
భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూడు రోజులుగా విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న వైమానిక విన్యాసాలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... వైమానిక విన్యాసాలను చూస్తుంటే తనకూ పైలట్ అవ్వాలనుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పర్యాటక రంగానికి అమరావతి కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. బోటు రేసులకు, ఎయిర్ షోలకు అమరావతి ప్రాంతం అనుకూలంగా ఉన్నట్లు ఆయా సంస్థల నిర్వాహకులు చెప్పారని తెలిపారు. ఈ ఒక్క నెలలోనే మూడు పెద్ద ఈవెంట్లు నిర్వహించామని, భవిష్యత్తులో ప్రతిరోజూ ఏదో ఒక ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహిస్తామన్నారు. పర్యాటక రంగంలో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన కూచిపూడి నాట్యానికి ప్రాముఖ్యం కల్పిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment