ఫెంగల్‌ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం | Schools Colleges Are Closed Due To Fengal Cyclone In Tamilnadu | Sakshi
Sakshi News home page

వీడియో: ఫెంగల్‌ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం

Published Wed, Nov 27 2024 7:47 PM | Last Updated on Wed, Nov 27 2024 8:13 PM

Schools Colleges Are Closed Due To Fengal Cyclone In Tamilnadu

చెన్నై: తమిళనాడులో ఫెంగల్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్‌ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్‌ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.  

అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది.  

 

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement