వెల్లూరు(చెన్నై): కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వారసత్వ రాజకీయాలు సాగిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. తాను 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై మాట్లాడడంలేదని, ఆయా పార్టీల్లో రెండు, మూడు, నాలుగో తరాల గురించి మాట్లాడుతున్నానని వివరించారు. ఆ పార్టీలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని మండిపడ్డారు.
మారన్ కుటుంబం రెండు తరాలుగా, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా, సోనియా గాంధీ కుటుంబం నాలుగు తరాలుగా అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడులోని వెల్లూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు.
చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు
Comments
Please login to add a commentAdd a comment