చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్‌లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్‌షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు.
ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కాగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment