pilot dead
-
Turkish Airlines: విమానం నడుపుతూ పైలట్ మృతి
న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్‌లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది. కెప్టెన్‌గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్‌ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. -
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం: ట్రైనీ పైలట్ దుర్మరణం
కీసర: కీసర ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డుప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్మెట్లో నివాసం ఉంటున్న సిద్దిపేట జిల్లాకు చెందిన గంగుమల శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు శ్రీకరణ్రెడ్డి(25) బ్యాంకాక్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు. వారంరోజుల క్రితం సిటీకి వచి్చన శ్రీకరణ్రెడ్డి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు యాదగిరిగుట్టకు వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి కారులో బయలుదేరాడు. నేరేడ్మెట్ ఈసీఐఎల్ నుండి కారులో వచ్చి కీసర వద్ద అవుటర్ రింగురోడ్డు ఎక్కాడు. రింగురోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. దీంతో కారుముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకరణ్రెడ్డిని చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతను మృతిచెందాడు. కాగా ప్రమాదానికి గురైన కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అతను వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు. రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఎలాంటి వాహనం కని్పంచలేదని చెప్పారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
లిస్బన్: పోర్చుగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక, పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3— The Spot (@Spotnewsth) June 2, 2024 -
విషాదం: కుప్పకూలిన హెలికాప్టర్
శ్రీనగర్: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన దుర్ఘటన విషాదాన్ని నింపింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్‌పూర్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక పైలట్ మృతిచెందగా, గాయపడిన మరో పైలట్‌ను మిలటరీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: చైనాతో మళ్లీ ఘర్షణ; ఇరు దేశాల జవాన్ల బాహాబాహీ -
ఆగని కార్చిచ్చు.. పైలట్ మృతి
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో చేలరేగిన కార్చిచ్చు చల్లారడం లేదు. మంటలను ఆర్పడానికి పోరాడుతున్న ఒక హెలికాప్టర్ కూలడంతో పైలట్ చనిపోయాడు. గడిచిన 72 గంటల్లో కాలిఫోర్నియా దాదాపు 11,000 మెరుపు దాడులకు గురయ్యింది. ఫలితంగా 367 మంటలు చెలరేగాయి. ఉత్తర కాలిఫోర్నియా వైన్ ప్రాంతంలో 50 కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నివసిస్తున్న వేలాది మంది తమ ఇళ్ల నుంచి పారిపోయారు. సెంట్రల్ కాలిఫోర్నియాలో, శాన్ఫ్రాన్సిస్కోకు దక్షిణాన 160 మైళ్ళు (258 కి.మీ) దూరంలో ఫ్రెస్నో కౌంటీలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఒక హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో అందులో ఉన్న పైలట్ మృతి చెందాడని కాలిఫోర్నియా అటవీ,అగ్నిమాపక రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శాన్ఫ్రాన్సిస్సోకు ఉత్తరాన, వాకావిల్లే నగరానికి సమీపంలో 46,000 ఎకరాల (18,615 హెక్టార్ల) విస్తీర్ణంలో కొండలు, పర్వత ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. ఫలితంగా 50 గృహాలు, ఇతర నిర్మాణాలు కాలి బూడిద అయ్యాయి. సాక్రమెంటోకు నైరుతి దిశలో 30 మైళ్ళ దూరంలో 100,000 మంది నివసిస్తున్న నగరంలో పాక్షిక తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్ఎన్యు లైట్ కాంప్లెక్స్ ఫైర్‌గా పిలవబడే అగ్ని కీలలు పడమటి వైపున ఉన్న గృహాలను తగలబెట్టాయి. జనాలు తమ పశుసంపదను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. చనిపోయిన పశువులు, ఆస్తులకు సంబంధించిన ఫోటోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడు ఇంత తీవ్రమైన మంటలను చూడలేదు. ఎన్నడు లేని వినాశకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాము’ అని తెలిపారు. (వైరల్ వీడియో: మంటలార్పడానికి వెళ్తే..) 2017 లో ఉత్తర కాలిఫోర్నియా అంతటా మంటలు సంభవించాయి. ఫలితంగా 44 మంది చనిపోయారు. అనేక వైన్ తయారీ కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 9,000 గృహాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. పాలో ఆల్టోకు తూర్పున 20 మైళ్ళ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఎస్సీయూ ఫైర్ కాంప్లెక్స్‌గా పిలువబడే మంటలు రాత్రికి రాత్రే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం 85,000 ఎకరాలకు పైగా మంటలు విస్తరించాయి. ఆగస్టు సీజడ్యూ ఫైర్ కాంప్లెక్స్ వల్ల చేలరేగిన మంటలు సుమారు 10,000 ఎకరాలకు పైగా వ్యాపించాయి. అలానే పశ్చిమాన, కరువుతో బాధపడుతున్న కొలరాడో బుధవారం చరిత్రలో రెండవ అతిపెద్ద అడవి మంటను ఎదుర్కొంది. పైన్ గుల్చ్ బ్లేజ్ 125,100 ఎకరాలలో కాలిపోవడమే కాక ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ మంటల విస్తీర్ణం వ్యాప్తి డెన్వర్ నగరం కంటే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. -
కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి
కాంగో : ఆఫ్రికా దేశమైన కాంగోలో శుక్రవారం అర్థరాత్రి కార్గో విమానం అడవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మృతిచెందారు. ఏజ్‌ఫ్రెకో అనే కంపెనీకి చెందిన చిన్న కార్గో మనీమా ప్రావిన్స్‌లోని కలిమా నుంచి దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని బుకావు వెళ్తున్నది. మరికొద్ది సేపట్లో లాండింగ్ అవుతుందనగా దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఇద్దరు పైలట్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో అందరూ మరణించారని ప్రావిన్స్ రవాణ, సమాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బాసిలా తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అమెరికా మిషన్ బృందం దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు. కాంగోలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా యూరోపియన్ యూనియన్ కాంగో విమాన సర్వీసులపై నిషేధం విధించింది. -
కూలిన ట్రైనీ విమానం; ఇద్దరి పైలట్ల మృతి
-
కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బేగంపేట విమానాశ్రయానికి చెందిన ఓ శిక్షణా విమానం బంట్వారం మండలం సుల్తాన్ పూర్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తుంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ట్రైనీ పైలట్ ప్రకాష్ విశాల్‌తో పాటు ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బిల్డింగ్‌పై కుప్పకూలిన హెలికాప్టర్ : వణికిన జనం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. మాన్హాటన్లోని 51 అంతస్థుల భవనంపై బిల్డింగ్‌పై చాపర్ ఒక్కసారిగా కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 2001, సెప్టెంబర్ 11 తరహా దాడులా అన్న భయాందోళనలతో అందరు వణికిపోయారు. ఈ ప్రమాదంలో పైలట్ టిమ్ మెక్ కార్మాక్ దుర్మరణం చెందాడు. దీంతో మొత్తం భవనం కంపించిపోయిందని భవనంలో నివాసం ఉంటున్నవారు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే హెలికాప్టరు మంటల్లో కాలి బూడిదగా మారింది. హెలికాప్టర్లో పైలట్ ఒక్కరే ప్రయాణిస్తున్నట్టు సమాచారం. NEW: this piece of doomed #chopper landed on Seventh Avenue, more than 50 feet below. #ABC7NY pic.twitter.com/F3rd0d2LsC — Josh Einiger (@JoshEiniger7) June 10, 2019 I have been briefed on the helicopter crash in New York City. Phenomenal job by our GREAT First Responders who are currently on the scene. THANK YOU for all you do 24/7/365! The Trump Administration stands ready should you need anything at all. — Donald J. Trump (@realDonaldTrump) June 10, 2019 -
కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్: ఫైలట్ మృతి
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్, ఎయిర్ కమాండర్ దుర్మరణం చెందారు. ముంద్రా వద్ద పొలాల్లో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. #Gujarat: An aircraft has crashed in Kutch's Mundra, pilot missing. More details awaited. pic.twitter.com/2Q1SPxvMF0 — ANI (@ANI) June 5, 2018 -
హైజాక్ విమానాన్ని నడిపిన పైలెట్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1971లో ఇద్దరు కశ్మీర్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన పైలెట్ కెప్టెన్ ఎం కె కజ్రు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1971 జనవరి 30న 26 మంది ప్యాసింజర్స్‌తో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ గంగను ఇద్దరు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వేర్పాటువాదులు హైజాక్ చేశారు. విమానాన్ని పాకిస్తాన్ లోని లాహోర్‌కు తరలించాల్సిందిగా కెప్టెన్ కజ్రును ఆదేశించారు. ఆయన విమానాన్ని లాహోర్‌కు తీసుకెళ్లారు. తర్వాత భారత ప్రభుత్వం హైజాకర్ల చెర నుంచి భారతీయులను సురక్షితంగా తప్పించి రోడ్డుమార్గం ద్వారా ఇండియాకు రప్పించిన విషయం తెలిసిందే. -
కాశ్మీర్ లో కూలిన మిగ్-21, పైలట్ దుర్మరణం
భారత వైమానిక దళంలో మృత్యు విహంగంగా పేరొందిన మిగ్-21 మరో పైలట్ ప్రాణాలను బలిగొంది. జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. దాంత పైలట్ అక్కడికక్కడే మరణించాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా వెళ్లిన ఈ విమానం పొలాల్లో కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. విమాన పైలట్ రఘు వంశీ ఈ ప్రమాదంలో మరణించారు. మంగళవారం ఉదయం టెక్నికల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఉదయమే ఈ మిగ్-21 విమానం టేకాఫ్ తీసుకుంది. అది ఎందుకు కూలిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.