పబ్లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన | Bouncers misbehaviour with teenage girls in pub at Banjara hills | Sakshi
Sakshi News home page

పబ్లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన

Published Wed, Jul 9 2014 10:11 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

పబ్లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన - Sakshi

పబ్లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన

నగరంలోని ఓ పబ్లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బౌన్సర్లలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు బుధవారం  వెల్లడించారు. పరారీలో ఉన్న బౌన్సర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.... కొంత మంది యువతులు స్నేహితులతో కలసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని పబ్కు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంత మంది బౌన్సర్లు ఆ యువతులు పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు. బౌన్సర్లును వారించేందుకు యువతి స్నేహితులు ప్రయత్నించారు. దాంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహించిన బౌన్సర్లు... యువతులతో వచ్చిన స్నేహితులపై దాడి చేశారు.

ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పబ్ సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు హుటాహుటిన పబ్కు చేరుకున్నారు. పబ్ సిబ్బంది వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement