వేలూరు, న్యూస్‌లైన్:
వాణియంబాడిలో విద్యార్థిని వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలని కోరుతూ విద్యార్థులు పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. వాణియంబాడి సమీపం పుదూరు గ్రామంలోని ప్రైవేటు హైస్కూల్‌లో వాణియంబాడికి చెందిన గోపి ప్లస్‌టూ గణితం టీచర్‌గా పనిచేస్తున్నాడు. గోపి ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ చెపుతుంటాడు. అక్కడకు వచ్చే విద్యార్థినుల పట్ల గోపి అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదాలతో దూషిం చడం చేశాడు.
విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు పాఠశాల ఆవరణ వద్దకు చేరుకొని ఉపాధ్యాయున్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలను ముట్టడించారు. విషయం తెలుసుకున్న వాణియంబాడి పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరారీలో ఉన్న నిందితున్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలి
Published Sat, Feb 1 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement