలంలో గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్ ప్రాంతంలోని తన అమ్మమ్మ ఇంటి ముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన టి.గౌరీశంకర్ అనే వ్యక్తి వృద్ధురాలితో మాట్లాడుతుండగా.. ఆ చిన్నారి మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వెళ్లింది. గమనించిన ఆయన అక్కడ్నుంచి చిన్నారి వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి గౌరీశంకర్ తప్పించుకొని వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అతడిని స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఇంటి గేటుకు కట్టేసి గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాజువాక సీఐ సూరినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడు ఒడిశా ప్రాంతానికి చెందిన వాడని సీఐ తెలిపారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే బాధ్యతారాహిత్యంగా తిరుగుతుంటాడు. చిన్నారి కుటుంబ సభ్యులు శ్రీనగర్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. -
పబ్‌లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
అసభ్యకరంగా మాట్లాడాడని..
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): తమ కుమార్తెతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆగ్రహించిన మండలంలో రాజాం గ్రామంలో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన పొలంలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో పురుగుమందు స్ప్రేయర్ కోసం రాజాం గ్రామానికి చెందిన ఏడువాక సన్యాసినాయుడు(40) అదే గ్రామానికి చెందిన మరిసా రాజులమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజులమ్మ ఇం టి వద్ద లేకపోగా ఆమె 13 సంవత్సరాల కుమార్తెను స్ప్రేయర్ ఇవ్వమని సన్యాసినాయుడు అడిగాడు. ఇంటివద్ద మా కుటుంబ సభ్యులు లేర ని, తరవాత రమ్మని రాజులమ్మ కుమార్తె తెలి పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజులమ్మకు తనతో సన్యాసినాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు బాలిక తెలిపింది. సన్యాసినాయుడుతో బాలిక తల్లి,కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి గొడవ పడి, అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో సన్యాసినాయుడు రోడ్డుపై పడడంతో తలకి గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,చోడవరం సీఐ కె.ఈశ్వరరావు, బుచ్చెయ్యపేట పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, మృత దేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య కన్నమ్మ ఆమె కుటుంబ సభ్యులు సోమవారం గ్రామంలో ఆందోళనకు దిగారు. చిన్న విషయానికే ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్త చావుకు కారణమైన బాలిక తల్లి రాజులమ్మ,బాబాయి శ్రీను,నానమ్మ అప్పలకొండ కుటుంబ సభ్యులు సత్యవతి,సన్యాసినాయుడులపై చర్యలు తీసికోవాలని కన్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సన్యాసినాయుడు మృత దేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
స్టేడియంలో హల్చల్: ఆరుగురు బుక్
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్భంగా ఆదివారం కొంతమంది యువతీ యువకులు హల్ చల్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తమకు ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శాంటోష్ ఉపాధ్యాయ్, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ బాక్స్ 22 నుంచి మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ్ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువతులతో సహా నగరంలోని ఆరుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చారు. ప్రముఖ టీవీ యాంకర్ ప్రశాంతితోపాటు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌పై కేసు నమోదైంది. -
మహిళా పేషంట్‌తో అసభ్యప్రవర్తన.. డాక్టర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్ : మహిళా పేషంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె భర్త డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం హిమాయత్ నగర్లో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. హిమాయత్ నగర్‌కు చెందిన పీడియాట్రిషన్ డా. మైకేల్ అరన్హ వద్దకు వచ్చిన మహిళా పేషంట్‌తో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె భర్త తన స్నేహితులతో కలిసి డాక్టర్‌పై దాడి చేశాడు. దీంతో తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మైకేల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన గులాం ముస్తఫ్ఫా, అబ్దుల్ ఫైజిల్లను అరెస్ట్ చేశారు. అనంతరం డాక్టర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేధింపులపై గూగుల్ ఉక్కుపాదం
న్యూయార్క్: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్ నాటన్ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబీన్కు రూ.659.38 కోట్లు(90 మిలియన్ డాలర్లు) ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్ వీడ్కోలు పలికిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్‌ను వీడినట్లు రూబీన్ వివరణ ఇచ్చారు. -
మహిళను వేధించిన ముగ్గురు యువకులు
-
కర్ణాటక కాంగ్రెస్ నేత దురుసు ప్రవర్తన
-
మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తిన ఆర్జేడీ నేత
-
డ్యాన్సర్‌పై నోట్ల వర్షం కురిపించిన ఆర్జేడీ నేత
సాక్షి, పాట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ నాయకుడు ఓ మహిళా డ్యాన్సర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆర్జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు. ఈ నెల మార్చి 10 న బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుకలో రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అరుణ్ దాదుపురి ఆర్జేడీ పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా, ఫతేపూర్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ప్రవర్తన తమ పార్టీని తల దించుకునేలా చేసిందని పార్టీ నాయకులు మండిపడుతున్నారు. -
ఇలియానాతో అభిమాని అసభ్య ప్రవర్తన
ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ఇలియానా.. అతని వికృత స్వభావంపై తీవ్రంగా మండిపడింది. 'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్ ఫిగర్‌ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి. నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఇలియానా ఘాటుగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్షాహో' హిందీ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా భారీ ఆశలే పెట్టుకుంది.It's a pretty shitty world we live in. I'm a public figure. I understand that I don't have the luxury of a private & an anonymous life.(1/2)— Ileana D'Cruz (@Ileana_Official) August 20, 2017But that doesn't give any man the right to misbehave with me. Don't confuse "fan antics" with that. I am a WOMAN at the end of the day.(2/2)— Ileana D'Cruz (@Ileana_Official) August 20, 2017 -
సెల్ఫీ పేరిట అసభ్య ప్రవర్తన.. నటి ఆగ్రహం!
కోల్‌కతాలో విమానాశ్రయంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ఫీ పేరిట దురుసుగా వ్యవహరించిన అతని తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తాజా చిత్రం ’బేగం జాన్’ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న విద్యా బాలన్ కోల్‌కతా విమానాశ్రయంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి తనతో సెల్ఫీ దిగాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకుంది కూడా. అయితే, సరిగ్గా మొబైల్‌ఫోన్‌తో సెల్ఫీ క్లిక్ చేసే సమయంలో ఆమె చుట్టూ చేయి వేసి వికృతబుద్ధి బయటపెట్టుకున్నాడు. చుట్టూ చేయి వేయడంతో కంగుతిన్న ఆమె అతని తీరును తీవ్రంగా వారించింది. అయినా అతను ఫొటోలు తీస్తూ ఉండటంతో సహనం కోల్పోయిన ఆమె ఆ వ్యక్తిపై తీవ్రంగా మండిపడింది. ’అసలు ఏం చేస్తున్నావు. సక్రమంగా ప్రవర్తించడం తెలియదా?’ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటన గురించి విద్యాబాలన్ స్పందిస్తూ..’ఓ అగంతకుడు మీ చుట్టూ చేతులు వేస్తే.. పురుషులైనా, మహిళలైనా అసౌకర్యంగా భావిస్తారు. అది వ్యక్తిగత పరిధిలోకి చొరబడటమే అవుతుంది. మేం పబ్లిక్ ఫిగర్లమే కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు’ అని పేర్కొంది. -
అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే..
న్యూఢిల్లీః నియోజకవర్గంలో నీటి సమస్యపై మాట్టాడేందుకు వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మొహానియా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. స్థానిక నీటి సమస్యపై ఎమ్మెల్యేకు వివరించేందుకు కొద్ది రోజులుగా ఆయన ఆఫీస్ కు వెడుతున్న ఓ మహిళ... సదరు ఎమ్మెల్యే.. తనతోపాటు వచ్చిన మహిళలను సైతం నెట్టివేసి, అవమానించారని పేర్కొంది. మొహానియాపై కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ సంగమ్ విహార్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహానియా మహిళలతో ఆసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. తాను నీటి సమస్యపై మాట్లాడేందుకు తరచుగా ఆయన కార్యాలయానికి వెడుతున్నానని, అయినప్పటికీ కనీసం గుర్తు కూడ పట్టనట్లుగా చేసిన మొహానియా తనపై అసభ్యంగా ప్రవర్తించారని, తనతోపాటు వచ్చిన వారిని కూడ అక్కడినుంచీ నెట్టివేశారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. నియోజకవర్గ ప్రజలన్న కనీస మర్యాదకూడ లేకుండా మొహానియా మహిళలపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం అన్యాయమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది. మొహానియా కార్యాలయానికి వచ్చిన మహిళలందరినీ ఆయన బయటకు గెంటి అవమానించారని, అయితే తాము కూడ అదేతీరులో ప్రవర్తించాల్సి వచ్చిందని, కొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చునేవారు ఎవరుంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది? మొహానియా ప్రవర్తనపై విచారించి, ఆయన్ను వెంటనే ఆరెస్టు చేయడంతోపాటు, తమ ప్రాంతంలోని నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది. -
ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా వీడియో తీస్తూ..
ముంబయి: ముంబయి ఎయిర్ పోర్ట్ లో నలుగురు ప్రయాణీకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ హోస్టెస్‌తో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కోల్ కతా నుంచి ముంబయి మధ్య ప్రయాణించే ఇండిగో విమానానికి చెందిన ఎయిర్ హోస్టేస్ తో వారు ఇలా ప్రవర్తించారు.