చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.
ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్‌తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.
ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.
ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు
Comments
Please login to add a commentAdd a comment