కొన్నిసార్లు స్టార్ హోటళ్లు, లగ్జరీ హోటళ్లు విలాసవంతంగా ఉంటాయని ఒక్కసారి అయినా స్టే చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆ హోటళ్లలో కొంతమంది కస్టమర్లకు ఎదరైన చేదు అనుభవాలు వింటే దెబ్బకు ఆ ఆలోచన కూడా చేయరు. అసలు వాటి వైపుకి వెళ్లే యత్నం కూడా చేయరు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలాంటి దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్లీ హోటల్‌లో స్టే చేయాలంటేనే భయపడింది.
వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాలోని పెర్త్‌కి చెందిన ఒక మహిళ నోవాటెల్ పెర్త్ లాంగ్లీ హోటల్‌లో బస చేసింది. ఆమెకి కింగ్స్ పార్క్‌లో మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంగీత కచేరి ఉంది. అందుకోసం ఆ మహిళ ఈ నోవాటెల్‌లో బస చేసింది. అయితే ఆ మహిళ తన ప్రదర్శనకు వెళ్లే ముందు గదిలో స్నానం చేసి డ్రైయర్‌ని ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకుంది. అయితే దుస్తులు మార్చకోక మునుపే ఆమె డోర్ వెలుపలే అగ్నిమాపక సిబ్బంది కాచుకున్నారు. ఆ డ్రైయర్‌ని ఉపయోగించడంతో ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది.
ఈ తతంగం అంతా చూసి ఆ మహిళ షాకయ్యింది. అయితే సదరు మహిళ కాస్త తమాయించుకుని వాళ్లకి క్షమాపణ చెప్పడమే గాక వారిని కంగారు పెట్టించినందుకు డబ్బులు కూడా కట్టింది. అంతవరకు బాగానే ఉంది. సదరు హోటల్ కూడా ఆమె నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే ఆమెను షాక్‌కి గురి చేసింది. అయితే ఆమె హోటల్ నుంచి వెళ్లేటప్పుడూ ఇదంతా గమనించలేదు. ఆ తర్వాత తన బ్యాంక్ ఎకౌంట్ చెక్ చేయగా కేవలం డ్రైయర్ ఉపయోగించినందుకు ఏకంగా రూ. 78 వేలు బిల్లు వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది.
ఏంటీది అని కంగారు పడి వెంటనే సదరు హోటల్‌కి ఫోన్ చేయగా, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగేలా చేశారు అందుకని అంటూ ఏవేవో సమాధానాలు ఇచ్చారు హోటల్ సిబ్బంది. పైగా ఆమె ఫోన్‌కాల్స్‌ని రిసీవ్ చేయకుండా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఇక లాభం లేదనుకుని మేనేజర్‌కి ఇమెయిల్స్ అదేపనిగా పెట్టడంతో ఎట్టకేలకు సదరు హోటల్ మేనేజర్ ఆమె డబ్బులు వాపసు చేశాడు. ఇలాంటి వింత ఘటనే చైనాలో కూడా జరిగింది. ఓ మహిళ హోటల్‌లో రెండు రోజులు బస చేసేందుకు రూమ్‌ని బుక్ చేసుకుంది. అయితే జస్ట్ రెండు సార్లు స్నానం చేసిందని అదనంగా రూ. 28,850 వసూలు చేయడంతో విస్తుపోయింది సదరు మహిళ.
(చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే..మగవాళ్లు డ్రింక్ చేయకూడదట! అధ్యయనంలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment