కీర్తీ సురేష్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! | Keerthy Suresh Shares Her Beauty Secret | Sakshi
Sakshi News home page

కీర్తీ సురేష్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Published Sun, Jul 2 2023 11:17 AM | Last Updated on Fri, Jul 14 2023 3:56 PM

Keerthy Suresh Shares Her Beauty Secret - Sakshi

బాలనటిగా తెరంగేట్రం చేసి.. హీరోయిన్‌గా తెలుగు, తమిళం, మళయాళ భాషలలో తనదైన శైలిలో సత్తా చాటుతోంది కోలివుడ్‌ హీరోయిన​ కీర్తీ సురేష్‌ . ఆమె ఫ్యాషన్‌ డిజైన్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఇక ఆమె హీరోయిన్‌గా గ్లామర్‌ని మెయింటైన్‌ చేయాల్సిందే. ఐతే ఆమె అందుకోసం సహజసిద్ధమైన వాటినే వాడతానని, కెమకల్స్‌ జోలికిపోనని చెబుతుంది.

ఈ సందర్భంగా తన బ్యూటీ క్రెట్‌ని గురించి చెబుతూ.. నారింజ తొక్కతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటాను. అలాగే ఇలా నేచ్యురల్‌ ఫేస్‌ మాస్క్స్‌ వేసుకునేప్పుడు పసుపును మరవను. ఇది స్కిన్‌ను పాలిష్‌ చేస్తుంది. ఈ పసుపు చిట్కా మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. అలాగే నేనెప్పుడూ కెమికల్‌ స్క్రబ్స్‌ జోలికి వెళ్లను. గులాబీ–– బాదంపప్పు నుంచి ఓట్‌మీల్‌ స్క్రబ్‌ వరకు సహజసిద్ధమైన స్క్రబ్స్‌నే వాడతాను!
 – కీర్తి సురేశ్‌

(చదవండి: ష్యాషన్‌ సెన్స్‌ ఉట్టిపడేలా..వ‌ర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement