చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.
ఎయిర్‌షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
షో కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్‌లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్‌షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్‌షో
Comments
Please login to add a commentAdd a comment