
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ పిలింనగర్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment