లిస్బన్: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.
వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి.
ఇక, పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3
— The Spot (@Spotnewsth) June 2, 2024
Comments
Please login to add a commentAdd a comment