హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌ | Home Tutions in Startup Company | Sakshi
Sakshi News home page

హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌

Published Sat, Aug 3 2019 10:57 AM | Last Updated on Sat, Aug 3 2019 10:57 AM

Home Tutions in Startup Company - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘ఇక్కడ ట్యూషన్స్‌ చెప్పబడును’ అని ఇంటి గేటుకు బోర్డులు చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడీ బోర్డులు ఆచార్య.నెట్‌లోకి ఆన్‌లైన్‌లోకి ఎక్కేశాయి. విజయవాడకు చెందిన ఈ స్టార్టప్‌ ప్రత్యేకత ఏంటంటే? ఓలా, ఉబెర్‌లలో ఎలాగైతే మనకు దగ్గర్లోని క్యాబ్స్‌ వివరాలు వస్తాయో.. అచ్చం అలాగే ఆచార్య.నెట్‌లో మన ఇంటికి దగ్గర్లో ఉన్న టీచర్ల వివరాలొస్తాయి. కేజీ నుంచి పీజీ వరకూ అన్ని రకాల పాఠ్యాంశాల ఉపాధ్యాయులు ఇందులో నమోదై ఉన్నారు. మరిన్ని వివరాలు ఫౌండర్‌ డాక్టర్‌ రాజేశ్‌ గుంతి మాటల్లోనే..

ఈ ఏడాది ప్రారంభంలో విజయవాడ కేంద్రంగా ఆచార్య.నెట్‌ను ప్రారంభించాం. స్కూల్‌ సబ్జెక్ట్స్‌ నుంచి మొదలుపెడితే బీటెక్, ఎంబీఏ, ఎంటెక్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్స్‌లు, ఫైన్‌ ఆర్ట్స్, హాబీలు, పోటీ పరీక్షల సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్‌ వంటి అన్ని రకాల సబ్జెక్ట్స్‌ ఉంటాయి. ప్రస్తుతం 17 వేల సబ్జెక్ట్స్, వెయ్యికి పైగా ప్రొఫెషనల్‌ కోర్స్‌లున్నాయి. 7 వేల మంది అధ్యాపకులు నమోదయ్యారు. ఒక్క టీచర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఏడాదికి రూ.99.

వివరాలు, ఫీజులు..
విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలంటే? ఆచార్య.నెట్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి.. పేరు, చిరునామా తదితర వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత విద్యార్థికి కావాల్సిన సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేస్తే.. మీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న నమోదిత టీచర్లు, సమయం, ఫీజుల  వివరాలు వస్తాయి. అంతే! మీకు కావాల్సిన టీచర్లను ఎంపిక చేసుకోవటమే. హోమ్‌ ట్యూషన్‌ గానీ ఆచార్య సెంటర్‌లో గానీ ట్యూషన్‌ పొందవచ్చు. ఇప్పటివరకు 26 వేల విజిటర్స్‌ ఉన్నారు. 1,400 మంది విద్యార్థులు మా సేవలను వినియోగించుకున్నారు.

ఏడాదిలో 5 లక్షల మంది లక్ష్యం..
సభ్యత్వం తీసుకున్న విద్యార్థులకు ఏడాది పాటు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. అధ్యాపకులకు ఖాళీ సమయంలో విద్యార్థులకు స్పెషల్‌ క్లాస్‌లు, ట్యూషన్స్‌ తీసుకుంటే వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 5 లక్షల మంది విద్యార్థులు, 50 వేల మంది టీచర్ల నమోదు లక్ష్యం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించిఅందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement