![DMK MP A Raja Wife Passed Away In Tamil Nadu - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/30/CNI15.jpg.webp?itok=khw1TbUn)
సాక్షి, చెన్నై: డీఎంకే ఎంపీ ఎ.రాజా సతీమణి పరమేశ్వరి (53) క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శనివారం రాత్రి మృతిచెందారు. రాజా కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేసిన సమయంలో 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకే నీలగిరి ఎంపీగా, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య పరమేశ్వరి కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్రోంపేటలోని రేల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో సీఎం స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించి రాజాను పరామర్శించారు.ఆదివారం పెరంబలూరులో పరమేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి.
(చదవండి: 22కు చేరిన అలీగఢ్ కల్తీ మద్యం మృతులు)
Comments
Please login to add a commentAdd a comment