tution
-
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు ఓ బాలిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 4 నెలల క్రితం నల్లగండ్లలోని అపర్ణ సరోవర్‌లోని ఈ–104 ఫ్లాట్‌కు మారారు. సందీప్‌కు ఒక కుమార్తె ఆహానా (12) తెల్లాపూర్‌లోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మ్యాథ్స్ ట్యూషన్ కోసం అదే అపార్ట్మెంట్లోని హెచ్–1501లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తుంది. అయితే ఆహానా తనకు ట్యూషన్ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయిప్పటికీ వారు ట్యూషన్‌కు వెళ్లాలంటూ కూతురిని బలవంతం చేశారు. దీంతో చిన్నారి యాధా విధిగా శుక్రవారం స్కూల్ నుంచి 3.30 గంటలకు వచ్చి సాయంత్రం 4.50 గంటలకు 15వ అంతస్తులోని బాల్కనీ కిటికీ తీసుకుని కిందకు దూకేసింది. కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు ఈ ఘటనపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అమ్మకాల ప్రక్రియను మార్చుకున్న బైజూస్
హైదరాబాద్: బైజూస్ తన వ్యాపార విక్రయ విధానంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుత డైరెక్ట్ విక్రయాల స్థానంలో నాలుగు అంచెల టెక్నాలజీ ఆధారితిత విక్రయాల ప్రక్రియను ప్రవేశపెట్టింది. తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులను విక్రయించకుండా నూతన విధానం అడు్డకుంటుందని బైజూస్ తెలిపింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులతో తన కోర్సులను కొనుగోలు చేయించేందుకు బైజూస్ తప్పుడు మార్గాలను అనుసరిస్తోందన్న ఆరోపణలపై.. బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నూతన విక్రయ నమూనా కింద.. బైజూస్ కోర్సులను కొనుగోలు చేయాలంటే నెలవారీ కనీసం ఆదాయం రూ.25,000 ఉండాలి. కోర్సు కొనుగోలుకు ముందు తల్లిదండ్రులు సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, నూతన విక్రయ విధానంలో ఉత్పత్తికి సంబంధించి, రిఫండ్ పాలసీ (వద్దనుకుంటే తిరిగి చెల్లింపులు) గురించి వివరంగా కస్టమర్‌కు జూమ్ లైవ్ సెషన్లో బైజూస్ తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్తులో ఆధారం కోసం రికార్డు రూపంలో ఉంచుతుంది. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఆ ప్లాట్‌ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్‌ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
అదే టార్గెట్, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి లాభాల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వెల్లడించింది. 2020– 21లో కంపెనీ రూ.2,428 కోట్ల టర్నోవర్‌పై రూ.4,588 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021– 22లో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే లాభం/నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్ కో–ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్ తెలిపారు. అలాగే భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. ‘వీరిలో సగం మందిని భారత్ నుంచి ఎంచుకుంటాం. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. టీచర్లను భారత్, యూఎస్ నుంచి ఎంపిక చేస్తాం’ అని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 50,000 మంది పనిచేస్తున్నారు. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
Crime News: ట్యూషన్ టీచర్ వలపు గాలం, ఆపై..
హనీట్రాప్ ఉదంతాలు ఎన్ని వెలుగు చూస్తున్నా.. వాటిలో కొన్ని మాత్రం విషాదాంతాలుగా మిగులుతుంటాయి. తాజాగా రాజస్థాన్‌లో డబ్బు కోసం వెంపర్లాడిన ఓ ట్యూషన్ టీచర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. తన అందంతో ఓ వ్యాపారవేత్తకు వల వేసిన ఆమె.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో కుటుంబంతో కలిసి హత్య చేశాడు ఆ వ్యక్తి. ఆపై కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మార్చి 16న వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సదరు యువతి పేరు ప్రియాంక(29) అని, ఢిల్లీ నుంచి వలస వచ్చిందని తెలిసింది. ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తుండడంతోపాటు స్థానిక వ్యాపారవేత్త కపిల్ గుప్తా ఇంటికి వెళ్లి పిల్లలకు ప్రైవేట్ పాఠాలు చెప్తుండేది. ఈ క్రమంలో ప్రియాంక అందానికి ఫిదా అయిన కపిల్.. ఆమెతో స్నేహం, ఆపై అనైతిక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ‘కట్నం’ కోసం బ్లాక్‌మెయిలింగ్ తనతో సంబంధాన్ని సాకుగా చేసుకుని.. ప్రియాంక, కపిల్‌పై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనకు పెళ్లి కుదిరిందని, వరుడి కుటుంబానికి రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని, అందుకు డబ్బు ఇవ్వాలంటూ కపిల్‌పై ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో భరించలేకపోయిన కపిల్.. అసలు విషయం భార్యకి, తన బావమర్దులకు చెప్పి ప్రియాంకను ట్రాప్ చేశాడు. డబ్బు కోసం గుడ్డిగా నమ్మివచ్చిన ప్రియాంకను హత్య చేసి.. గోనె సంచిలో కుక్కేసి తాతర్‌పూర్ బ్రిడ్జి కింద పడేశాడు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సోమవారం కపిల్‌తో పాటు ఆయన భార్య, ఆమె ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక ఇదే తరహా హానీ ట్రాపింగ్‌తోనే ఎనిమిది మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ట్యూషన్ పేరుతో ఇళ్లలోకి చేరి.. ఆపై పిల్లల తండ్రులకు వలపు గాలం వేసేదని, అటుపై వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేసి ఆ డబ్బుతో ఆమె జల్సాలు చేసేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. -
విద్యార్థులపై ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, పటాన్చెరు టౌన్: విదార్థులతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ట్యూషన్ టీచర్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా..రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సాల్మన్ రాజు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజును నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ
సాక్షి, రాయచూరు (కర్ణాటక): డబ్బు కోసం ఏడేళ్ల వయసున్న మేనకోడలిని కిడ్నాప్ చేయించిన మామ కటకటాల పాలయ్యాడు. వివరాలు..బాగల్కోటె నవనగరలో సునీత అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఓం అనే కుమారుడు, కృతికా బాడగండి(7) అనే కుమార్తె ఉంది. అన్నతో కలిసి బుధవారం రాత్రి ట్యూషన్ నుంచి ఇంటికి కాలినడకన వస్తుండగా కారులో వచ్చిన మేనమామ గద్దెనగిరి, మరో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. బాలికను కారులోకి ఎక్కిస్తుండగా తన చెల్లిని వదిలేయాలని అన్న ఓం దుండగుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. దుండగులు బాలుడిని తోసేసి బాలికను వెంట తీసుకెళ్లి రూ.50 లక్షలు ఇవ్వాలని బాధితురాలి తల్లి సునీతకు ఫోన్ చేశారు. ఆమె నవనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో దుండగులు ఆ బాలికను ఇంటి వద్ద వదిలేసి ఉడాయించారు. పోలీసులు బాలిక మేనమామను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా జూదం కోసం అవసరమైన డబ్బు కోసం కిడ్నాప్ చేయించినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చదవండి: నటుడి పేరుతో ఫేస్బుక్లో నగదు మోసం -
టీచర్ కొట్టిందని పోలీస్ స్టేషన్లో...
సాక్షి, హైదరాబాద్: హోంవర్క్ చేయలేదని బాలుడుని కొట్టిన ట్యూషన్ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో బాపూనగర్‌కు చెందిన ఎస్.రిమ్షానా తన కుమారుడు తనిష్‌ను వెంగళరావునగర్‌లో ఉండే మహిళ టీచర్ ఇంటికి ట్యూషన్‌కు పంపిస్తోంది. కాగా ట్యూషన్‌కు వెళ్లేందుకు బాలుడు భయపడుతుండటంతో తల్లి గట్టిగా అడగడంతో తనిష్ తన ఎడమచేతిపై అయిన గాయాలను చూపించాడు.ఒంటిపై కూడా గాయాలు కనిపించాయి.హోంవర్క్ చేయడం లేదని టీచర్ రోజు తనను కొడుతుందని బాలుడు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ట్యూషన్ టీచర్.. ట్విస్ట్ ఏంటంటే..
చండీఘడ్: కరోనా పుణ్యాన అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. పిల్లలు బడికి వెళ్లడం మానేసి అరచేతిలోనే ఆన్లైన్ పాఠాలు నేర్చుకుంటున్నారు. మరికొందరు ట్యూషన్ టీచర్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్యూషన్ టీచర్ విద్యార్థిని తీసుకుని పారిపోయిన ఘటన చండీఘడ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.. పానిపట్‌కు చెందిన ఓ కుటుంబం, తమ 17 ఏళ్ల కుమారునికి ట్యూషన్ చెప్పడానికి 20 ఏళ్ల వయసున్న మహిళా టీచర్‌ను నియమించింది. ఆమె గత మూడు నెలల నుంచి నిత్యం ఆమె ఇంటిలో అతడికి ట్యూషన్ చెబుతోంది. ప్రతి రోజు నాలుగు గంటల పాటు అతడికి పాఠాలు నేర్పించేది. ఈ క్రమంలో గత నెల 29న అతడు తమ ఇంటికి సమీపంలోని దేస్రాజ్ కాలనీలో ఉంటున్న టీచర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి అయినా కూడా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కొడుకుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా సదరు టీచర్ ఇంటికి చేరుకుని కుమారుడి కోసం వాకబు చేశారు. కానీ తమ కూతురు కూడా కనిపించడం లేదంటూ టీచర్ కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. దీంతో ఆ టీచర్‌పై మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ టీచర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీస్ అధికారి రాణా ప్రతాప్ తెలిపారు. ఆ టీచర్‌కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలిసింది. ఇక వారిద్దరు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు పేర్కొన్నారు.. చదవండి: కలెక్టర్ ఎమోషనల్: ఇంటి బిడ్డగా చూసుకున్నారు -
ట్యూషన్ మాస్టర్ ప్రేమ..పెళ్లికి నిరాకరించడంతో
కంటోన్మెంట్: ట్యూషన్ చెప్పేందుకు వచ్చి ప్రేమలో పడేసిన యువకుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మొహం చాటేశాడు. దీనికి తోడు తన తల్లిదండ్రులను సైతం అవమానించడంతో మనస్తాపానికి గురైన యువతి, మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలపాలైన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతోకట్టా తిరుమల అపార్ట్మెంట్ వాసి నర్సింహులు కూతురు శైలజ(23) బీటెక్ చదువుతోంది. వీరి ఎదురు ఫ్లాట్‌లో ఉండే పవన్ కల్యాణ్ అలియాస్ సన్ని(25) ఆమెకు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలో ఇరువురు ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని శైలజ తన తల్లిదండ్రులకు చెప్పడంతో, పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఇరువురి పెళ్లి ప్రస్తావనను తిరస్కరించిన పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు, శైలజ తల్లిదండ్రులను కులం పేరిట దూషించారు. తర్వాత కొన్ని రోజులకు శైలజ ఇంట్లో ఎవరూలేని సమయంలో వారింట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, ఆమెను చంపేస్తానని బెదిరించాడు. నెల రోజుల్లోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని చూపిస్తానని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురై శైలజ ఈ నెల 27న రాత్రి 10.00 గంటల సమయంలో తమ అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన శైలజ పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Lockdown: ఐదు నిమిషాలు ఆలస్యం.. రూ.వెయ్యి ఫైన్! -
ట్యూషన్‌కు వచ్చిన యువతిని బలవంతంగా..
లక్నో : ‘లవ్ జిహాద్’ పేరుతో 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల ప్రకారం..యూపీ మీరట్‌కు చెందిన 25 ఏళ్ల అమన్ అనే యువకుడు తన వద్ద ట్యూషన్‌కు వచ్చిన యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని కోరగా, అందుకు అమ్మాయి అంగీకరించలేదు. దీంతో ఆమె తమ్ముడిని హత్య చేస్తానంటూ అమన్ బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో తెలిపింది. (పెళ్లి చేసుకోవాలని మహిళ వేధింపులు.. జవాను ఆత్మహత్య) యువతిని ఢిల్లీకి తీసుకెళ్లిన అమన్..ఆమెను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. ట్యూషన్‌కు వెళ్లిన యువతి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్ టీచర్ అమన్ తమ కూతురిని కిడ్నాప్ చేసినట్లు వారు ఫిర్యాదులో తెలిపారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా యువతి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..అమన్‌ను అరెస్ట్ చేసి, యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు యువతి పేర్కొనడంతో అమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. (ప్రాణం తీసిన ప్రేమ ) -
ట్యూషన్లో మృగాడు
హొసూరు: దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుండగా మరో వైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. విద్య కోసం తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ కన్నేసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కీచకున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈఘటన హొసూరు సమీపంలో నెల్లూరు వద్ద చోటు చేసుకుంది. నెల్లూరు వద్ద మీన అనే మహిళ హాస్టల్ నిర్వహిస్తోంది. ఇక్కడ ఏ నెల్లూరు గ్రామానికి చెందిన తిమ్మన్నగౌడ కొడుకు ఆనంద్ ట్యూషన్ చెబుతుండేవాడు. ఈక్రమంలో 10వ తరగతి చదివే బాలికపై ఆనంద్ కన్నేశాడు. బుధవారం ఆ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై అక్కడకు చేరుకొని ఆనంద్‌ను బంధించారు. అనంతరం హాస్టల్ నిర్వాహకురాలు మీనా హొసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొనిన ఆనంద్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
హోమ్ ట్యూషన్స్ @ ఆచార్య.నెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఇక్కడ ట్యూషన్స్ చెప్పబడును’ అని ఇంటి గేటుకు బోర్డులు చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడీ బోర్డులు ఆచార్య.నెట్లోకి ఆన్‌లైన్‌లోకి ఎక్కేశాయి. విజయవాడకు చెందిన ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే? ఓలా, ఉబెర్‌లలో ఎలాగైతే మనకు దగ్గర్లోని క్యాబ్స్ వివరాలు వస్తాయో.. అచ్చం అలాగే ఆచార్య.నెట్లో మన ఇంటికి దగ్గర్లో ఉన్న టీచర్ల వివరాలొస్తాయి. కేజీ నుంచి పీజీ వరకూ అన్ని రకాల పాఠ్యాంశాల ఉపాధ్యాయులు ఇందులో నమోదై ఉన్నారు. మరిన్ని వివరాలు ఫౌండర్ డాక్టర్ రాజేశ్ గుంతి మాటల్లోనే.. ఈ ఏడాది ప్రారంభంలో విజయవాడ కేంద్రంగా ఆచార్య.నెట్‌ను ప్రారంభించాం. స్కూల్ సబ్జెక్ట్స్ నుంచి మొదలుపెడితే బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్స్‌లు, ఫైన్ ఆర్ట్స్, హాబీలు, పోటీ పరీక్షల సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ వంటి అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రస్తుతం 17 వేల సబ్జెక్ట్స్, వెయ్యికి పైగా ప్రొఫెషనల్ కోర్స్లున్నాయి. 7 వేల మంది అధ్యాపకులు నమోదయ్యారు. ఒక్క టీచర్ రిజిస్ట్రేషన్ కోసం ఏడాదికి రూ.99. వివరాలు, ఫీజులు.. విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలంటే? ఆచార్య.నెట్ యాప్ లేదా వెబ్సైట్లోకి లాగిన్ అయి.. పేరు, చిరునామా తదితర వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత విద్యార్థికి కావాల్సిన సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేస్తే.. మీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న నమోదిత టీచర్లు, సమయం, ఫీజుల వివరాలు వస్తాయి. అంతే! మీకు కావాల్సిన టీచర్లను ఎంపిక చేసుకోవటమే. హోమ్ ట్యూషన్ గానీ ఆచార్య సెంటర్లో గానీ ట్యూషన్ పొందవచ్చు. ఇప్పటివరకు 26 వేల విజిటర్స్ ఉన్నారు. 1,400 మంది విద్యార్థులు మా సేవలను వినియోగించుకున్నారు. ఏడాదిలో 5 లక్షల మంది లక్ష్యం.. సభ్యత్వం తీసుకున్న విద్యార్థులకు ఏడాది పాటు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. అధ్యాపకులకు ఖాళీ సమయంలో విద్యార్థులకు స్పెషల్ క్లాస్‌లు, ట్యూషన్స్ తీసుకుంటే వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 5 లక్షల మంది విద్యార్థులు, 50 వేల మంది టీచర్ల నమోదు లక్ష్యం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించిఅందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
విద్యార్థిని చితకబాదిన టీచర్.. కేసు నమోదు
ఉప్పల్: చిలుకానగర్‌లోని ఓ ప్రైౖవేటు స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడిపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. చిలుకానగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పద్యం అప్పజెప్పలేదని పదవతరగతి విద్యార్థినిని తెలుగు ఉపాధ్యాయుడు యశ్వంత్ చితక బాదాడు. బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచడంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తండ్రి వేంకటేశ్వర్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థిని కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్లగా సమాచారం తెలుసుకున్న తెలుగు మాస్టార్ కుటుంబ సభ్యులు వచ్చి వెంకటేశ్వర్లుపై స్కూల్లోనే దాడి చేసి చితక బాదారు. దీంతో స్కూల్లో కాసేపు భయానక వాతావరణం నెల కొంది. విద్యార్థినిపై దాడిచేసిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలి
వేలూరు, న్యూస్‌లైన్: వాణియంబాడిలో విద్యార్థిని వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలని కోరుతూ విద్యార్థులు పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. వాణియంబాడి సమీపం పుదూరు గ్రామంలోని ప్రైవేటు హైస్కూల్లో వాణియంబాడికి చెందిన గోపి ప్లస్‌టూ గణితం టీచర్‌గా పనిచేస్తున్నాడు. గోపి ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ చెపుతుంటాడు. అక్కడకు వచ్చే విద్యార్థినుల పట్ల గోపి అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదాలతో దూషిం చడం చేశాడు. విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు పాఠశాల ఆవరణ వద్దకు చేరుకొని ఉపాధ్యాయున్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలను ముట్టడించారు. విషయం తెలుసుకున్న వాణియంబాడి పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరారీలో ఉన్న నిందితున్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.