DMK MP
-
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్‌తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు -
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?
ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు. ‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్ కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలని సుస్మితా దేవ్ కమిటీ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్‌గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. -
బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు
సాక్షి, చెన్నై: కడలూరు డీఎంకే ఎంపీ రమేష్.. సోమవారం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని పోలీసులు రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. తన పరిశ్రమలో పనిచేస్తున్న గోవిందరాజన్ అనే వ్యక్తిని హింసించడమే కాకుండా బలవంతంగా విషం తాగించి హతమార్చినట్లు ఎంపీ రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీపై సీబీసీఐడీ హత్య కేసు నమోదు చేసింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్‌ను సీబీసీఐడీ వర్గాలు అరెస్టు చేశాయి. ఎంపీని కూడా అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సోమ వారం బన్రూట్టి కోర్టులో ఎంపీ రమేష్ లొంగిపోయారు. రిమాండ్‌కు వెళ్లే సమయంలో ఎంపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో తాను నిర్దోషినని, కొన్ని రాజకీయ పార్టీలు తన మీద వచ్చిన ఆరోపణల్ని రాజకీయం చేసే పనిలో పడ్డాయని, అందుకే కోర్టులో లొంగి పోయినట్టు తెలిపారు. -
DMK MP: రాజాకు సతీవియోగం
సాక్షి, చెన్నై: డీఎంకే ఎంపీ ఎ.రాజా సతీమణి పరమేశ్వరి (53) క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శనివారం రాత్రి మృతిచెందారు. రాజా కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేసిన సమయంలో 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకే నీలగిరి ఎంపీగా, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య పరమేశ్వరి కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్రోంపేటలోని రేల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో సీఎం స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించి రాజాను పరామర్శించారు.ఆదివారం పెరంబలూరులో పరమేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి. (చదవండి: 22కు చేరిన అలీగఢ్ కల్తీ మద్యం మృతులు) -
డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు ఈడీ షాక్..!
చెన్నై: డీఎంకే లోక్‌సభ ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఫెమా నిబంధనలను ఎంపీ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్ళు వంటి స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ మొత్తంగా రూ .89.19 కోట్ల వాటాలను స్వాధీనం చేసుకుంది. ఎంపీ జగత్రక్షకన్ తమిళనాడులోని అరక్కోణం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 లో జగత్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ 90 లక్షల షేర్లను సింగపూర్‌లోని మెసర్స్ సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి కొనుగోలు చేశారని.. అయితే ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదని వెల్లడైంది. ఫెమా 37ఏ నిబంధనల ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న విదేశీ మారకద్రవ్యం, విదేశీ భద్రత, స్థిరమైన ఆస్థి ఫెమాలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ మొత్తం విలువకు సమానమైన ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంది. దీనికి అనుగుణంగలా తమిళనాడులోని వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ రూపంలో జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులనుంచి రూ. 89.19 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఫెమా సెక్షన్ 37ఏ నిబంధనల ప్రకారం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. (‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’) -
తమిళ ఎంపీలను బయటికి పంపిన వెంకయ్య
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపణీపై రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఏఐఏడీఎంకే, డీఎంకే సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు బయటకు పంపించారు. ఇదే అంశంపై గందరగోళం తలెత్తడంతో సభ తొలుత రెండుసార్లు, ఆ తరువాత రోజంతటికీ వాయిదా పడింది. నిబంధన 255ని అనుసరించి..తమిళనాడుకు చెందిన డజనుకుపైగా ఎంపీలు రోజంతా సభ కు దూరంగా ఉండాలని వెంకయ్య ఆదేశించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డీఎంకే సభ్యులు మద్దతు పలికారు. జల వనరుల మంత్రి గడ్కరీ బదులిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ చెప్పినా వారు వినిపించుకోలేదు. -
ఎ.రాజా, కనిమొళిపై ఛార్జిషీట్ నమోదు
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఐపీసీ 120-బి కింద నిందితులపై కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఎం.రాజా, కనిమొళితో పాటు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మళ్ సహా 16మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అలాగే స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్, వినోద్ గోయోంకాలపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. మరోవైపు నిందితులు మాత్రం తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు. తమపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్‌కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. -
డీఎంకే ఎంపీకి జైలు శిక్ష
సాక్షి, చెన్నై:డీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీఎం సెల్వగణపతి ఒక్కప్పుడు అన్నాడీఎంకే నేత. ఆ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. 1991-96 కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్లో ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో జవహర్ రోజ్‌గార్ యోజన పథకం నిధులను ఆయన దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో పాటుగా మంత్రుల అవినీతి భాగోతాల్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఒక్కొక్కటిగా వెలికి తీసింది. ఇందులో సెల్వగణపతి భాగోతం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడంతో పాటుగా శ్మశానాల్లో షెడ్ల పేరిట అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐఏఎస్ అధికారుల సహకారంతో ఒకే సంస్థకు కాంక్రీట్ షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు తేలింది. దీంతో సెల్వగణపతి, అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ఆచార్యులు, ఆ శాఖ డెరైక్టర్‌గా ఉన్న సత్యమూర్తి, ప్రాజెక్టు అధికారి కృష్ణమూర్తి, ఓం మురుగా సిమెంట్స్ ప్రతినిధి టీ భారతితో పాటుగా మరొకరిపై కేసు నమోదు అయింది. విచారణ : ఈ కేసు విచారణ పదిహేను సంవత్సరాలుగా చెన్నై ప్రత్యేక సీబీఐ కోర్టులో సాగుతోంది. సీబీఐ విచారణను ముగించి చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాదనలు ముగియడంతో విచారణ తుది దశకు చేరింది. నాగపట్నం జిల్లాలో 100 షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు, ఒక్కో షెడ్డుకు రూ.30 వేలు చొప్పున 30 లక్షలు ఏకకాలంలో మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జవహర్ రోజ్‌గార్ పథకం ఈ షెడ్ల నిర్మాణానికి వర్తించదని నిర్ధారణ అయింది. ఈ షెడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధులు రూ.23 లక్షలు దుర్వినియోగం అయినట్టు, శ్మశాన షెడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా సీబీఐ నిరూపించింది. సీబీఐ తరపున న్యాయవాది భాస్కరన్ తన వాదనను ముగించడంతో తీర్పు వెలువరిచేందుకు ప్రత్యేక న్యాయ స్థానం న్యాయమూర్తి ఎస్ మాలతి నిర్ణయించారు.తీర్పు: గురువారం న్యాయమూర్తి ఎస్ మాల తి తీర్పు వెలువరించారు. అవినీతి నిరూపణ కావడంతో సెల్వగణపతి, ఆచార్యులు, సత్యమూర్తి, కృష్ణమూర్తి, భారతీలకు మూడేళ్లకు పైగా శిక్ష పడొచ్చని సర్వత్రా భావించారు. అయితే, శిక్ష కేవలం రెండేళ్లకు పరిమితం అయింది. రూ. 25 వేలు జరిమానా విధిం చారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో నాలుగు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ తీర్పుకు సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ శిక్ష మూడేళ్ల కన్నా, తక్కువగా ఉండడంతో అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ సమయంలో ఒకరు మరణించడంతో ఆయనపై కేసును కొట్టి వేశారు. డీఎంకేకు షాక్: ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకుడిగా ఉన్న సమయంలో సెల్వగణపతిపై తాము వేసిన కేసు ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలినట్టు అయింది. ప్రస్తుతం సెల్వగణపతి తమ పార్టీలో ఉండడం, ఇటీవలే ఆయనకు రాజ్య సభ పదవిని సైతం డీఎంకే అధిష్టానం కట్టబెట్టింది. ఇప్పుడు డీఎంకే ఎంపీకి శిక్ష పడ్డట్టు ప్రచారం సాగుతుండడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎన్నికల వేళ ఈ శిక్ష వ్యవహారం కాస్త ప్రతి పక్షాలకు ఆయుధంగా మారింది.