Great Barrier Reef
-
నీటి అడుగుభాగంలో టి20 ప్రపంచకప్.. ఏం జరిగింది?
టి20 ప్రపంచకప్ 2022 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్ దేశాలను చుట్టి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన పొట్టి ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా.. స్పోర్ట్స్ ప్రెజంటర్ ఎరిన్ హోలాండ్, ఆస్ట్రేలియన్ పారాలింపిక్స్ స్విమ్మర్ గ్రాంట్ పాటర్సన్లు ఒక స్పెషల్ ప్లేసుకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియాకు తలమానికంగా నిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ సిస్టమ్‌గా పిలచే గ్రేట్ బారియర్ రీఫ్‌కు టి20 ప్రపంచకప్‌ను పట్టుకెళ్లారు. గాలి కూడా దూరని ఒక గ్లాసులో టి20 ప్రపంచకప్‌ను ఉంచి గ్రేట్ బారియర్ రీఫ్ నీటి అడుగుభాగంలోకి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు ఎరిన్ హోలాండ్ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్ టూర్లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో ఎనిమిది రాష్ట్రాల్లో 21 నగరాలతో పాటు యూనియన్ టెర్రటరీస్లో సందర్శనకు రానుంది. ఆస్ట్రేలియాతో పాటు దాదాపు 12 దేశాల్లో టి20 ప్రపంచకప్ చుట్టి రానుంది. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌కు ఇదే తొలి టి20 ప్రపంచకప్ టైటిల్ కాగా.. న్యూజిలాండ్ మరోసారి రన్నరప్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. గ్రూఫ్ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌తో పాటు మరో రెండు క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్ 2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు ఉండనున్నాయి. Took the @T20WorldCup trophy for swim with a couple of legends on the #GreatBarrierReef yesterday! The #T20WorldCup is just around the corner.. who’ve you got to take this beauty home..?🏆🏏🇦🇺 @CricketAus #cricket #worldcup #notabaddayintheoffice #adamzampa #grantscooterpatterson pic.twitter.com/gyk2m7frzF — Erin Holland (@erinvholland) July 19, 2022 Taking the plunge 🤿 With help from a few familiar faces, the ICC Men's #T20WorldCup Trophy undertook an underwater adventure at the Great Barrier Reef. pic.twitter.com/yLxazYZi30 — T20 World Cup (@T20WorldCup) July 19, 2022 చదవండి: Fans Troll Kasun Rajitha: ఎంత పని చేశావ్.. లంక జట్టులో మరో 'హసన్ అలీ' -
కూలిన హెలికాప్టర్.. ఇద్దరి మృతి
బ్రిస్బేన్: ప్రపంచ ప్రఖ్యాత పగడపు దీవులు(గ్రేట్ బారియర్ రీఫ్)లను సందర్శించేందుకు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమెరికాకు చెందిన వృద్ధులు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. హెలికాప్టర్ పైలెట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఇద్దరు మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయలైయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్ట్రేలియా మెయిన్‌ల్యాండ్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం పర్యటక ప్రాంతమైన గ్రేట్ బారియర్ రీఫ్‌ను సందర్శించేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తుల్లో 65 సంవత్సరాల మహిళ, 79 ఏళ్ల పురుషుడు మృతి చెందారు. వైట్స్ండే ఎయిర్ సర్వీస్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ప్రమాదనికి గురైనట్టు తెలిపారు. హెలికాప్టర్ కూలిన తర్వాత ప్రయాణికులను కాపాడేందుకు పైలెట్ ప్రయత్నించిన వారి ప్రాణాలను కాపాడలేక పోయారని తెలిపారు. ఈ ఘరణపై సదరు ఎయిర్ సర్వీస్ సంస్థ స్పందిస్తూ.. ఇలాంటి దుర్ఘటన జరగడం బాధకరమని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. -
షార్‌కల నోట... పగడాల వేట!
గ్రేట్ బారియర్ రీఫ్ పగడపు దీవులుంటాయని ఎక్కడో చందమామ, బాలమిత్ర కథల్లో చదివారా? మరి ఆ కథలు కళ్లెదురుగా నిలబడితే!! ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు వెళితే జరిగేది అదే. 2,600 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పగడపు దిబ్బల్లో... ఈత కొట్టడమే కాదు. స్నోర్కెలింగ్, సెయిలింగ్, స్కూబా డైవింగ్ వంటి రకరకాల సాహసాలు చేయొచ్చు. కాదనుకుంటే క్రూయిజ్ బోట్లోనో, స్పీడ్బోట్లోనో వెళుతూ అవన్నీ చూడొచ్చు. సీ ప్లేన్‌లో వెళుతూ కిందనున్న పగడపు దిబ్బల్ని క్లిక్ చేయొచ్చు. ఇక డే డ్రీమ్ ఐలాండ్‌లో... ప్రమాద కరమైన స్టింగ్ రేకు అతి సమీపంలోకి వెళ్లొచ్చు. గుడ్డులోంచి బయటకు వచ్చే తాబేళ్లనూ చూడొచ్చు. ఇవన్నీ కేవలం గ్రేట్ బారియర్ రీఫ్లోనే సాధ్యం. ఆస్ట్రేలియాకు ఈశాన్యంగా ఉండే క్వీన్స్లాండ్ తీరం పొడవునా విస్తరించిన గ్రేట్ బారియర్ రీఫ్‌ను... భువిపై అతిపెద్ద జీవమున్న వస్తువుగా చెబుతారు. దాదాపు 600 రకాల పగడాలతో తయారైన వందల కొద్దీ దీవులు, వేల పగడపు దిబ్బలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయట. ఇక రకరకాల చేపలతో పాటు డాల్ఫిన్లు, షార్క్‌లకు కూడా కొదవుండదు. క్వీన్స్‌లాండ్‌ను చేరుకునేదెలా? * విమానంలో వెళ్లాలనుకుంటే క్వీన్స్‌లాండ్‌లోని హామిల్టన్ ఐలాండ్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. * హామిల్టన్‌కు... రాజధాని మెల్బోర్న్తో పాటు సిడ్నీ, పెర్త్ వంటి నగరాల నుంచి విమానాలున్నాయి. * ఇండియా నుంచి వెళ్లేవారు తొలుత ఢిల్లీ, ముంబైల నుంచి సిడ్నీ చేరుకుని, అక్కడి నుంచి హామిల్టన్ వెళ్లటమే ఉత్తమం. * ఇండియా నుంచి సిడ్నీకి, అక్కడి నుంచి హామిల్టన్‌కు... తిరుగు ప్రయాణ ఛార్జీలు ముందుగా బుక్ చేసుకుంటే రూ.55వేల నుంచి 80 వేల మధ్య ఉంటాయి. * చౌక విమాన సర్వీసులు నడిపే ఎయిర్ ఏసియా వంటివి కూడా సిడ్నీకి విమానాలు నడుపుతున్నాయి. దీంతో ఒకరికి రూ.50 వేలల్లో కూడా ఒకోసారి టిక్కెట్ దొరుకుతుంది. * సిడ్నీ నుంచి గ్రేట్ బారియర్ రీఫ్ టూరిజానికి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయి. * లోకల్ ప్యాకేజీలు ఒక మనిషికి రెండు రోజులకు రూ.8వేల నుంచి మొదలవుతాయి. చేసే యాక్టివిటీస్‌ను బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. * సిడ్నీ నుంచి విమానం, హోటల్ కలిపి ప్యాకేజీలుంటాయి. ఇవి మనిషికి ఒకరికి రూ.20వేల నుంచి (3 రోజులకు) మొదలవుతాయి. ఏ సీజన్ అనుకూలం? ఏప్రిల్ - మే: చక్కని సీజన్. కాస్త డిస్కవుంట్లు దొరుకుతాయి. వర్షాలుండవు. నీళ్లు క్లియర్‌గా ఉంటాయి. డైవింగ్‌కు పరిస్థితులు బాగుంటాయి. జూన్ - అక్టోబర్ : డిమాండు, రద్దీ రెండూ ఎక్కువే. అమెరికాలో ఇది వేసవి. ఆస్ట్రేలియాలో చలికాలం. అమెరికన్లంతా ఇక్కడికొస్తుంటారు. రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. నవంబరు - మార్చి: యాత్రికులు తక్కువ. దీంతో డిస్కౌంట్లు బాగానే ఇస్తారు. విపరీతమైన వర్షాలు పడతాయి. నీళ్లు క్లియర్‌గా ఉండవు. జెల్లీ ఫిష్‌ల సంచారమూ ఎక్కువ. ప్రధాన బీచ్‌లలో స్విమింగ్ కష్టం. -
టూరిజానికి పారిస్ కన్నా అది మిన్న!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యుత్తమ టూరిజం స్పాట్ ఏదన్న అంశంపై యూఎస్ ట్రావెల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియాలోని క్విన్స్‌లాండ్ తీరంలో ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ ప్రధమ స్థానంలో నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ 2016-17 సంవత్సరానికి గాను వెల్లడించిన ఈ ఫలితాల్లో పారిస్, బోర బొరాలను వెనక్కినెట్టి మరీ గ్రేట్ బారియర్ రీఫ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ టూరిస్ట్‌లు ఒక్కసారైన చూడాల్సిన ప్రదేశం ఈ కొరల్ రీఫ్స్ అని న్యూస్ కార్ప్ మీడియా సంస్థ వెల్లడించింది. దీనిపై క్వీన్స్లాండ్ టూరిజం అండ్ ఈవెంట్స్ చీఫ్ లియానె మాట్లాడుతూ.. గ్రేట్ బారియర్ రీఫ్‌కు ఫస్ట్ ప్లేస్ దక్కడం ప్రపంచ టూరిజంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుందన్నారు. క్వీన్స్లాండ్ పర్యాటకులకు గ్రేట్ బారియర్ రీఫ్ ఒక 'లివింగ్ ట్రెజర్' అని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియన్ ఎకానమీకి ఈ రీఫ్ ద్వారా ఏటా 5.2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె తెలిపారు. ప్రతీఏటా దీనిని 1.9 మిలియన్ల పర్యాటకులు సందర్శిస్తున్నారని లియానె వెల్లడించారు.