చెన్నై: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. పలువురి మృతి | Stampede In Chennai Marina Beach At IAF Air Show, Five Died And Hundreds Hospitalised, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Marina Beach Stampede: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. పలువురి మృతి

Published Sun, Oct 6 2024 7:59 PM | Last Updated on Mon, Oct 7 2024 10:08 AM

stampede in chennai marina beach air show several deceased

చెన్నై: తమిళనాడు చెన్నై ఎయిర్‌ షోలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మెరీనా బీచ్‌లో ఎయిర్‌ షో అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎయిర్‌ షో ముగిసిన తర్వాత  జనాలు  తిరిగి వెళ్తున్న సమయంలో  రైల్వే స్టేషన్‌లోనూ​ తొక్కిసలాట జరిగింది. 

డీహైడ్రేషన్ కారణంగా  సొమ్మసిల్లి  290 మంది పడిపోవటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిన 80 మందిని ఆసుపత్రి తరలించారు. 

 

ఎయిర్‌ షో చూసేందుకు లక్షాలాది మంది జనాలు తరలివచ్చారు. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. జనం భారీగా రావటంతో పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. 

 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాయంత్రం 4.30  గంటల వరకు దాదాపు మూడు లక్షలమందిపైగా లోకల్ ట్రైన్లలో ప్రయాణించనట్లు  రైల్వే శాఖ ప్రకటించింది.  రైల్వే, మెట్రో స్టేషన్లు  జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా బీచ్‌కు  సుమారు 15 లక్షలకుపైగా ప్రజలు వచ్చినట్లు అంచనా. 

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మెరీనా బీచ్ ఎయిర్ షో నమోదుకు విస్తృత ప్రచారం. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement