beauty secret
-
జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్ డ్రైయర్ ఉండాల్సిందే
నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్‌లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్‌లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే! చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్‌తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్‌ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్‌తో.. ఈ డ్రైయర్ అప్‌గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు. -
హీరోయిన్ త్రిష అందం వెనకున్న సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ స్టార్ హీరోయన్‌గా తన ఛరిష్మాను కంటిన్యూ చేస్తోంది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ త్రిషకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.16 సంవత్సరాల వయస్సులో మిస్ మద్రాస్ టైటిల్ ను గెలుచుకున్న త్రిష తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. వర్షం సినిమాతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్‌ని ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయిన త్రిష మళ్లీ ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో యువరాణి కుందవై పాత్రలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చింది. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందంటూ త్రిష అందానికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇంత అందంగా కనిపించడానికి త్రిష ఏం చేస్తుంది అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే.. ''గ్రీన్ టీ.. లేదా గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో కాసిన్ని నిమ్మ చుక్కలతో నా ‘డే’ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవను. నా మెన్యూలో జంక్ ఫుడ్‌కి చోటు లేదు. కంటి నిండా నిద్ర కరువయ్యే చాన్స్ లేదు. మొత్తమ్మీద డిసిప్లిన్ లైఫ్ స్టయిలే నా బ్యూటీ సీక్రెట్''! అంటూ పేర్కొంది. -
ఏమున్నాడు రా బాబు.. మహేశ్ అందానికి సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్ కటౌట్ అంటూ మహేశ్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్‌మ్‌గా, ఛార్మింగ్ లుక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు మన సూపర్‌స్టార్. దీంతో ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్ యంగ్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్నెస్, డైట్ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ టైంలో మహేశ్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్ స్వయంగా తెలిపాడు. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్ మూన్ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. సుధీర్ఘ కాలం నుంచి మహేశ్ ఈ మూన్ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్‌గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇక ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్ బాబు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడట. ఇక మహేశ్ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి అనే డాక్టర్ గత కొన్నాళ్లుగా మహేశ్‌కు పర్సనల్ డెర్మలాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
వాటికి దూరంగా ఉంటాను.. అదే నా బ్యూటీ సీక్రెట్: సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ స్టైల్‌ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే ఇప్పటిదాకా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో కమలహాసన్ నిర్మించనున్న ఓ సినిమా మాత్రమే ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే సాయిపల్లవి మేకప్ లేకపోయినా ఎంతో అందంగా ఉంటుంది. దాని వెనుకున్న బ్యూటీ సీక్రెట్‌ను ఆమె బయటపెట్టింది. ''తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తీసుకుంటాను. కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి నేను దూరం. వారంలో కనీసం మూడు రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను. తగినన్ని మంచినీళ్లు తాగుతాను'' అంటూ తన అందం వెనకున్నరహస్యాన్ని బయటపెట్టింది. -
ఆ జ్యూస్ తాగుతాను.. అదే నా అందానికి రహస్యం
'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ చిత్రం బంపర్ హిట్ అయనా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. దీంతో ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దొరికింది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ కోలీవుడ్ కోడూ కూస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆమె ఏం చెప్పిందంటే..పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగుతాను. నా డైట్లో తాజా పండ్లు తప్పకుండా ఉంటాయి. అలాగే తగినన్ని మంచినీళ్లూ తాగుతుంటాను. ట్యాన్ ఫ్రీ స్కిన్ కోసం.. సమయం చిక్కినప్పుడల్లా టొమాటో గుజ్జును చేతులు, కాళ్ల మీద అప్లయ్ చేస్తాను. ఇక ఫేస్‌ప్యాక్ విషయానికి వస్తే పెరుగులో కొంచెం తేనె, కాసింత నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటాను. దీంతో ముఖం నున్నగా.. కాంతిమంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది. -
అందంగా కనిపించడానికి రకుల్ ఏం చేస్తుందో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.ఇక ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రకుల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది. రోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్ చేసుకుంటాను. ముఖం,మెడ మీది ట్యాన్ పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటోతో రుద్దుకుంటాను. పెరుగులో పసుపు, శనగపిండి కలిపి దాన్ని ప్యాక్‌లా వేసుకుంటాను. -రకుల్ ప్రీత్ సింగ్ -
కీర్తీ సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలనటిగా తెరంగేట్రం చేసి.. హీరోయిన్గా తెలుగు, తమిళం, మళయాళ భాషలలో తనదైన శైలిలో సత్తా చాటుతోంది కోలివుడ్ హీరోయిన కీర్తీ సురేష్ . ఆమె ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఇక ఆమె హీరోయిన్గా గ్లామర్‌ని మెయింటైన్ చేయాల్సిందే. ఐతే ఆమె అందుకోసం సహజసిద్ధమైన వాటినే వాడతానని, కెమకల్స్ జోలికిపోనని చెబుతుంది. ఈ సందర్భంగా తన బ్యూటీ క్రెట్ని గురించి చెబుతూ.. నారింజ తొక్కతో ఫేస్ మాస్క్ వేసుకుంటాను. అలాగే ఇలా నేచ్యురల్ ఫేస్ మాస్క్స్ వేసుకునేప్పుడు పసుపును మరవను. ఇది స్కిన్‌ను పాలిష్ చేస్తుంది. ఈ పసుపు చిట్కా మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. అలాగే నేనెప్పుడూ కెమికల్ స్క్రబ్స్ జోలికి వెళ్లను. గులాబీ–– బాదంపప్పు నుంచి ఓట్మీల్ స్క్రబ్ వరకు సహజసిద్ధమైన స్క్రబ్స్నే వాడతాను! – కీర్తి సురేశ్ (చదవండి: ష్యాషన్ సెన్స్ ఉట్టిపడేలా..వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?) -
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ
దివంగత నటి శ్రీదేవి (Sridevi) అందానికి అడ్రస్ లాంటివారు. అందుకే ఆమెను అతిలోక సుందరి అంటారు. ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమె అందానికి, అభినయానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె అందాన్ని వారసత్వంగా తీసుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ప్రస్తుతం బాలీవుడ్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ఒక బ్యూటీ సీక్రెట్‌ను పంచుకుంది. అది కూడా వాళ్ల అమ్మ (శ్రీదేవి) చెప్పిన రహస్యమట. తాను ఇంత అందంగా మిలమిల మెరిసిపోవడానికి కారణం ఆమె తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్ అని చెప్పుకొచ్చింది. 'మా అమ్మ.. బ్రేక్‌ఫాస్ట్‌లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మొహానికి మసాజ్ చేసుకుని ప్యాక్‌లా వేసుకునేది. ఓ పదిహేను నిమిషాలు ఆగి కడిగేసేది. అప్పుడు చూడాలి అమ్మ మొహం.. మిలమిల మెరిసిపోయేది. ఇప్పుడు నేనూ అదే ఫాలో అవుతున్నా. బ్రేక్‌ఫాస్ట్‌లో మిగిలిపోయిన పళ్ల ముక్కలే నా బ్యూటీ సీక్రెట్' అని జాన్వీ కపూర్ తెలిపింది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ 'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్ కాగా జాన్వీ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' మూవీ నేరుగా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించి హిట్ కొట్టిన తమిళ చిత్రం 'కోలమావు కోకిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. హిందీలో మాత్రం బాలీవుడ్ నేటివిటీకి తగినట్లు స్టోరీలో మార్పు చేశారని ఇటీవల జాన్వీ తెలిపింది. ఈ చిత్రానికి డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించారు. చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్ -
గ్లామర్ సీక్రెట్ చెప్పిన హన్సిక
బాల తారగా సినిమాల్లోకి వచ్చి కథానాయికగా స్థిరపడ్డ కొద్ది మంది నటీమణుల్లో హన్సిక ఒకరు. అనతికాలంలోనే అభిమానుల ఆరాధ్య దేవతగా మారింది. ఆ ఆరాధన కోసం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవీ... పిచిక డ్రెస్... ప్రముఖ డిజైనర్ ఊర్వశి సేథి స్థాపించిన సంస్థ ‘పిచిక’. చాలా తేలికగా.. సౌకర్యంగా ఉంటుంది వీరి ఫ్యాబ్రిక్. అదే దీని బ్రాండ్ వాల్యూ. ఈ దుస్తులు ఎక్కువగా లేత రంగుల్లో లభిస్తాయి. అంతేకాదు జైపూర్ హస్తకళాకారులతో వాటిపై పెయింటింగ్ వేయిస్తారు. ఈ యూనిక్‌నెస్ కోసమే ఆ బ్రాండ్ అంటే ఆసక్తి చూపిస్తుంటారు సెలబ్రిటీలు. ఇతర డిజైనర్ దుస్తులతో పోలిస్తే వీటి ధర కాస్త తక్కువే. పేరొందిన అన్ని ఆన్లైన్ స్టోర్స్‌లో పిచిక డిజైన్స్ లభిస్తాయి. సిల్వర్ క్రేవింగ్స్... వెండి ఆభరణాలకు పేరుపొందిన సంస్థ ఈ ‘సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ’. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో ప్రారంభమైందీ వెండి, బంగారు ఆభరణాల దుకాణం. సంప్రదాయ డిజైన్స్ దీని ప్రత్యేకత. ఈ ఆభరణాలకు మంచి గుర్తింపు రావడంతో గత ఏడాది ఇతర రాష్ట్రాల ప్రజల కోసమూ దీని అఫీషియల్ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇందులో ముక్కు పుడక నుంచి పెద్ద పెద్ద హారాల దాకా అన్ని రకాల జ్యూయెలరీ దొరుకుతుంది. వెండి, బంగారు నాణ్యతతోపాటు నగల డిజైన్స్‌ను బట్టి ధర ఉంటుంది. సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ కేవలం దానికి సంబంధించిన దుకాణం, వెబ్సైట్లలో మాత్రమే లభిస్తుంది. జ్యూయెలరీ.. బ్రాండ్: సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ (Silver Cravings jewellery) కమ్మల ధర: రూ. 7,850 డ్రెస్ బ్రాండ్ : పిచిక (Picchika) ధర: రూ. 35,000 గాజుల ధర: రూ. 11,000 హారం ధర: రూ. 25,000 ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అదే నా బ్రాండ్ టిఫిన్. నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వేరే టిఫిన్ చేస్తే తినేదాన్ని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా ‘ఇడ్లీ బుగ్గల పిల్లా’ అంటూ టీజ్ చేసేవారు. బహుశా నా గ్లామర్ సీక్రేట్ అదేనేమో. కానీ ఇప్పుడు అన్నిరకాల టిఫిన్లూ తింటున్నా!. – హన్సిక మోత్వానీ - దీపిక కొండి చదవండి: మహా సముద్రం మూవీకి పారితోషికం తగ్గించిన శర్వానంద్! -
తమన్న సౌందర్య రహస్యం ఇదే!
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారో కవి. అంతటి మధురానందం ఉన్న అందం కోసం అందరూ ఆశ పడతారు.మగువలు మరీనూ. అయితే అందాన్ని కాపాడుకోవడం ఎలా? అన్నది చాలా మందిలో కలిగే ప్రశ్న. అలాంటి వారికి మిల్కీ బ్యూటీ తమన్న సౌందర్య రహస్యం సమాధానం కావచ్చు. అందానికి అందం తమన్న. నవ నవలాడే ఆమె మేను అందాల సీక్రెట్ తమన్న మాటల్లోనే చూద్దాం. నా దినచర్య చాలా నిబద్ధతతో కూడి ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ శాండ్విచ్,ఆమ్లేట్‌ను తీసుకుంటాను. మధ్యాహ్నం ఒక్క చపాతి, రైస్,చికెన్ ఫ్రై తింటాను. నేను ముంబైలో పుట్టి పెరిగినా చపాతీ అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే మధ్యాహ్నం వరి అన్నమే తింటాను. మధ్యలో గంటకోసారి కాయగూరల సూప్ తీసుకుంటాను. ఇక ఆయిల్ ఫుడ్‌ను తక్కువ మోతాదులో తింటుంటాను. రోజుకు మూడు పూటలా ఫుల్‌గా భోజనం లాగించేయకుండా కొంచెం కొంచెం ఆరు సార్లు తింటాను. ఇక సౌందర్య టిప్స్ గురించి చెప్పాలంటే షూటింగ్ సమయంలో లైట్స్ ముందు, ఎండల్లో నిలబడటం వల్ల ముఖం నల్లబడుతుంది. అందువల్ల రోజూ శెనగపిండిలో పెరుగు కలిపి ఆ గుజ్జును ముఖానికి పట్టించి కొంత సేపు తరువాత చల్లని నీళ్లతో కడిగితే ముఖచాయ పెరుగుతుంది. రాత్రి వేళల్లో పడుకునే ముందు తలకు కొబ్బరి నూనె పట్టించి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ జరిగి జుత్తు రాలకుండా ఉంటుంది.చల్లని నీళ్లతో స్నానం చేయడం మంచిది. అన్నిటికంటే ప్రశాంతమైన నిద్ర చాలా మేలు చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మంచి కవితలు చదువుతాను. టెన్షన్‌గా ఉంటే మంచి సినిమా పాటలు వింటాను.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను.మంచినీళ్లు, పళ్ల రసాలు అధికంగా తీసుకుంటాను. షూటింగ్ లేకుంటే ముఖానికి మేకప్ వేసుకోను. అదే విధంగా షూటింగ్‌ను రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా మేకప్ కడిగే పడుకుంటాను.చదువుకునే రోజుల్లో ఎక్కువగా చుడీదారులే ధరించేదాన్ని. నటిని అయిన తరువాత రకరకాల నా దుస్తులను చూసి స్నేహితురాలు ఆశ్చర్యపోతుంటారు. బయట కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చీరలు ధరించడానికే ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే నా ఫేవరేట్ డ్రస్ టీషర్టు, జీన్స్ పాంటు. శారీరక కసరత్తులు చాలా అవసరం. నేను నిత్యం ఎక్సర్సైజులు చేస్తాను. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చివరిగా యోగా చేస్తాను. ఇవీ నేను పాటించే బ్యూటీ టిప్స్. -
స్లీపింగ్ బ్యూటీ
ఇంటర్వ్యూ కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల భరిణె ఆలియాభట్. ఇంతకీ ఆ అందం వెనుక రహస్యం ఏమిటో తెలుసా? నిద్ర. అవును. ‘అవకాశం దొరికితే ఏకధాటిగా పదిహేను గంటలైనా నిద్రపోతాను, అదే నా బ్యూటీ సీక్రెట్’ అంటోంది ఆలియా. ఈ స్లీపింగ్ బ్యూటీ తన గురించి చెప్తోన్న మరిన్ని రహస్యాలివి... * నాకు మూడేళ్లున్నప్పుడు నాన్న గారు (దర్శకుడు మహేష్‌భట్) తన సినిమా ఒకటి సేషెల్స్‌లో తీయాలని ప్లాన్ చేశారు. తాను ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లారు. అప్పుడు నేను తప్పిపోయానట. హోటల్ రూమ్ నుంచి నడచుకుంటూ అలా అలా బయటికి వెళ్లిపోయానట. కంగారుపడి వెతికితే ఓచోట రోడ్డుమీద నడుస్తూ కనిపించానట. అప్పుడు వాళ్లకి దొరక్కపోయి ఉంటే ఇప్పుడు నేనెక్కడుండేదాన్నో! * నాకు జంక్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పడి చస్తాను. రోజులో ఎన్నిసార్లు తినమన్నా, ఎన్ని తినమన్నా తినేస్తాను. అయితే నేనేదీ వేడిగా ఉంటే తినలేను. కాఫీ దగ్గర్నుంచి ప్రతి ఫుడ్‌నీ చల్లారబెట్టుకునే తింటాను. పైగా ఏం తిన్నా అందులో పెరుగు కలుపుకోవడం ఇష్టం నాకు. చైనీస్, ఇటాలియన్, మెక్సికన్... తినేది ఏదైనా అందులో పెరుగు కలిపేస్తా. నేనలా చేస్తుంటే నా ఫ్రెండ్సంతా ముఖాలు అదోలా పెడతారు. అయినా నేను మానను! * నాకు విమాన ప్రయాణాలంటే కూడా యమా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం ఎప్పుడూ అలా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉండిపొమ్మన్నా ఓకే నాకు! * బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? కాళ్లు కడుక్కోవడం. ఆ పని చేశాకే ఏ పనైనా చేస్తా! * నేను అస్తమానం నా స్టయిల్‌ను మార్చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. ఏ కొత్త స్టయిల్ కనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతుంటా. ఒక్కోసారి అది నప్పక నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. దాంతో దెబ్బకి దాన్ని మార్చేసి మరో కొత్త స్టయిల్ మొదలుపెడతాను! * అందరూ తన లవర్ అందంగా ఉండాలి, అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే. ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్ఫ్యూమ్సే వాడతాను. పైగా నెలకొకటి మారుస్తుంటాను! * నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. కానీ పడుకుని మాత్రమే చదవాలి. కూర్చుని చదివితే ఎక్కదు. గుర్తు కూడా ఉండదు. అదో వీక్నెస్లెండి! * నేను హిందీ చాలా బాగా మాట్లాడతానని కొందరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్లకు అలా ఎందుకనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే... నాకు హిందీ అంత బాగా ఏమీ రాదు. స్కూల్లో హిందీ వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ ఓడిపోయేదాన్ని. మరి నా హిందీ బాగోవడమేమిటో! * నేను బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు తెలుసా? నా ఏడుపు నాకే ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరిణీతి చోప్రా ట్రాజెడీ సీన్లలో ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. అందుకే ‘ఇషక్జాదే’ సినిమా చూశాక తన దగ్గరకు వెళ్లి... ‘నాకు నీ అంత బాగా ఏడవడం నేర్పించు’ అని అడిగాను! * నేను చాలా యాక్టివ్‌గా ఉంటానని అందరూ అంటుంటారు. నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలీదు పాపం. నిద్రపోవడమంటే నాకెంత ఇష్టమో! షూటింగ్ లేనప్పుడు పద్నాలుగు పదిహేను గంటలు ఏక ధాటిగా నిద్రపోతుంటాను. అయినా గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా అవసరమే తెలుసా! -
నీ అందం రహస్యం ఏమిటో!
కోలీవుడ్‌లో హీరోయిన్ల హీరో ఎవరంటే వచ్చే సమాధానం ఆర్య అనే. ఈయన బిరియాని పెట్టి హీరోయిన్లను బుట్టలో పడేసుకుంటారనే ప్రచారం ఉంది. నయనతార, త్రిష, హన్సిక ఇలా అందరూ ఆర్యను ఇష్టపడతారు. నటి ఎమిజాక్సన్ అయితే నా తొలి హీరో అంటూ తెగపొగిడేస్తుంది. నటి త్రిష ఆర్య నా డార్లింగ్ అంటున్నారు. ఆరంభం చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోందట. ఇక అసలు విషయం ఏమిటంటే మామూలుగానే హీరోయిన్లకు జోకులతో ఆటపట్టించే ఆర్య తాజాగా ట్విట్టర్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకేముంది ట్విట్టర్లో తన చిలిపి చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. ఇటీవల నటి తాప్సీ గురించి ట్విట్టర్లో పేర్కొంటూ నువ్వు చాలా అందంగా ఉంటావు. దాని రహస్యం ఏమిటో చెప్పవా? డార్లింగ్ అంటూ కవ్వించారట. అందుకు ఆమె నీకు వేరే పని లేదా? అంటూ చిరు కోపంతోనే చికాకు పడిందట. అయినా వదలకుండా ఆర్య నిజంగానే పనిలేదుగాని నేనడిగిన దానికి బదులివ్వలేదు అంటూ ఆటపట్టించారట. ఇలా హీరోయిన్లతో జోవియల్‌గా ఉండడం ఆర్య హాబీ. అందుకే ఆ భామలు ఇష్టపడతారనుకుంటా.