
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని పర్యాటక పట్టణం కెయిన్స్‌లోని ఓ హోటల్‌పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం(ఆగస్టు12) తెల్లవారుజామున ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌లోని వందల మందిని అక్కడినుంచి తరలించినట్లు క్వీన్స్‌లాండ్ పోలీసులు తెలిపారు.
హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్‌లో ఉన్న వారెవరూ గాయపడలేదని చెప్పారు. హోటల్‌పై రెండు హెలికాప్టర్లు ల్యాండవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment