పబ్ లో మహిళపై దురుసుగా ప్రవర్తించిన బౌన్సర్ల అరెస్ట్!
Published Wed, Jul 9 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
హైదరాబాద్: ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె సన్నిహితుడిపై చేయి చేసుకున్న ఇద్దరు బౌన్సర్లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో గత రాత్రి చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
బౌన్సర్లను అంథోని, అనీష్ లుగా గుర్తించినట్టు ఫిర్యాదులో భాదితులు పేర్కొన్నారని పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ఎస్ మోహన్ కుమార్ తెలిపారు. పబ్ లో ఓ బాస్కెట్ దెబ్బతిన్న విషయంపై బౌన్సర్లు ప్రశ్నించగా మాటా మాట పెరిగి వివాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పంజగుట్ట పోలీసులు వెల్లడించారు.
Advertisement
Advertisement