
పీడియాట్రిషన్ డా. మైకేల్ అరన్హ
సాక్షి, హైదరాబాద్ : మహిళా పేషంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె భర్త డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం హిమాయత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. హిమాయత్ నగర్‌కు చెందిన పీడియాట్రిషన్ డా. మైకేల్ అరన్హ వద్దకు వచ్చిన మహిళా పేషంట్‌తో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె భర్త తన స్నేహితులతో కలిసి డాక్టర్‌పై దాడి చేశాడు.
దీంతో తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మైకేల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన గులాం ముస్తఫ్ఫా, అబ్దుల్ ఫైజిల్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం డాక్టర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment