అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. మాన్‌హాటన్‌లోని 51 అంతస్థుల భవనంపై బిల్డింగ్‌పై చాపర్ ఒక్కసారిగా కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 2001, సెప్టెంబర్ 11 తరహా దాడులా అన్న భయాందోళనలతో అందరు వణికిపోయారు. ఈ ప్రమాదంలో పైలట్ టిమ్ మెక్ కార్‌మాక్ దుర్మరణం చెందాడు.
దీంతో మొత్తం భవనం కంపించిపోయిందని భవనంలో నివాసం ఉంటున్నవారు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు తేల‍్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే హెలికాప్టరు మంటల్లో కాలి బూడిదగా మారింది. హెలికాప్టర్‌లో పైలట్ ఒక్కరే ప్రయాణిస్తున్నట్టు సమాచారం.
NEW: this piece of doomed #chopper landed on Seventh Avenue, more than 50 feet below. #ABC7NY pic.twitter.com/F3rd0d2LsC
— Josh Einiger (@JoshEiniger7) June 10, 2019
I have been briefed on the helicopter crash in New York City. Phenomenal job by our GREAT First Responders who are currently on the scene. THANK YOU for all you do 24/7/365! The Trump Administration stands ready should you need anything at all.
— Donald J. Trump (@realDonaldTrump) June 10, 2019
Comments
Please login to add a commentAdd a comment