సాక్షి, హైదరాబాద్: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు ఓ బాలిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 4 నెలల క్రితం నల్లగండ్లలోని అపర్ణ సరోవర్‌లోని ఈ–104 ఫ్లాట్‌కు మారారు. సందీప్‌కు ఒక కుమార్తె ఆహానా (12) తెల్లాపూర్‌లోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
మ్యాథ్స్ ట్యూషన్ కోసం అదే అపార్ట్‌మెంట్‌లోని హెచ్–1501లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తుంది. అయితే ఆహానా తనకు ట్యూషన్ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయిప్పటికీ వారు ట్యూషన్‌కు వెళ్లాలంటూ కూతురిని బలవంతం చేశారు. దీంతో చిన్నారి యాధా విధిగా శుక్రవారం స్కూల్ నుంచి 3.30 గంటలకు వచ్చి సాయంత్రం 4.50 గంటలకు 15వ అంతస్తులోని బాల్కనీ కిటికీ తీసుకుని కిందకు దూకేసింది. కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు ఈ ఘటనపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment