గ్వాలియర్: పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తన కుమారుడికి మాజీ మంత్రి ఒకరు తగిన గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో గురువారం బైక్‌పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించారు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. (తండ్రి ప్రేమ.. స్క్రాప్ నుంచి బైక్ తయారీ)
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుచరుడైన మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఎందుకంటే పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన కుమారుడే. తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించి, జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుక్కి గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శుక్రవారం చెత్త ఎత్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. కొడుకు చేసిన తప్పును సరిదిద్ది హుందాగా ప్రవర్తించిన ప్రద్యుమన్ సింగ్ తోమర్‌ను అందరూ అభినందిస్తున్నారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి)
Comments
Please login to add a commentAdd a comment