
బ్రిస్బేన్: ప్రపంచ ప్రఖ్యాత పగడపు దీవులు(గ్రేట్ బారియర్ రీఫ్)లను సందర్శించేందుకు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమెరికాకు చెందిన వృద్ధులు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. హెలికాప్టర్ పైలెట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఇద్దరు మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయలైయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్ట్రేలియా మెయిన్‌ల్యాండ్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం పర్యటక ప్రాంతమైన గ్రేట్ బారియర్ రీఫ్‌ను సందర్శించేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తుల్లో 65 సంవత్సరాల మహిళ, 79 ఏళ్ల పురుషుడు మృతి చెందారు. వైట్స్ండే ఎయిర్ సర్వీస్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ప్రమాదనికి గురైనట్టు తెలిపారు. హెలికాప్టర్ కూలిన తర్వాత ప్రయాణికులను కాపాడేందుకు పైలెట్ ప్రయత్నించిన వారి ప్రాణాలను కాపాడలేక పోయారని తెలిపారు. ఈ ఘరణపై సదరు ఎయిర్ సర్వీస్ సంస్థ స్పందిస్తూ.. ఇలాంటి దుర్ఘటన జరగడం బాధకరమని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment