Air Show
-
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ప్రారంభం
-
నేటి నుంచి ఏరో ఇండియా
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా’15వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదిక కానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యూ–57, అమెరికాకు చెందిన ఎఫ్–35 లైట్నింగ్ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వివరాలను ఆదివారం రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది. ఈ ఎడిషన్‌ను ‘ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’అనే ఇతివృత్తంతో చేపట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది . ఇందులో 90 వరకు దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని వివరించింది. సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపింది. -
హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో అదరహో (ఫొటోలు)
-
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో
-
నేడు నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో !
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద వాయుసేనకు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వాయుసేన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగనుంది. అద్భుత వైమానిక విన్యాసాలు చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు బృందాల్లో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నందున.. నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్‌లో ప్రజల కోసం ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరవుతారని సీఎస్ చెప్పారు.అందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ అదనపు కమిషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. కాగా, వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి బృందం శనివారం సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను బహూకరించింది. -
హైదరాబాద్ : సాగర తీరంలో ఎయిర్ షో..అదరహో..(ఫొటోలు)
-
ఎయిర్ షో విషాదం.. స్పందించిన సీఎం స్టాలిన్
చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్‌లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్‌షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు. ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.కాగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. -
TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.ఎయిర్‌షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. షో కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్‌లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్‌షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్‌షో -
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
చెన్నై: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. పలువురి మృతి
చెన్నై: తమిళనాడు చెన్నై ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మెరీనా బీచ్‌లో ఎయిర్ షో అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎయిర్ షో ముగిసిన తర్వాత జనాలు తిరిగి వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లోనూ తొక్కిసలాట జరిగింది. డీహైడ్రేషన్ కారణంగా సొమ్మసిల్లి 290 మంది పడిపోవటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిన 80 మందిని ఆసుపత్రి తరలించారు. Closecall#IndianAirForce #Chennai #ChennaiAirShow2024 #ChennaiAirShow #Airshow #ChennaiMarina #MarinaBeach ch pic.twitter.com/4FvsqaCNPh— Bharani Dharan (@bharani2dharan) October 6, 2024 ఎయిర్ షో చూసేందుకు లక్షాలాది మంది జనాలు తరలివచ్చారు. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. జనం భారీగా రావటంతో పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. The worst arrangement by the govtStampede in Marina!#IndianAirForce#tngovt #chennai #marina pic.twitter.com/Qjb6B1OvJg— Sankrithi (@sank_rang) October 6, 2024 వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.More people gathered here no cop to navigate the public!!No water and Bio toilets were arranged The government should arrange enough train and bus transport to relocate people from destination to parking .#Chennai#AirShow2024 pic.twitter.com/rrNU1GgOvG— ல.மோ. ஜெய்கணேஷ் (@jai_lm) October 6, 2024సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షలమందిపైగా లోకల్ ట్రైన్లలో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే, మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా బీచ్‌కు సుమారు 15 లక్షలకుపైగా ప్రజలు వచ్చినట్లు అంచనా. Marina Beach Chennai AF Day celebrationIndian Airforce came into existence on 08 Oct 1932 pic.twitter.com/r3jUS5wKTc— धर्म व देश से ऊपर कोई नही (@VaDharma) October 6, 2024లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మెరీనా బీచ్ ఎయిర్ షో నమోదుకు విస్తృత ప్రచారం. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో ఏర్పాటు చేశారు.#WATCH | Chennai, Tamil Nadu | A woman seen being evacuated from a huge rush at the Mega Air Show on Marina Beach ahead of the 92nd Indian Air Force Day.There are reports of attendees fainting, rushed to the hospital due to heavy crowd presence and heat. pic.twitter.com/SgNEhuTnUH— ANI (@ANI) October 6, 2024 -
ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఓ ఎయిర్‌షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్‌వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
లిస్బన్: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక, పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3— The Spot (@Spotnewsth) June 2, 2024 -
ఎగిరిపోయిన లోహ విహంగాలు
సనత్‌నగర్ (హైదరాబాద్): బేగంపేట విమానాశ్రయం వేదికగా కనువిందు చేసిన వింగ్స్ ఇండియా– 2024 ముగిసింది. చివరి రోజు సెలవు దినం ఆదివారం కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో ఏవీయేషన్ షో తిలకించేందుకు తరలివచ్చారు. సందర్శకుల తాకిడితో ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. రన్‌వేపై ప్రదర్శనకు ఉంచిన చిన్నా పెద్దా విమానాలు, హెలికాప్టర్లు, చాపర్లు వీక్షించి మురిసిపోయారు. వినువీధిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్, గ్లోబల్ స్టార్స్‌కు చెందిన మార్క్‌జెఫర్స్ బృందం లోహ విహంగాలతో చేసిన చిత్ర విన్యాసాలతో పులకించిపోయారు. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విశేషాలెన్నో వీక్షించి తరించారు. ఏవియే షన్ రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ సందర్శకులు పోటెత్తా రు. ఏవియేషన్ షోలో అడుగడుగునా తిరిగి అద్భుతాలను ఆస్వాదించారు. నింగిలో ‘హృదయ’పూర్వకంగా రంగు రంగుల ముగ్గులను వే స్తూ కనురెప్పలను వాల్చనీయకుండా చేసిన ఏరో »ొటిక్స్ అంతులేని అనుభూతులను మిగిల్చాయంటూ తమ మనోభావాలను వెల్లడించారు. చివరి రోజు వరకు ఉన్న విమానాలు... బిజినెస్ డేస్‌గా చెప్పే మొదటి రెండు రోజుల పాటు కనువిందు చేసిన అనంతరం సాధారణంగా ‘షో’ నుంచి చాలావరకు ని్రష్కమిస్తాయి. కానీ ఈ సారి ఆఖరి రోజు వరకు రెండు, మూడు చిన్న విమానా లు తప్ప మిగతావన్నీ రన్‌వే పై కొలువుదీరి ఉండి సందర్శకులను కనువిందు చేశాయి. షోకు హైలెట్ గా నిలిచిన బోయింగ్ 777ఎక్స్, ఎ యిర్‌బస్, ఎయి ర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో కార్గో విమానాలు చివరి క్షణం వరకు ఉండి ఆనందాన్ని రెట్టింపు చేశాయి. ఆదివారం షో ముగియడంతో బై..బై అంటూ గాలిలో ఎగిరిపోయాయి. సారంగ్, మార్క్‌జెఫర్స్ బృందాలకు సెల్యూట్ నాలుగు రోజుల పాటు గ‘ఘన’విన్యాసాలతో సందర్శకులకు వినోదంతో పాటు మధురానుభూతులను పంచిన సారంగ్ టీమ్, మార్క్‌జెఫర్స్ బృందానికి భాగ్యనగరం సెల్యూట్ చేసింది. నింగిలో ‘హృదయా’ంతరాలు మురిపించేలా ఏరో»ొటిక్స్ చేసిన బృంద సభ్యులతో సందర్శకులు ఫొటోలు దిగారు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. హైదరాబాద్ సందర్శకులు తమపై చూపించిన ఆప్యాయతకు ఆ బృందాలు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచాయి. ఈ సారి కి బై బై అంటూ..మళ్ళీ రెండేళ్ళకు కలుసుకుందాం అంటూ హైదరాబాదీయులకు వీడ్కోలు పలికిన ఏరో»ొటిక్స్ బృందాలు ఏవియేషన్ షో నుంచి వెనుదిరిగాయి. -
బేగంపేట్ ఎయిర్ పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా-2024 షో
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్‌గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్‌ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అబ్బుర పరిచిన వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: అనుకున్నట్లుగానే చక్కని ప్రణాళికతో, స్వల్పకాల రిహార్సల్స్‌తో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ఏయిర్ షో లక్షమందికి పైగా ప్రేక్షకుల్ని కన్నార్పకుండా చేసింది. తొమ్మిది హాక్ ఎంకే–132 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడా బృందం నరేంద్ర మోదీ స్టేడియంపై చరిత్ర సృష్టించింది. లక్షా 32 వేల మంది జేజేలతో విన్యాసాలను ఆస్వాదించారు. సూర్యకిరణ్ టీమ్ వైమానిక విన్యాసాలు కొత్త కాకపోయినా... ఓ క్రికెట్ స్టేడియంపై ఎయిర్‌షో చేయడమే కొత్త. గతంలో క్రికెట్ అనే కాదు... ఏ ఆటకు అంతెందుకు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ (2010)లోనూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. తద్వారా ఈ ప్రపంచకప్‌కు ఎయిర్ షో కొత్త శోభ తెచ్చినట్లయింది. -
కనీవినీ ఎరుగని రీతిలో ప్రారంభమైన 'ప్యారిస్ ఎయిర్ షో' (ఫోటోలు)
-
Aero India 2023: ఆసియాలోనే అతి పెద్ద ఏరో షో ను ప్రారంభించిన మోదీ (ఫొటోలు)
-
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
హైదరాబాద్: రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో
-
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో
సాక్షి, హైదరాబాద్: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ పరిశ్రమపై రౌండ్ టేబుల్ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్ ఫైనాన్సింగ్– లీజింగ్ డ్రోన్స్, ఏవియేషన్ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. చివరి 2రోజులూ సందర్శకులకు... ఈ ఈవెంట్లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ ) విహంగాలు.. విశేషాలు.. ఈసారి ఎయిర్ షోలో సరికొత్త ఎయిర్ బస్ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్ బస్ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్ కు చెందిన ఎంబ్రార్స్ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్స్ట్రేషన్ టూర్లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన సారంగ్ టీమ్ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
Viral Photos: ట్రైలరే ఇలా ఉంటే.. సిన్మా ఎలా ఉంటుందో?
ఘజియాబాద్: ఎయిర్ ఫోర్స్-డేను పురస్కరించుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్టోబర్ 8( శుక్రవారం)న 89వ వార్షికోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ క్రాఫ్టులతో ఐఏఎఫ్ ఎయిర్ షో ప్రదర్శించనుంది. అందులో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ చేస్తోంది. తాజాగా ఎయిర్ షోకు సంబంధించిన రిహార్సల్స్ ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టులను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తామని ఐఏఎఫ్ పేర్కొంది.శుక్రవారం ఉదయం 8గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్టు ప్రదర్శనతో ఎయిర్ షో మొదలుకానుందని తెలిపారు. తర్వాత హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్టు, మోడరన్ ట్రాన్‌పోర్టు, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన ఉంటుందని ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయిని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతంలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఐఏఎఫ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్త బయట వేయటం వల్ల పక్షలు తిరుగుతాయిని దాని వల్ల తక్కువ ఎత్తులో జరిగే ఎయిర్ షోకు ఇబ్బందులు కలుగుతాయిని తెలిపారు. -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
జమ్ము కశ్మీర్లో భారత 'వైమాని దళ విన్యాసం'
-
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యలహంకలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై, వైమానిక ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనతో భారత ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ వైమానిక ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రశంసించారు. సుమారు 530 కంపెనీలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు చెప్పారు. హైబ్రిడ్ ఫార్మాట్లో తొలిరోజు ఏరో షో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్తో రూ.48 వేల కోట్ల ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అబ్బురపరిచిన విన్యాసాలు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా స్వదేశీ నిర్మిత తేజస్, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అలరించాయి. ఈసారి వైమానిక ప్రదర్శనలో అమెరికాకు చెందిన బీఐఓ బాంబర్ విమానం మినహా విదేశీ విమానాలన్నీ పాల్గొన్నాయి. కాగా, కోవిడ్–19 కారణంగా బ్రిటన్, ఐరోపా దేశాలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశాయి. కానీ, ఆయా దేశాల రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన బోయింగ్, ఎయిర్‌బస్, లుఫ్తాన్సా, లాక్టిన్‌హెడ్ తదితర కంపెనీలు భారత కంపెనీలతో ఒప్పందం చేసుకుని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు. -
భారత్ లక్ష్యం.. ‘మేక్ ఫర్ వరల్డ్’
సాక్షి, బెంగళూరు: రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేసిన భారత్ తదుపరి లక్ష్యం ‘మేక్ ఫర్ వరల్డ్’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక సమీపంలో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగళూరులో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 500 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాల కోసం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. దేశ సరిహద్దులతో పాటు నీరు, నేల రక్షణ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. భారత వాయుసేన తేజస్ ఎంకే1 లఘు యుద్ధ విమాన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానిక దళ పాటవం అబ్బురపరిచింది. యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, సూర్యకిరణ్ జెట్ల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఏరో ఇండియా ప్రదర్శన ద్వారా భారత ఖ్యాతి మరింత వెలుగులోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్తో రూ.48వేల కోట్ల డీల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్సీఏ) కొను గోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఒప్పంద పత్రాలను రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు హెచ్ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు అందజేశారు. -
నింగినంటే సంబరం
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు బెంగళూరు యలహంక వైమానిక స్థావరం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అలరించే ఈ ఆకాశ వేడుక ఈ నెల 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఏరో షో జరిగే ప్రదేశం చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రదర్శనల్లో దుర్ఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా ప్రమాదాలు, హాని జరగకుండా తప్పించేందుకు గ్రిడ్, సబ్ గ్రిడ్, మైక్రో గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించాయి. 600 పైగా ప్రదర్శనలు.. ఈ కార్యక్రమంలో 600లకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. గతేడాది 22 దేశాల నుంచి ప్రదర్శనలు వచ్చాయి. కాగా కోవిడ్ కారణంగా ఈసారి 14 దేశాలకు మాత్రమే అనుమతి లభించింది. సందర్శకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. వైమానిక రంగంలో నూతన ఆవిష్కారాలను చాటేలా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. -
దేశంలోనే తొలిసారి పాలమూరులో అబ్బురం
సాక్షి, మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా మోటార్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్ అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్ ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారా మోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతుందని ప్రకటించారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
‘సీఎం జగన్ నిండు నూరేళ్లు వర్థిల్లాలి’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవ ముందస్తు వేడుకలను సిమ్స్ కళాశాలల డైరెక్టర్ భరత్‌రెడ్డి పద్మావతిఘాట్‌లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో సీఎం జగన్‌కు ఎయిర్ షో విన్యాసాలతో శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ‘దిశ చట్టం’పై అవగాహన కల్పిస్తూ విద్యార్ధినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దిశ చట్టం’ ద్వారా సీఎం జగన్ మహిళల్లో భరోసా నింపారని.. ‘దిశ చట్టం’ తీసుకువచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆమె అన్నారు. రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. నేటికి మహిళలు అర్ధరాత్రి తిరిగే స్వాతంత్రo రాలేదన్నారు. ప్రపంచంలోనే మనదేశం.. మహిళపై జరిగే దాడులు, కేసుల్లో ముందున్నదని తెలిపారు. నిర్భయ, దిశ లాంటి ఘటనలు మన రాష్ట్రంలో చోటుచేసుకోకుండా మహిళ పట్ల చిత్తశుద్ధితో సీఎం జగన్ ‘దిశ చట్టం’ తీసుకు వచ్చారని హోంమంత్రి సుచరిత గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఏపీలో మహిళలపై దాడులకు సంబంధించి 15వేల కేసులు నమోదు అవుతున్నాయని ఆమె చెప్పారు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ‘దిశ చట్టం’ ద్వారా ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21రోజుల్లో శిక్ష ఖరారు అవుతుందని ఆమె వివరించారు. ఫోన్లో అసభ్య సందేశాలు పంపితే రెండేళ్లు, మళ్లీ పాల్పడితే నాలుగేళ్లు శిక్షపడేలా 354(ఈ) చట్టాన్ని తెచ్చామని సుచరిత తెలిపారు. మైనర్లపై హత్యాచార దాడులు చేస్తే 14ఏళ్లు, మరణశిక్ష కూడా పడుతుందని ఆమె పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన ‘దిశ చట్టం’ అమలుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపించడం విశేషం అన్నారు. మహిళల పట్ల సోదరిభావంతో మెలగాలని.. లేకుంటే జీవితం నాశనం అవుతుందని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళలు రక్షణకోసం ఉన్న 100, 112, 182 నెంబర్లు ప్రతి మహిళ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సీఎం జగన్ నిండు నూరేళ్లు వర్థిల్లాలి అని కోరుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్నమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక్క రాష్ట్రంలో జరిగిన దారుణం మరోసారి జరగకూడదని సీఎం జగన్ భావించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘దిశ చట్టం’ తెచ్చారని సీఎం జగన్‌ను కొనియాడారు. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూసిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చెప్పించారని పేర్కొన్నారు. వారందరికీ ఇప్పుడు సీఎం జగన్.. ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిపించేందుకు 75శాతం స్థానికత చట్టం తీసుకువచ్చారని ఆయన తెలిపారు. కాని చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే పధకాలు ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పారు. జగన్ వంటి నాయకుని నాయకత్వంలో పని చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ‘దిశ చట్టం’ వివరిస్తూ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసేలా ఉన్నాయని వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు. ‘అబ్బాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడవద్దు.. జీవితాలను నాశనం చేసుకోవద్దు ’ అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దిశ చట్టాన్ని దేశం మొత్తం స్వాగతించిందని అన్నారు. అందరూ చట్టం అమలుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ చంద్రబాబుకు మాత్రం ‘దిశ చట్టం’ ఉద్దేశం అర్ధం కాలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో దిశపై చర్చ పెడితే.. ఉల్లి కోసం లొల్లి చేశారని మండిపడ్డారు. చట్టాలు రావడం కాదు.. వాటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. మహిళలు కూడా టోల్ ఫ్రీ నెంబర్లను దగ్గరే ఉంచుకోవాలని మల్లాది విష్ణు చెప్పారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ ‘దిశ యాక్ట్’ తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడపిల్లల రక్షణ కోసం ధైర్యం ఉన్న నాయకునిగా సీఎం జగన్ నిరూపించారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో మహిళా తహశీల్దారుపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. కాల్ మనీ వ్యాపారం ద్వారా మహిళలను ఇబ్బందులు పెట్టారని దేవినేని అవినాష్ టీడీపీని దుయ్యబట్టారు. ఆడపిల్లలకు అండగా, అన్నగా సీఎం జగన్ దిశ చట్టాన్ని తెచ్చారని అవినాష్ గుర్తు చేశారు. దిశ చట్టం మహిళలల్లో భరోసా నింపి.. దశ మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. భరత్‌రెడ్డి మాట్లాడూ.. జగనన్న జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు ఎయిర్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరు దేశాల ప్రతినిధులు ఈ ఎయిర్ షో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో వైస్సార్ కుటుంబాన్ని విశ్వసించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమపాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అని భరత్‌రెడ్డి పేర్కొన్నారు. తండ్రిని మించిన పాలన అందివాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని భరత్‌రెడ్డి పేర్కొన్నారు. -
నాకూ పైలట్ అవ్వాలనుంది
భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూడు రోజులుగా విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న వైమానిక విన్యాసాలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... వైమానిక విన్యాసాలను చూస్తుంటే తనకూ పైలట్ అవ్వాలనుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పర్యాటక రంగానికి అమరావతి కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. బోటు రేసులకు, ఎయిర్ షోలకు అమరావతి ప్రాంతం అనుకూలంగా ఉన్నట్లు ఆయా సంస్థల నిర్వాహకులు చెప్పారని తెలిపారు. ఈ ఒక్క నెలలోనే మూడు పెద్ద ఈవెంట్లు నిర్వహించామని, భవిష్యత్తులో ప్రతిరోజూ ఏదో ఒక ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహిస్తామన్నారు. పర్యాటక రంగంలో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన కూచిపూడి నాట్యానికి ప్రాముఖ్యం కల్పిస్తున్నామని చెప్పారు. -
అలరించిన ఎయిర్ షో...
-
ఎయిర్ షో ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: నగరంలోని పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ఎయిర్ షో ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిర్ షో విన్యాసాలను తిలకించిన ఆయన అవి తనను అబ్బురపరిచాయని అన్నారు. అదేవిధంగా అమరావతిలో ప్రతిరోజూ ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. అందమైన టూరిస్ట్ ప్రదేశాలు, నదులు, రిజర్వాయర్లు, వెయ్యి కిలొమీటర్ల సముద్ర తీరం ఉండటం ఏపీకి వరమన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విమాన విన్యాసాలు చూసిన తర్వాత తను కూడా పైలెట్‌గా మారి విన్యాసాలు చేయాలనిపిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రపంచంలోనే ఐదు సుందరమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. -
బెంగళూరులోనే ఏరో షో
సాక్షి బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా షో బెంగళూరులోనే జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ షో వేదికను మార్చొద్దని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి 24వరకు బెంగళూరులో ఏరో షో జరగనుంది. ఈ షోను లక్నోలో నిర్వహించాలంటూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపై వివాదమవడం తెల్సిందే. గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచీ అందిన ఇలాంటి విజ్ఞాపనలను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. వైమానిక ప్రదర్శనను బెంగళూరులోనే నిర్వహించాలని కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఇదే వాదన వినిపించారు.ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1996 నుంచి రెండేళ్లకోసారి బెంగళూరులో జరుగుతున్న ఈ విమానాల పండుగలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ వైమానిక సంస్థలు పాల్గొంటాయి. -
నిట్ట నిలువునా సముద్రంలోకి..!
-
నిట్ట నిలువునా సముద్రంలోకి..!
రోమ్ : ఇటలీ సైన్యం జరుపుతున్న విన్యాసాల్లో అపశృతి దొర్లింది. మూడు రోజులగా పాటు ఇటలీ సైన్యం టెర్రాన్సియా సముద్ర తీరం వెంబడి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భాగంగా జెట్ ఫ్లయిట్‌ను నడుపుతున్న పైలెట్లు.. నిటారుగా నింగిని ఎగిరి... అంతే వేగంగా సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి.. వెంటనే పైకి లేవాలి. ఈ విన్యాసాన్ని చేస్తున్న సమయంలో.. జెట్ ఫ్లయిట్ అదుపు తప్పి నేరుగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడిక్కడే మృతిచెందారు. -
హకీంపేటలో ఎయిర్‌ఫోర్స్ షో
-
వినువిందు
భవానీపురం, ఎయిర్ షో, ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు Bhavanipuram, Air Show, Aircraft aeroplanes విజయవాడ (భవానీపురం) : పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మూడు రోజులపాటు చేపట్టిన ఎయిర్ షో రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. వినీలాకాశంలో విహంగాలు చేసిన విన్యాసాలను పున్నమి, భవానీఘాట్‌ల నుంచి సందర్శకులు రెప్పవేయకుండా తిలకించారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు ఇంద్రకీలాద్రి కొండ పై నుంచి చక్కర్లు కొడుతుంటే ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఒక్కో సమయంలో నాలుగు విమానాలు ఒకదానికొకటి ఢీ కొంటాయేమో అన్నట్టుగా పైలెట్లు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు ఆర్టీసీ ఎండీ పూనం మాలకొండయ్య కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ షో శనివారం కూడా కొనసాగుతుంది. -
బెజవాడ ఎయిర్ షో అదుర్స్
-
12 నుంచి విజయవాడలో ఎయిర్ షో
విజయవాడ : విజయవాడ ప్రజలకు తొలిసారిగా ఎయిర్ షో కనువిందు చేయనుంది. జనవరి 12 నుంచి మూడు రోజులపాటు జరిగే ఎయిర్ షో ఏర్పాట్లకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షసమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 12న గేట్‌వే హోటల్లో నిర్వహించే సమ్మిట్‌కు 500 మందికి పైగా డెలిగేట్లు హాజరవుతారని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారని, సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారని కలెక్టర్ చెప్పారు. -
చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!
-
అద్భుతంగా ఇజ్రాయెల్ ఎయిర్ షో
-
నేను సైతం..!
నేనేం తక్కువా? అన్నట్లు ఉంది కదూ ఈ సీగుల్ పక్షి ఫోజు. ఎసెక్స్కు చెందిన డేవిక్ బ్లాక్ తన కుటుంబంతో కలిసి ఎయిర్ షోకు వెళ్లాడు. అక్కడ విన్యాసాలు చేస్తున్న విమానాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా ఫ్రేమ్‌లోకి వచ్చేసిందీ సీగుల్ పక్షి. వెంటనే క్లిక్‌మనిపించాడు బ్లాక్. విన్యాసాల్లో సీగుల్ పక్షి విమానాలతో పోటీపడుతున్నట్లుగా చక్కటి ఫొటో కెమెరాకు చిక్కింది. -
ఎయిర్ షోలో కుప్పకూలిన విమానం
వైమానిక ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం.. ఒక్కసారిగా నేలకూలింది. ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని ఇళ్లపై పడిపోయింది. పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. ఇంగ్లాండ్‌లోని బ్రిడ్జ్‌టన్ ఎయిర్‌పోర్టులో శనివారం స్థానిక కాలమానం ప్రకారం మద్యాహ్నం 1:30కు ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ప్రాణ, ఆస్తినష్టం వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఇంగ్లాండ్ తూర్పు తీరంలోని బ్రిడ్జ్‌టన్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న ఎయిర్ షోలో.. ఏ 27 అనే సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ విన్యాసాలు ప్రదర్శించింది. చివరి లూప్‌ను పూర్తి చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి నేలకూలిందని, ఎయిర్‌పోర్టుకు సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో అది కూలిపోయిందని, ఆ స్థలానికి సమీపంలో ఇళ్లు కూడా ఉన్నాయని సహాయక బృందం ప్రతినిధులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎయిర్ షో ఇక్కడే
మరో ప్రాంతానికి మార్చం కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ బెంగళూరు : ఎయిర్ షోను బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి మార్చే యోచన ఏదీ లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఎరో ఇండియా-17 కూడా బెంగళూరులోనే జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఎరో ఇండియా-17 ప్రదర్శనను యలహంకలోని వైమానిక స్థావరంలో బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రదర్శనను గోవాకు మార్చాలని తొలుత భావించినట్లు చెప్పారు. అయితే ఇక్కడకు వచ్చి పరిశీలించిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రదర్శనకు వచ్చిన విమానాలు, కంపెనీల కంటే రెట్టింపు సంఖ్యలో లోహవిహంగాలు, సంస్థలు తమ స్టాల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సరిపడ స్థలం ఉండడమే ఇందుకు కారణమని అన్నారు. అత్యాధునిక (ఫోర్త్ జనరేషన్) రఫెల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రక్రియకు సంబంధించి వచ్చేనెలలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రక్షణ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలో కూడా హెలికాప్టర్ల ఆవస్యకత ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు గాను వెయ్యి హెలికాప్టర్లు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రక్షణ రంగ వస్తువుల తయారీలో ప్రైవేటు కంపెనీలు కూడా పాలుపంచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ భారత దేశానికి అత్యాధునిక హెలికాప్టర్లను అందిస్తోందని ప్రసంశించారు. ఈ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. -
'ఏరో ఇండియా-2015' వైమానిక ప్రదర్శన
-
బెంగళూరులో ఎయిర్ ఇండియా షో ప్రారంభం
-
'మేక్ ఇన్ ఇండియా'లో రక్షణ రంగం కీలకం
-
'మేక్ ఇన్ ఇండియా'లో రక్షణ రంగం కీలకం
బెంగళూరు : 'ఏరో ఇండియా-2015' వైమానిక ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఏరో ఇండియా ప్రదర్శన రక్షణ రంగ తయారీ విధానానికి వేదికగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తికి అవకాశం ఉందని మోదీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రక్షణ రంగం కీలకమని ఆయన అభివర్ణించారు. భద్రతా బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, రక్షణ రంగంలో కొనుగోళ్ల విధానంలో సంస్కరణలు అవసరమన్నారు. అంతర్గత భద్రతా సవాళ్లను అధిగమించాలని మోదీ పేర్కొన్నారు. కాగా 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో బెంగళూరులోని యహలంక ప్రాంతంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో నేటి నుంచి అయిదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన రక్షణ శాఖల మంత్రులు, వైమానిక దళాల అధికారులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో 29 దేశాలకు చెందిన 570 ఏవియేషన్ రంగ సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో 296 దేశీయ సంస్థలు కాగా, 274 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. -
గగన విహాంగం
-
ఏయిర్షో 2014 అదుర్స్