ఎల్‌ఈడీ లిప్‌ మెషిన్‌ | How does lip booster work? | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లిప్‌ మెషిన్‌

Published Sun, Oct 6 2024 7:07 AM | Last Updated on Sun, Oct 6 2024 10:02 AM

How does lip booster work?

ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్‌ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్‌ఈడీ లిప్‌ మెషిన్‌  అధరాలను అందంగా మార్చేస్తుంది.

పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్‌  నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్‌ పెనిట్రేటింగ్‌ ఎల్‌ఈడీ  టెక్నాలజీతో యూజర్‌ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్‌  ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్‌ డివైస్‌తో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ మెషిన్‌ని మీ మేకప్‌ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్‌ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. 

ఈ పరికరం కొలాజన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్‌మెంట్‌ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్‌ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్‌  చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్‌ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్‌ బేస్‌ వేరుగా, ట్రీట్‌మెంట్‌ వైబ్రేషన్‌ మసాజర్‌ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement