నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే!
చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్‌లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.
ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్ అప్‌గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్‌లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment