సాక్షి, పటాన్‌చెరు టౌన్: విదార్థులతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ట్యూషన్ టీచర్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా..రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సాల్మన్ రాజు పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ వెళ్తున్నారు.
సోమవారం ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజును నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment